ఏకంగా 8,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. రోజుకు 6 గంటల పాటు నిరంతరంగా సోషల్ మీడియా, గేమింగ్, వీడియోలు చూసినా కూడా ఈ బ్యాటరీ వరుసగా 3 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ గట్టిగా చెబుతోంది.
Realme 16T 5G : ప్రస్తుతం మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లలో ఎంత పెద్ద డిస్‌ప్లే, ఎంత పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఉన్నా.. సాయంత్రం అయ్యేసరికి బ్యాటరీ లో అని సిగ్నల్ ఇస్తే వచ్చే ఆందోళన అంతా ఇంతా కాదు. ఆఫీస్ ప్రయాణాలు, రీల్స్ స్క్రోలింగ్, గేమింగ్ సెషన్లతో ఫోన్ చార్జింగ్ ఎప్పుడు అయిపోతుందో తెలియక జనాలు జేబుల్లో చార్జర్లు, పవర్ బ్యాంకులు వేసుకుని తిరుగుతున్నారు. సరిగ్గా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ.. ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మి సరికొత్త రియల్‌మి 16T 5G ఫోన్‌ను మే 22న భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కేవలం బ్యాటరీ మాత్రమే కాదు.. కంటెంట్ క్రియేటర్లను పిచ్చెక్కించే కొన్ని వింత ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ ఫోన్ మైండ్ బ్లోయింగ్ టాకింగ్ పాయింట్ ఏంటంటే.. ఇందులో ఏకంగా 8,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. రోజుకు 6 గంటల పాటు నిరంతరంగా సోషల్ మీడియా, గేమింగ్, వీడియోలు చూసినా కూడా ఈ బ్యాటరీ వరుసగా 3 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ గట్టిగా చెబుతోంది. దీనివల్ల ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి గంటకూ బ్యాటరీ పర్సంటేజ్ చూసుకునే టెన్షన్ పూర్తిగా తప్పిపోతుంది.
ఇంత పెద్ద 8000mAh బ్యాటరీకి చార్జింగ్ ఎప్పుడు అవుతుంది అని కంగారు పడక్కర్లేదు. దీనికోసం కంపెనీ 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చింది. ఇది కేవలం 48 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీని ఫుల్ చేస్తుంది. అంతేకాదు, ఇందులో గేమర్ల కోసం బైపాస్ చార్జింగ్ టెక్నాలజీ ఉంది. అంటే చార్జింగ్ పెట్టి గేమ్ ఆడినా ఫోన్ అస్సలు హీట్ ఎక్కదు. అలాగే ఈ ఫోన్ ద్వారా రివర్స్ చార్జింగ్ సపోర్ట్‌తో మన స్నేహితుల ఫోన్లకు లేదా ఇతర చిన్న గ్యాడ్జెట్లకు పవర్ బ్యాంక్‌లా మారి చార్జింగ్ కూడా షేర్ చేయవచ్చు.
కంటెంట్ క్రియేటర్లు, వ్లాగర్లు, రీల్స్ చేసేవారి కోసం రియల్‌మి ఈ ఫోన్ వెనుక కెమెరా మోడ్యూల్ పక్కనే ఒక రియర్ సెల్ఫీ మిర్రర్ అంటే ఒక చిన్న అద్దాన్ని అమర్చింది. సాధారణంగా ఫ్రంట్ కెమెరా కంటే బ్యాక్ కెమెరా క్వాలిటీ బాగుంటుంది కాబట్టి, ఆ బ్యాక్ కెమెరాతో మన ముఖం ఎలా కనిపిస్తుందో ఈ అద్దంలో చూసుకుంటూ పర్ఫెక్ట్ క్వాలిటీతో సెల్ఫీలు, వ్లాగ్ వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు. దీనితో పాటు ఏఐ ఇన్‌స్టంట్ క్లిప్ ఫీచర్ ద్వారా మన ఫోటోలను కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ట్రావెల్ రీల్స్‌లా మార్చేయవచ్చు.
కేవలం నంబర్ల కోసం వందల మెగాపిక్సెల్స్ పెంచేయకుండా.. ఈ ఫోన్ క్వాలిటీపై ఫోకస్ పెట్టింది. రియల్‌మి 16T 5G ఫోన్‌లో 50MP సోనీ AI పోర్ట్రెయిట్ కెమెరాను లూమాకలర్ ఇమేజ్ ఇంజిన్‌తో కలిపి ఇచ్చారు. ఇది ఫేస్ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా, ముఖంపై రంగులు వెలిసిపోయినట్లు కాకుండా.. అత్యంత సహజమైన స్కిన్ టోన్స్‌తో కూడిన అద్భుతమైన పోర్ట్రెయిట్ ఫోటోలను అందిస్తుంది. అందుకే ఇది రూ.30,000 బడ్జెట్‌లో బెస్ట్ కెమెరా ఫోన్‌గా నిలుస్తోంది.![]()
ఈ ఫోన్ లోపల మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అమర్చారు. అయితే, రియల్‌మి ఈ ఫోన్‌పై ఏకంగా 72 నెలల (6 సంవత్సరాల) ఫ్లూయెన్సీ ప్రొటెక్షన్ ప్రామిస్ ఇస్తోంది. అంటే ఫోన్ కొన్న 6 ఏళ్ల వరకు కూడా ఎక్కడా హ్యాంగ్ అవ్వకుండా, యాప్‌లు ఓపెన్ చేసేటప్పుడు స్లో అవ్వకుండా సాఫీగా పనిచేసేలా సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ చేశారు. దీనికి తోడు స్క్రీన్ విషయానికి వస్తే.. 144Hz హై-రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్‌ప్లేను ఇచ్చారు.
ఈ ఫోన్ ఎంత గట్టిదంటే.. దీనికి అత్యంత అరుదైన IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి. అంటే అనుకోకుండా కాఫీ వొలికినా, వర్షంలో తడిసినా, స్విమ్మింగ్ పూల్‌లో పడినా లేదా హై-ప్రెజర్ వాటర్ జెట్స్ పడినా ఫోన్ సేఫ్‌గా ఉంటుంది. దీనికి తోడు మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల చేతిలో నుంచి కింద పడినా గీతలు పడకుండా, పగలకుండా తట్టుకుంటుంది. బ్యాక్ ప్యానెల్ గ్లీమింగ్ వింగ్స్ గ్రేడియంట్ డిజైన్‌తో ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.
రియల్‌మి 16T 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అఫీషియల్ వెబ్‌సైట్లలో మూడు వేరియంట్లలో మే 27 నుంచి సేల్స్‌కు అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫర్లు, యూపీఐ డిస్కౌంట్లను కలుపుకుని ఎఫెక్టివ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
* 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్: అసలు ధర రూ. 29,999 (ఆఫర్ ధర: రూ. 26,999)
* 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్: అసలు ధర రూ. 31,999 (ఆఫర్ ధర: రూ. 28,999)
* 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్: అసలు ధర రూ. 34,999 (ఆఫర్ ధర: రూ. 31,999)
ఇది స్టార్‌లైట్ బ్లాక్, స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌లైట్ రెడ్ అనే మూడు అట్రాక్టివ్ కలర్స్‌లో దొరుకుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
iOS 27 Update for iPhone Adds Impersonation Risk Detection Feature to Protect You Against Scams