స్మార్ట్ స్పీకర్ల లోపల అమెజాన్ కంపెనీ స్వయంగా డిజైన్ చేసిన కస్టమ్ సిలికాన్ AZ3, AZ3 Pro సిరీస్ చిప్‌లను అమర్చింది.
Photo Credit: Amazon
Amazon Echo Dot Max features a dedicated microphone button
Amazon : స్మార్ట్ హోమ్ గ్యాడ్జెట్ల ప్రపంచంలో గ్లోబల్ జెయింట్ అమెజాన్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. గత ఏడాది అమెరికాలో జరిగిన సెప్టెంబర్ 2025 ఈవెంట్‌లో ప్రపంచానికి పరిచయమైన రెండు మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ స్పీకర్లు ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అడుగుపెట్టాయి. బుధవారం రోజున అమెజాన్ తన సరికొత్త ఎకో డాట్ మాక్స్, ప్రీమియం ఎకో స్టూడియో స్పీకర్లను అధికారికంగా లాంచ్ చేసింది. కేవలం పాటలు వినడానికే కాకుండా.. మీ ఇల్లాన్నింటినీ తమ కంట్రోల్‌లోకి తెచ్చుకునే మైండ్ బ్లోయింగ్ ఏఐ ఫీచర్లతో ఈ డివైజ్‌లు రూపుదిద్దుకున్నాయి.
ఈ సరికొత్త స్మార్ట్ స్పీకర్ల లోపల అమెజాన్ కంపెనీ స్వయంగా డిజైన్ చేసిన కస్టమ్ సిలికాన్ AZ3, AZ3 Pro సిరీస్ చిప్‌లను అమర్చింది. ఎకో డాట్ మాక్స్ లో AZ3 చిప్ ఉండగా, ఎకో స్టూడియోలో మరింత పవర్‌ఫుల్ AZ3 ప్రో ప్రొసెసర్‌ను ఇచ్చారు. ఈ సరికొత్త చిప్‌ల వల్ల మనం పిలవగానే అలెక్సా స్పందించే వేగం ఏకంగా 50 శాతం పెరిగింది. అంతేకాదు, మన మాటలను, ఇంట్లోని సంభాషణలను మునుపటి కంటే చాలా ఖచ్చితత్వంతో ఈ స్పీకర్లు గుర్తుపట్టగలవు.
చిన్న సైజులోనే ఇల్లాంతటినీ ఊపేసేలా ఎకో డాట్ మాక్స్ డిజైన్ చేయబడింది. పాత ఐదో తరం ఎకో డాట్ స్పీకర్లతో పోలిస్తే.. ఈ సరికొత్త మాక్స్ మోడల్ ఏకంగా 3 రెట్లు (3x) ఎక్కువ బేస్ సౌండ్‌ను ప్రొడ్యూస్ చేస్తుందని అమెజాన్ గట్టిగా చెబుతోంది. ఇందులో టూ-వే స్పీకర్ సెటప్‌తో పాటు ఒక ప్రత్యేకమైన 'హై-ఎక్స్‌కర్షన్' వూఫర్, ఒక ట్వీటర్‌ను అమర్చారు. ఇది గదిలోని స్పేస్‌ను బట్టి ఆటోమేటిక్‌గా సౌండ్‌ను అడ్జస్ట్ చేయగలదు.
ఇక మ్యూజిక్ లవర్స్‌ను పిచ్చెక్కించేలా ప్రీమియం ఎకో స్టూడియో స్మార్ట్ స్పీకర్ అందుబాటులోకి వచ్చింది. ఇది స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో త్రీడీ సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. దీని లోపల ఒక పవర్‌ఫుల్ వూఫర్‌తో పాటు మూడు ఫుల్-రేంజ్ డ్రైవర్లు ఉన్నాయి. దీని బాడీకి 3D క్నిట్ ఫ్యాబ్రిక్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల ఆడియో చాలా క్లియర్‌గా, బరువైన బేస్‌తో గది మొత్తం మారుమ్రోగిపోతుంది.
ఈ రెండు స్పీకర్లలోనూ ఇన్-బిల్ట్ స్మార్ట్ హోమ్ హబ్ సపోర్ట్ ఉంది. ఎకో డాట్ సిరీస్‌లో ఈ ఫీచర్ రావడం ఇదే మొదటిసారి. ఇది వైఫై, జిగ్‌బీ, థ్రెడ్, మ్యాటర్, బ్లూటూత్ కనెక్టివిటీలను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఇంట్లోని స్మార్ట్ లైట్లు, ఏసీలు, ఫ్యాన్లు, స్మార్ట్ ప్లగ్స్‌ను ఎటువంటి అదనపు డివైజ్ అవసరం లేకుండా కేవలం వాయిస్ కమాండ్‌తో కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఒకేసారి ఐదు ఎకో స్పీకర్లను మీ ఫైర్ టీవీ స్టిక్‌కు కనెక్ట్ చేసి థియేటర్‌లాంటి అలెక్సా హోమ్ థియేటర్ సెటప్ కూడా చేసుకోవచ్చు.
![]()
స్మార్ట్ స్పీకర్లు ఇంట్లో ఉన్నప్పుడు మన వ్యక్తిగత మాటలను రికార్డ్ చేస్తాయేమో అన్న భయాలకు అమెజాన్ చెక్ పెట్టింది. ఈ రెండు డివైజ్‌లలోనూ ప్రైవసీ కోసం ప్రత్యేకంగా ఒక ఫిజికల్ మైక్రోఫోన్ టోగుల్ బటన్ ఇచ్చారు. దీన్ని నొక్కితే స్పీకర్ మన మాటలను అస్సలు వినదు. అంతేకాదు, అలెక్సా యాప్‌లోకి వెళ్లి మనం మాట్లాడిన వాయిస్ రికార్డింగులను ఎప్పటికప్పుడు చూసుకుని డిలీట్ చేసే ఆప్షన్ కూడా కల్పించారు.
Jio Plan : జియో యూజర్లకు అంబానీ బంపర్ ఆఫర్.. రూ.200 రీఛార్జ్‌తో మొత్తం 15 ఓటీటీలు ఫ్రీ
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో సేల్స్..
ఈ రెండు సరికొత్త అమెజాన్ స్మార్ట్ స్పీకర్లు ఇప్పటికే అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్లలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* అమెజాన్ ఎకో డాట్ మాక్స్ ధర: రూ. 10,999 (ఇది అమేథిస్ట్, గ్లేసియర్ వైట్, గ్రాఫైట్ కలర్ ఆప్షన్లలో దొరుకుతుంది).
* అమెజాన్ ఎకో స్టూడియో ధర: రూ. 23,999 (ఇది గ్లేసియర్ వైట్, గ్రాఫైట్ అనే రెండు కలర్స్‌లో లభిస్తుంది).
* లాంచ్ ఆఫర్: అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసే ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ఏకంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉచిత డెలివరీ లభిస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Samsung One UI 9 Rollout Starts for Galaxy S26 Series: Check Eligible Galaxy Devices, New Features