ఇందులో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో వంటి మోడళ్లు చాలా తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి.
iPhone
iPhone : ప్రస్తుత రోజుల్లో సరికొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల ధరలు చుక్కలను తాకుతున్నాయి. కొత్త ఐఫోన్ కొనాలంటే సామాన్యులకు భారీ బడ్జెట్ అవసరమవుతోంది. ఇలాంటి తరుణంలో తక్కువ ధరకే ప్రీమియం ఫోన్లను వాడాలనుకునే కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ప్రముఖ ప్రీమియం రిన్యూడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కంట్రోల్ జెడ్ తన ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మార్కెట్లో Anniversary Saleను ఘనంగా ప్రారంభించింది. ఈ సేల్ జూలై 6వ తేదీన ప్రారంభం కాగా, జూలై 10వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో వంటి మోడళ్లు చాలా తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్లు కేవలం కంట్రోల్ జెడ్ అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే, పరిమిత స్టాక్‌తో లభిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
ఏ రోజు ఏ ఐఫోన్‌పై ఆఫర్ ఉందంటే?
కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ సేల్ కాలవ్యవధిలో ప్రతి రోజు ఒక ప్రత్యేక ఐఫోన్ మోడల్‌పై కంపెనీ స్పెషల్ ప్రైస్‌ను ఆఫర్ చేస్తోంది. జూలై 6న ఐఫోన్ 13 కేవలం రూ.31,999 లకే అందుబాటులోకి రాగా, జూలై 7న ఐఫోన్ 13 ప్రో మోడల్‌ను రూ.43,499 లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే జూలై 8వ తేదీన ఐఫోన్ 14 ప్రోను రూ.52,999 లకే అందిస్తున్నారు. ఇక క్రేజీ మోడల్ అయిన ఐఫోన్ 15ను జూలై 9న రూ.44,499 లకే , జూలై 10న అత్యంత ప్రీమియం మోడల్ ఐఫోన్ 15 ప్రోను కేవలం రూ.66,499 లకే కొనుగోలు చేసే సువర్ణావకాశాన్ని కల్పించారు.
ప్రీమియం ఫోన్ల ధరలు భారంగా మారాయా?
కంట్రోల్ జెడ్ సంస్థ వ్యవస్థాపకుడు యుగ్ భాటియా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంపెనీ విజయవంతంగా ఆరేళ్లు పూర్తి చేసుకోవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. మార్కెట్లో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల ధరలు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయని, ఇలాంటి సమయంలో బడ్జెట్ పరిమితులు ఉన్న కస్టమర్లకు తమ సరిఫైడ్ రిన్యూడ్ డివైసెస్ ఒక అద్భుతమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం తక్కువ ధరకే అందించడమే కాకుండా, కస్టమర్లకు పూర్తి నమ్మకాన్ని ఇవ్వడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన వెల్లడించారు.
Samsung : శాంసంగ్ నుంచి సరికొత్త మిడ్-బడ్జెట్ ఫోన్.. త్వరలోనే మార్కెట్లోకి Samsung Galaxy F70 Pro
నాణ్యమైన క్వాలిటీ టెస్టింగ్
సాధారణంగా సెకండ్ హ్యాండ్ లేదా రిన్యూడ్ ఫోన్లు అనగానే కస్టమర్లలో నాణ్యతపై కొన్ని అనుమానాలు ఉంటాయి. అయితే కంట్రోల్ జెడ్ కంపెనీ విక్రయించే ప్రతి స్మార్ట్‌ఫోన్ కఠినమైన, అనేక దశల క్వాలిటీ టెస్టింగ్‌లకు గురవుతుందని సంస్థ స్పష్టం చేసింది. ఫోన్ లోపల, బయట అన్ని విడిభాగాలు సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వీటికి సర్టిఫికేషన్ ఇస్తారు. అంతేకాకుండా, వినియోగదారులకు మరింత భరోసా కల్పిస్తూ ఏకంగా 18 నెలల వారంటీని కూడా అందిస్తున్నారు. ఈ నమ్మకమైన సేవల వల్లే భారతదేశంలో ప్రీమియం రిన్యూడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఐఫోన్ కొనాలనుకుంటే, స్టాక్ ముగిసేలోపు కంట్రోల్ జెడ్ వెబ్‌సైట్‌ను సందర్శించి మీకు నచ్చిన మోడల్‌ను బుక్ చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Bee Frontier, Bee Eclipse AI Devices Launched: Price, Specifications