ఈ సరికొత్త శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను మిడ్-రేంజ్ విభాగంలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
Photo Credit: Samsung
Samsung Galaxy M47
Samsung : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ భారతీయ మార్కెట్లలో తన పట్టును మరింత పెంచుకునేందుకు సరికొత్త మొబైల్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మిడ్-రేంజ్ బడ్జెట్ విభాగంలో Samsung Galaxy F70 Pro పేరుతో ఒక పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు లీకుల ద్వారా సమాచారం అందుతోంది. ప్రముఖ టెక్ వెబ్‌సైట్ శామీ గురు నివేదిక ప్రకారం.. ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే బ్లూటూత్ సిగ్ సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించింది. అక్కడ ఈ ఫోన్ SM-E476B/DS అనే మోడల్ నంబర్‌తో లిస్ట్ అయింది. ఇది ఈ సిరీస్‌కు సంబంధించిన ఇంటర్నేషనల్ వేరియంట్ కావచ్చునని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూ. 25 వేల ధరలో ప్రీమియం లేదర్ లుక్
ఈ సరికొత్త శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను మిడ్-రేంజ్ విభాగంలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ.25,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ బడ్జెట్‌లో ఫోన్ లుక్ ప్రీమియంగా కనిపించేలా కారు వెనుక భాగంలో ఆకర్షణీయమైన లెదర్ ఫినిషింగ్ బ్యాక్ ప్యానెల్‌ను అందించబోతున్నారు. దీనితో పాటు కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన వన్ యూఐ 8.5 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుందని సమాచారం.
120Hz సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
ఫీచర్ల విషయానికి వస్తే, శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో మోడల్లో 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.7 ఇంచుల భారీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. దీనివల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవుతూ మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ బాగుండటానికి క్వాల్కమ్ కంపెనీకి చెందిన స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 పవర్‌ఫుల్ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది, అందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ (50MP) సామర్థ్యంతో వస్తుందని లీకుల ద్వారా తెలుస్తోంది.
Flipkart GOAT Sale : ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ధమాకా.. రూ.45 వేల బడ్జెట్‌లో శాంసంగ్, పిక్సెల్ ఫోన్ల మధ్య గట్టి పోటీ
6,000 mAh పవర్‌ఫుల్ బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ కెపాసిటీ. హెవీగా మొబైల్ వాడే వారి కోసం ఇందులో ఏకంగా 6,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చనున్నారు. దీనికి తోడు ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవ్వడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా శాంసంగ్ అందించనుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించి కానీ, ఇందులోని పూర్తి స్పెసిఫికేషన్లపై కానీ శాంసంగ్ కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకపోతే, ఈ ఫోన్ భారత ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌లోనూ లిస్ట్ అవ్వడం వల్ల, ఇది త్వరలోనే మార్కెట్లోకి రావడం ఖాయమని తెలుస్తోంది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్
టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రాబోయే గెలాక్సీ F70 ప్రో హార్డ్‌వేర్ ఫీచర్లు, ఇటీవలే లాంచైన Samsung Galaxy M47 5G మోడల్‌కు దాదాపు సమానంగా ఉండనున్నాయి. గెలాక్సీ M47 ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. అందులో 1,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రీఫ్రెష్ రేట్ గల 6.7 ఇంచుల sAMOLED డిస్‌ప్లే ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 710 జీపీయూను ఇచ్చారు. కెమెరాల పరంగా చూస్తే, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ పోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 5MP ఆల్ట్రా వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాను అందించారు. గెలాక్సీ M47 లో కూడా 6,000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు. దాదాపు ఇవే ఫీచర్లతో మరికొన్ని అప్‌డేట్స్ జోడించి కొత్త గెలాక్సీ F70 ప్రో మోడల్‌ను శాంసంగ్ తీసుకురాబోతోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Vivo Pad FE Reportedly Surfaces on TDRA, TUV Certifications; Charging Specifications Revealed
OpenAI Lawsuit Says Employee Who Left for Apple Took Files About Unreleased Device