కొంతమంది ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు తమ మొబైల్‌లో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ఓపెన్ చేయగా “Get Apple Music at no extra cost” అనే బ్యానర్ కనబడిందని కన్ఫామ్ చేశారు. ఈ ఆఫర్‌ను ఆరు నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందిస్తామని ఎయిర్‌టెల్ కంపెనీ చెబుతోంది.
Photo Credit: Apple
ఈ ఆఫర్ గతంలో ఎయిర్‌టెల్ వై-ఫై మరియు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు మాత్రమే ప్రత్యేకంగా ఉండేది.
భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన ప్రీపెయిడ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ప్రీపెయిడ్ సిమ్ వాడుతున్న వినియోగదారులకు కూడా ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. గత ఫిబ్రవరిలో ఎయిర్‌టెల్, ఆపిల్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ హోమ్ వై-ఫై మరియు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకే ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడు ఇదే ఆఫర్ ను ప్రీపెయిడ్ వినియోగదారులకు కూడా అందించడానికి సిద్ధమైంది. ఈ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చు.
కొంతమంది ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు తమ మొబైల్‌లో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ ఓపెన్ చేయగా “Get Apple Music at no extra cost” అనే బ్యానర్ కనబడిందని కన్ఫామ్ చేశారు. ఈ ఆఫర్‌ను ఆరు నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందిస్తామని ఎయిర్‌టెల్ కంపెనీ చెబుతోంది. అలాగే ఇతర టెక్నాలజీ నిపుణులు కూడా ఈ ఆఫర్ అవైలబుల్ గా ఉన్నట్లు నిర్ధారించారు.
ఆరు నెలల ఉచిత ఆఫర్ కాలం పూర్తైన తర్వాత, వినియోగదారులు ఆపిల్ మ్యూజిక్‌ను కొనసాగించాలనుకుంటే నెలవారీ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్‌ను పొందడానికి ముందుగా ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్ లోని ఆఫర్‌ను క్లెయిమ్ చేసి, ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ తీసుకోవాలి. ఆ తర్వాత మీ Apple IDని లింక్ చేయడం ద్వారా ఆపిల్ మ్యూజిక్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఆపిల్ మ్యూజిక్ వ్యక్తిగత ప్లాన్ ధర నెలకు రూ.99 కాగా, ఫ్యామిలీ ప్లాన్ ధర నెలకు రూ.149గా ఉంది. అలాగే విద్యార్థుల కోసం ప్రత్యేక స్టూడెంట్ ప్లాన్ నెలకు కేవలం రూ.59కే అందిస్తున్నారు. కానీ, దీన్ని పొందడానికి సరైన స్టూడెంట్ ఐడీ అవసరం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఐడి ఉన్న స్టూడెంట్స్ ఆపిల్ మ్యూజిక్ ను ఎంజాయ్ చేయవచ్చు.
ఇప్పటివరకు ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ హోమ్ వై-ఫై (Xstream Fiber) మరియు పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మాత్రమే లభ్యమయ్యేది. ఉదాహరణకు, Xstream Fiber వినియోగదారులు రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ తీసుకుంటే ఆపిల్ TV+ లో ఉండే కంటెంట్‌ను చూడగలుగుతున్నారు. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు కూడా రూ.999 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌తో ఆరు నెలల పాటు ఆపిల్ TV+ మరియు ఆపిల్ మ్యూజిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతున్నారు. ఇప్పుడు ఈ క్యాటగిరీలోకి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్స్ కూడా వచ్చి చేరారు.
ఆపిల్ మ్యూజిక్‌తో పాటు ఎయిర్‌టెల్ ఇటీవల Perplexity Pro ను కూడా మొబైల్, వై-ఫై, డీటిహెచ్ వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా, గూగుల్ తో భాగస్వామ్యం చేసుకుని Wi-Fi మరియు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ఆరు నెలల పాటు గూగుల్ వన్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ప్రకటించింది. ఉచిత ఆఫర్లను ప్రకటించి ఎయిర్‌టెల్ మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. అలాగే ఈ ఆఫర్ల వల్ల ఎయిర్‌టెల్ సిమ్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు కూడా ఎక్కువ బెనిఫిట్ లు పొందే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్ లో కానీ, కుటుంబ సభ్యుల్లో గాని ఎయిర్‌టెల్ సిమ్ వినియోగిస్తున్న వారికి ఈ ఆఫర్ గురించి తెలియజేయండి.
ప్రకటన
ప్రకటన