అధునాతమైన Lava Blaze AMOLED 2 5G స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి.
Photo Credit: lava
లావా బ్లేజ్ AMOLED 2 5G స్టీరియో స్పీకర్లతో అమర్చబడింది
దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా నుంచి మరో కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. Lava Blaze AMOLED 2 5G (లావా బ్లేజ్ AMOLED 2 5G) సోమవారం భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ రెండు విభిన్న రంగు ఎంపికలలో వచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7060 చిప్‌సెట్‌తో ఈ కొత్త మోడల్‌ను రూపొందించారు. లావా బ్లేజ్ AMOLED 2 5G 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇక ఈ మోడల్ 6GB RAMతో అమర్చబడింది. ఇది 50-మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. లావా బ్లేజ్ AMOLED 2 5G ఇక డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IP64-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది.
లావా బ్లేజ్ AMOLED 2 5G ధర 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 13,499. ఇది ఫెదర్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో ఉంటుంది. ఆగస్టు 16 నుండి అమెజాన్ ద్వారా అమ్మకానికి వస్తుంది. కొత్తగా ప్రకటించిన లావా బ్లేజ్ AMOLED 2 5G కోసం డోర్‌స్టెప్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
Lava Blaze AMOLED 2 5G అనే ఈ మోడల్ Android 15 సాఫ్ట్ వేర్ మీద వస్తుంది. ఇది ఒక Android అప్‌గ్రేడ్ (Android 16 కు) రెండు సంవత్సరాల భద్రతా నవీకరణలను అందుకుంటుందని నిర్ధారించబడింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, హోల్ పంచ్ కెమెరా కటౌట్‌తో 6.67-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7060 SoC, 6GB LPDDR5 RAM, 128GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే, హ్యాండ్‌సెట్‌లో Sony IMX752తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఇక ఇది డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది.
లావా బ్లేజ్ AMOLED 2 5Gలో స్టీరియో స్పీకర్లు, థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకమైన కూలింగ్ చాంబర్ ఉన్నాయి. కంపెనీ తన సరికొత్త హ్యాండ్‌సెట్‌ను 5,000mAh బ్యాటరీతో, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో తీసుకు వచ్చింది. ఈ న్యూ మోడల్ 7.55mm మందం, 174 గ్రాముల బరువు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన