హాట్ 60i 5G 6.75-అంగుళాల స్క్రీన్‌తో వస్తోంది. HD+ రెజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటుంది. వెనుక భాగంలో రెక్టాంగ్యులర్ కెమెరా ఐలాండ్ సెట్ అప్తో, మెట్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ డిజైన్తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ వినియోగిస్తున్నారు.
Photo Credit: Flipkart
ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు మ్యాట్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ ఉంటాయి
ఇన్ఫినిక్స్ తమ హాట్ సిరీస్‌లో కొత్త మోడల్ హాట్ 60i 5G ను ఈ నెల భారత్‌లో విడుదల చేయబోతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయ్యింది. అందులోని సమాచారం ప్రకారం, భారత్‌లో అధికారిక లాంచ్ ఆగస్టు 16న జరగనుంది. కంపెనీ ఈ మోడల్‌ను షాడో బ్లూ, మాన్సూన్ గ్రీన్, స్లీక్ బ్లాక్, ప్లమ్ రెడ్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందించనుంది.హాట్ 60i 5G అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్ మరియు ఇన్ఫినిక్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రారంభమవుతాయి. ఇదే ఫోన్ 4G వెర్షన్ జూన్‌లో బంగ్లాదేశ్‌లో విడుదలైంది. ఈ మోడల్ 6GB + 128GB బేస్ వేరియంట్‌కు ప్రారంభ ధరగా BDT 13,999 (సుమారు రూ.10,000)గా ప్రకటించిన విషయం తెలిసిందే. భారత మార్కెట్‌లో 5G మోడల్ ధర 4G వెర్షన్‌కు దగ్గరగా లేదా కొంచెం అధికంగా ఉండే అవకాశముంది.
హాట్ 60i 5G 6.75-అంగుళాల స్క్రీన్‌తో వస్తోంది. HD+ రెజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ స్మూత్‌గా ఉంటుంది. వెనుక భాగంలో రెక్టాంగ్యులర్ కెమెరా ఐలాండ్ సెట్ అప్తో, మెట్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ డిజైన్తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ వినియోగిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే బాక్సులోనే ఆండ్రాయిడ్ 15 బేస్డ్ XOS 15 అందిస్తున్నారు. డైలీ యూజ్, సోషల్ మీడియా, లైట్ గేమింగ్ వంటి పనులకు ఇది సరైన కాంబోగా చెప్పవచ్చు.
ఇన్ఫినిక్స్ ప్రకారం, హాట్ 60i 5Gలో 6,000mAh భారీ బ్యాటరీ బ్యాక్అప్ ఇస్తున్నారు. తమ సెగ్మెంట్‌లో ఇదో ప్రత్యేకతగా కంపెనీ చెబుతోంది. మ్యూజిక్ ప్లేబ్యాక్ విషయంలో 128 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని ఇన్ఫినిక్స్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. లాంగ్ టైం స్టాండ్బై, తరచుగా చార్జింగ్ పెట్టే అవసరం లేకుండా ఉండటం ఇలాంటి బ్యాటరీకి ప్లస్ పాయింట్స్.
బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్లో 50MP ప్రైమరీ సెన్సర్ ఉండనుంది. డ్యూయల్ LED ఫ్లాష్, HDR, పనోరమా వంటి షూటింగ్ మోడ్‌లు కూడా అందిస్తామని ఇన్ఫినిక్స్ తెలిపింది. సోషల్ మీడియా కోసం ఫాస్ట్ షాట్స్ తీసే యూజర్లకు ఇది ఉపయోగపడుతుంది.
ఈ ఫోన్ IP64 రేటింగ్ తో వస్తుంది. దీనివల దుమ్ములో పడిన, నీటిలో పడిన ఫోన్ ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. బ్లూటూత్ వాకీ-టాకీ కనెక్టివిటీ ఫీచర్ ఈ ఫోన్లో ఉంది. దీనివల్ల అర్బన్ అవుట్‌డోర్ లేదా టీమ్ యూజ్ సందర్భాల్లో ఇది బాగా యూస్ అవుతుంది. One-Tap Infinix AI ఆప్షన్ వల్ల ఒక టాప్‌తో AI యూసేజ్ ఈజీగా మారుతుంది.
చివరిగా చెప్పాలంటే, మిడ్ రేంజ్ బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకున్న ఇన్ఫినిక్స్, పెద్ద బ్యాటరీ, 120Hz స్క్రీన్, 50MP కెమెరా, తాజా ఆండ్రాయిడ్ 15 బేస్డ్ UIతో హాట్ 60i 5G ను ఇంట్రెస్టింగ్ ఆప్షన్‌గా పోటీకి తెస్తుంది. ధరను దృష్టిలో పెట్టుకుని 5G ఎంట్రీ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అధికారిక ధర, వేరియంట్లు, బ్యాటరీ ఛార్జింగ్ వాటేజ్ వంటి ఫుల్ వివరాలు ఆగస్టు 16న లాంచ్ సమయంలో వెల్లడికానున్నాయి.
ప్రకటన
ప్రకటన