భవిష్యత్తులో మీ ఐఫోన్ లో ఏదైనా సాఫ్ట్‌వేర్ సమస్య వస్తే.. ఫోన్ దానంతట అదే ఆ సమస్యను గుర్తించి, క్షణాల్లో దాన్ని క్లియర్ చేసుకుంటుంది.
Photo Credit: Apple
Apple iOS 27
Apple iOS 27 : ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఐఓఎస్ 27ను ఇటీవల ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఐఫోన్లలో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు రాబోతున్నాయి. అయితే వాటన్నింటికంటే హైలైట్‌గా నిలిచే ఒక అదిరిపోయే ట్రబుల్‌షూటింగ్ ఫీచర్‌ను యాపిల్ ఇందులో జోడించబోతోంది. దీని సహాయంతో ఐఫోన్ రికవరీ ప్రక్రియ అనేది చాలా సులభతరం కానుంది. అంటే భవిష్యత్తులో మీ ఐఫోన్ లో ఏదైనా సాఫ్ట్‌వేర్ సమస్య వస్తే.. ఫోన్ దానంతట అదే ఆ సమస్యను గుర్తించి, క్షణాల్లో దాన్ని క్లియర్ చేసుకుంటుంది.
కంప్యూటర్ అవసరం లేని ఆన్-డివైస్ రికవరీ
సాధారణంగా ఐఫోన్లు ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు లేదా ఆన్ కాకుండా మొరాయించినప్పుడు.. వాటిని బాగు చేయడానికి మ్యాక్ బుక్ లేదా విండోస్ పీసీలకు కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి రికవరీ మోడ్‌లోకి తీసుకెళ్లాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త ఫీచర్ ద్వారా ఎలాంటి థర్డ్ పార్టీ డివైజ్ అవసరం లేకుండా ఐఫోన్ స్వయంగా తనను తాను బాగు చేసుకోగలదు. ప్రముఖ యాపిల్ టిప్‌స్టర్ ఆరోన్ పెరిస్ ఎక్స్ వేదికగా దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను షేర్ చేశారు. ఫోన్‌ను ఆన్ చేసేటప్పుడు పవర్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవడం ద్వారా ఒక సరికొత్త రికవరీ మెనూ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుందని ఆయన లీక్ చేసిన డేటా ద్వారా స్పష్టమైంది.
స్క్రీన్ పై కనిపించే 5 అద్భుతమైన ఆప్షన్లు
ఈ సరికొత్త రికవరీ మోడ్ ఆన్ చేయగానే యూజర్లకు స్క్రీన్ పై ఐదు రకాల విభిన్న ఆప్షన్లు కనిపిస్తాయి:
* రికవరీ అసిస్టెంట్ : ఇది ఈ ఫీచర్ లోనే అత్యంత ప్రత్యేకమైనది. ఇది డివైజ్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ లోపాలను దానంతట అదే స్కాన్ చేసి ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేస్తుంది.
* సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ : కంప్యూటర్ కనెక్టివిటీ లేకుండానే నేరుగా ఇక్కడి నుంచే లేటెస్ట్ ఐఓఎస్ వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.
* డయాగ్నోస్టిక్స్ మోడ్ : దీని ద్వారా యాపిల్ సపోర్ట్ రన్ అవుతుంది. మీ ఫోన్ లో ఉన్న సమస్య సాఫ్ట్‌వేర్ పరంగా వచ్చిందా లేదా హార్డ్‌వేర్ ఖరాబైందా అనేది ఇది తేల్చి చెబుతుంది.
* ఎరేజ్ ఆల్ కంటెంట్ అండ్ సెట్టింగ్స్ : ఫోన్ పూర్తిగా హ్యాంగ్ అయినప్పుడు డేటాను పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేయడానికి వాడుకోవచ్చు.
* రికవరీ మోడ్ వయా మ్యాక్ : ఒకవేళ ఫోన్ లోపల సమస్య చాలా తీవ్రంగా ఉండి ఫోన్ ద్వారా కాకపోతే.. పాత పద్ధతిలోనే మ్యాక్ బుక్ ద్వారా రిపేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది.
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 షురూ.. టీవీ, మొబైల్స్‌లో లైవ్ మ్యాచులు చూసేది ఎలాగంటే?
ఈ కొత్త రికవరీ మోడ్‌ను ఎలా ఉపయోగించాలి?
మీ ఐఫోన్ లో ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఈ ఆన్-డివైస్ రికవరీ మోడ్‌ను ఎలా యాక్టివేట్ చేయాలో యాపిల్ సింపుల్ స్టెప్స్ ద్వారా వివరించింది:
* మొదటగా మీ ఐఫోన్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయండి.
* ఫోన్ పూర్తిగా బంద్ అయిన తర్వాత.. పక్కనే ఉండే సైడ్ బటన్ (పవర్ ఆన్ బటన్) ను గట్టిగా నొక్కి పట్టుకోండి.
* స్క్రీన్ పై యాపిల్ లోగో కనిపించినప్పటికీ బటన్‌ను అస్సలు వదలకుండా అలాగే హోల్డ్ చేయండి.
* కొన్ని సెకన్ల తర్వాత ఆ యాపిల్ లోగో కింద ఒక ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది.
* బటన్‌ను అలాగే పట్టుకుని ఉంచితే, ఐఫోన్ లో నేరుగా సరికొత్త రికవరీ మోడ్ లాంచ్ అవుతుంది. అక్కడ పైన పేర్కొన్న 5 ఆప్షన్ల ద్వారా మీ ఫోన్‌ను సులభంగా ట్రబుల్‌షూట్ చేసుకోవచ్చు.
ఐఫోన్ వినియోగదారుల పాలిట వరంలా మారనున్న ఈ సరికొత్త రికవరీ ఫీచర్లు ప్రస్తుతం అధికారికంగా సాధారణ యూజర్లందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం రోల్ అవుట్ అవుతున్న iOS 27 డెవలపర్ బీటా 1 వెర్షన్ వాడుతున్న వారికి మాత్రమే ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్ లభిస్తోంది. డెవలపర్లు దీనిని పూర్తిగా పరీక్షించిన అనంతరం, యాపిల్ కంపెనీ లోపాలను సరిచేసి స్టేబుల్ వెర్షన్‌ను విడుదల చేస్తుంది. ఈ ఏడాది చివర్లో ఐఓఎస్ 27 అధికారికంగా మార్కెట్లోకి వచ్చినప్పుడు సాధారణ ఐఫోన్ యూజర్లందరికీ ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఐఫోన్ వినియోగదారులకు సాఫ్ట్‌వేర్ పరంగా ఎదురయ్యే పెద్ద పెద్ద సమస్యల నుంచి భారీ ఉపశమనం లభించనుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Amazon Great Indian Festival 2026: Gaming Headset Deals Under Rs. 5,000
Amazon Great Indian Festival 2026 Sale: Best Gaming Monitors Under Rs. 20,000
Amazon Great Indian Festival 2026: Best Power Bank Deals