FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026 షురూ.. టీవీ, మొబైల్స్‌లో లైవ్ మ్యాచులు చూసేది ఎలాగంటే?

ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ రాబోయే ఎనిమిదేళ్ల కాలానికి గానూ ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను అధికారికంగా దక్కించుకుంది.

FIFA World Cup 2026 :   ఫిఫా వరల్డ్ కప్ 2026 షురూ.. టీవీ, మొబైల్స్‌లో లైవ్ మ్యాచులు చూసేది ఎలాగంటే?

Photo Credit: Reuters

FIFA World Cup 2026

ముఖ్యాంశాలు
  • భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ 2026 జాతర షురూ
  • ఈసారి ఫిఫా వరల్డ్ కప్ హక్కులను సొంతం చేసుకున్న ‘జీ’
  • ఎయిర్‌టెల్, జియో ఫైబర్ యూజర్లకు షాక్
ప్రకటన

FIFA World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక క్రీడా సంబరం ఫిఫా వరల్డ్ కప్ 2026 షురూ అయింది. మెక్సికో సిటీ స్టేడియంలో మెక్సికో, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నమెంట్‌కు తెరలేచింది. భారత్‌లో ఈ మ్యాచ్‌ల డిజిటల్, టీవీ ప్రసార హక్కులపై గత కొన్ని వారాలుగా ఉన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ప్రముఖ మీడియా సంస్థ  జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ రాబోయే ఎనిమిదేళ్ల కాలానికి గానూ ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను అధికారికంగా దక్కించుకుంది. దీనితో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన డూరదర్శన్ కూడా భారత్‌లో కొన్ని కీలక మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయనుంది.

ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి, ఉదయం సమయాల్లో జరగనున్నాయి. జూన్ 12 అర్ధరాత్రి 12:30 గంటలకు మెక్సికో వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ ప్రారంభం కాగా, శుక్రవారం ఉదయం 7:30 గంటలకు సౌత్ కొరియా వర్సెస్ చెకియా తలపడనున్నాయి. జూన్ 13 అర్ధరాత్రి 12:30 గంటలకు కెనడా వర్సెస్ బోస్నియా-హెర్జెగోవినా, ఉదయం 6:30 గంటలకు లాస్ ఏంజిల్స్ స్టేడియంలో యూఎస్ఏ వర్సెస్ పరాగ్వే మ్యాచ్‌లు జరుగుతాయి. జూన్ 14 అర్ధరాత్రి 12:30 గంటలకు ఖతార్ వర్సెస్ స్విట్జర్లాండ్ మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత బ్రెజిల్-మొరాకో (ఉదయం 3:30), హైతీ-స్కాట్లాండ్ (ఉదయం 6:30), ఆస్ట్రేలియా-టర్కీ (ఉదయం 9:30), జర్మనీ-క్యురాకో (రాత్రి 10:30) మ్యాచ్‌లు జరగనున్నాయి.

లీగ్ మ్యాచ్‌ల అనంతరం టోర్నమెంట్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన నాకౌట్ పోరు ప్రారంభమవుతుంది. మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జూలై 10వ తేదీన భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 గంటలకు జరుగుతుంది. ఆ తర్వాత రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు వరుసగా జూలై 15,  జూలై 16 తేదీలలో అర్ధరాత్రి 12:30 గంటలకు నిర్వహించనున్నారు. ఇక ప్రపంచ విజేత ఎవరో తేల్చే గ్రాండ్ ఫినాలే మ్యాచ్ జూలై 19న అమెరికాలో జరగనుండగా.. భారత కాలమానం ప్రకారం జూలై 20వ తేదీ అర్ధరాత్రి 12:30 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ లైవ్ ప్రసారం కానుంది.
 

Motorola Edge 70 Pro+ : భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. నేటి నుంచే ఎడ్జ్ 70 ప్రో+ సేల్ షురూ



ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను ఆన్‌లైన్ లో చూడాలనుకునే వారి కోసం జీ5 యాప్ వేదికగా నిలవనుంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ టీవీలలో జీ5 యాప్ ద్వారా లైవ్ మ్యాచులను వీక్షించవచ్చు. డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ వినియోగదారులు నేరుగా జీ5 అధికారిక వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు. ఇందుకోసం జీ కంపెనీ ప్రత్యేకంగా Zee5 FIFA World Cup 2026 + All Access పేరుతో రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో మూడు నెలల  ప్లాన్ ధర రూ.799 కాగా.. సంవత్సరం ప్లాన్ ధర రూ.1,699గా నిర్ణయించారు. వార్షిక ప్లాన్‌లో ప్రకటనల గోల లేకుండా ప్రశాంతంగా మ్యాచ్‌లు చూడవచ్చని కంపెనీ తెలిపింది. అయితే, ఎయిర్‌టెల్ లేదా జియో ఫైబర్ బండిల్ ఆఫర్ల ద్వారా వచ్చే ఉచిత జీ5 సబ్‌స్క్రిప్షన్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూడటం కుదరదని, వీరు విడిగా ఈ కొత్త ప్యాక్ తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇక కేబుల్ లేదా డీటీహెచ్ ద్వారా టీవీల్లో మ్యాచ్‌లు చూడాలనుకునే వారి కోసం జీ నెట్‌వర్క్ తన సరికొత్త స్పోర్ట్స్ ఛానళ్లను రంగంలోకి దించింది. మీ డీటీహెచ్ ప్యాకేజీలో Unite8 Sports 1, Unite8 Sports 1 HD, Unite8 Sports 2, లేదా Unite8 Sports 2 HD ఛానళ్లు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా చూడాలనుకుంటే.. దూరదర్శన్‌కు చెందిన డీడీ స్పోర్ట్స్ ఛానల్‌ను ఆశ్రయించవచ్చు. దూరదర్శన్ ఫ్రీ డిష్ ద్వారా టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌తో పాటు, నాలుగు క్వార్టర్ ఫైనల్స్, రెండు సెమీఫైనల్స్,  జూలై 20న జరిగే మెగా ఫైనల్ మ్యాచ్‌ను పూర్తిగా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »