ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ సరికొత్త ఐఫోన్ ఫీచర్లు, డిజైన్ రెండర్లను లీక్ చేయడంతో టెక్ ప్రపంచంలో దీనిపై చర్చ జోరందుకుంది.
Photo Credit: notebookcheck
iPhone Air 2
iPhone Air 2 : ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్ ఉన్న ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ లైనప్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపనుంది. ఐఫోన్ చరిత్రలోనే అత్యంత సన్నని డిజైన్‌తో ఐఫోన్ ఎయిర్ 2 మోడల్‌ను తీసుకురావడానికి కంపెనీ వేగంగా అడుగులు వేస్తోంది. ఇది గతంలో వచ్చిన ఐఫోన్ ఎయిర్ మోడల్‌కు సక్సెసర్‌గా మార్కెట్లోకి రాబోతోంది. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ సరికొత్త ఐఫోన్ ఫీచర్లు, డిజైన్ రెండర్లను లీక్ చేయడంతో టెక్ ప్రపంచంలో దీనిపై చర్చ జోరందుకుంది. ఈసారి యాపిల్ సంస్థ ఈ ఫోన్ డిజైన్‌తో పాటు కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ విభాగాలలో ఊహించని రేంజ్‌లో భారీ అప్‌గ్రేడ్‌లను చేయబోతోంది.
ఐఫోన్ ఎయిర్ 2 ఫోన్ ప్రత్యేకతలలో దీని మందం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. లీక్స్ ప్రకారం ఈ ఫోన్ కేవలం 5.6 mm మందంతో చాలా స్లిమ్‌గా, తేలికగా ఉండబోతోంది. ఫోన్ బాడీని మరింత స్ట్రాంగ్‌గా మార్చడం కోసం దీనిని టైటానియం అల్లాయ్ మెటీరియల్‌తో తయారు చేయనున్నారు. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. సాంప్రదాయ స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్ కలర్స్‌తో పాటు ఈసారి సరికొత్తగా లావెండర్ కలర్ వేరియంట్‌ను కూడా యాపిల్ పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త కలర్ అల్ట్రా ప్రీమియం లుక్‌ను ఇస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సరికొత్త ఐఫోన్ ఎయిర్ 2 డిస్‌ప్లే విభాగంలో యాపిల్ ఒక సరికొత్త ప్రయోగాన్ని చేస్తోంది. ఫోన్ స్క్రీన్‌ను మరింత సన్నగా మార్చడం కోసం శామ్‌సంగ్ కంపెనీకి చెందిన ప్రత్యేకమైన CoE (Color Filter on Encapsulation) ఓఎల్ఈడీ డిస్‌ప్లే టెక్నాలజీని ఇందులో ఉపయోగించనున్నారు. దీనివల్ల స్క్రీన్ మందం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా, ఐఫోన్ ఫ్రంట్ భాగంలో ఉండే ఫేస్ ఐడీ ఫీచర్ అలాగే ఉంటుంది కానీ, స్క్రీన్ పైభాగంలో ఉండే పాపులర్ డైనమిక్ ఐలాండ్ సైజును మునుపటి కంటే చాలా చిన్నగా రీడిజైన్ చేయబోతున్నారు. దీనివల్ల స్క్రీన్ స్పేస్ మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
Yamaha : పెట్రోల్ మోడల్ లాగే స్పోర్టీ డిజైన్.. దేశీయ మార్కెట్లో యమహా నుంచి రెండో ఈ స్కూటర్
గత మోడళ్లతో పోలిస్తే ఈసారి కెమెరా విభాగంలో యాపిల్ కస్టమర్ల కోరికను నెరవేర్చబోతోంది. ఐఫోన్ ఎయిర్ 2 వెనుక భాగంలో ఈసారి డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ ప్రైమరీ కెమెరాతో పాటు, సరికొత్తగా మరో 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాను కూడా జత చేయబోతున్నారు. దీనివల్ల వైడ్ యాంగిల్ షాట్స్ మరియు ల్యాండ్‌స్కేప్ ఫొటోలు అత్యంత స్పష్టమైన క్వాలిటీతో వస్తాయి. అయితే ఈ రెండు కెమెరాలను పాత డిజైన్ లాగే ఒకే కెమెరా మాడ్యూల్‌లో అమర్చబోతున్నారు, కాబట్టి వెనుక వైపు కెమెరా డిజైన్‌లో పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు.
పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది. యాపిల్ తన రాబోయే ఏ19 ప్రో చిప్‌సెట్‌ను దాటవేసి, ఈ ఫోన్‌లో నేరుగా అత్యంత శక్తివంతమైన ఏ20 ప్రో ప్రాసెసర్‌ను ఉపయోగించబోతోంది. ఇది సరికొత్త 2nm (2 నానోమీటర్) ఆర్కిటెక్చర్ టెక్నాలజీపై తయారైన హై-ఎఫిషియన్సీ ప్రాసెసర్. దీనివల్ల ఫోన్ ఎంత వాడినా అస్సలు హీట్ ఎక్కదు.. బ్యాటరీ వినియోగాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. గతంలో ఐఫోన్ ఎయిర్ మోడల్‌లో ఉన్న చిన్న బ్యాటరీపై కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని, యాపిల్ ఈ కొత్త ఫోన్‌లో బ్యాటరీ కెపాసిటీని 3,149mAh నుంచి ఏకంగా 3,500mAhకి పెంచింది. దీనివల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్, పవర్ బ్యాకప్ దాదాపు 15 శాతం వరకు పెరుగుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo ColorOS 17 India Launch Set for October 13; Enco X4 Earbuds, Pad Mini Teased
Amazon Great Indian Festival 2026: Best Refrigerator Deals