ఈ సరికొత్త యమహా ఏరాక్స్-ఇ స్కూటర్ ధర మనదేశంలో రూ.2.82 లక్షలుగా ఉంది.
Yamaha
Yamaha : ప్రముఖ అంతర్జాతీయ టూ-వీలర్ల తయారీ సంస్థ యమహా భారతీయ ఈవీ మార్కెట్లో తన పట్టును పెంచుకునేందుకు సరికొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఇప్పటికే మంచి సక్సెస్ అందుకున్న పెట్రోల్ స్కూటర్ ఏరాక్స్ 155 మోడల్‌ను పోలి ఉండేలా, అదే స్పోర్టీ డిజైన్‌తో యమహా ఏరాక్స్-ఇని దేశీయంగా లాంచ్ చేసింది. మనదేశంలో యమహా బ్రాండ్ నుంచి వచ్చిన రెండవ ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఇదే కావడం విశేషం. సాధారణ ఈ-స్కూటర్ల లాగా కాకుండా, కేవలం హై-పర్ఫార్మెన్స్, అదిరిపోయే పవర్ డెలివరీని ఇష్టపడే రైడర్లను టార్గెట్ చేస్తూ యమహా దీనిని డిజైన్ చేసింది.
ఈ సరికొత్త యమహా ఏరాక్స్-ఇ స్కూటర్ ధర మనదేశంలో రూ.2.82 లక్షలుగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో యమహా విక్రయిస్తున్న అన్ని మోడళ్లకంటే ఇది అత్యంత ఖరీదైన ప్రీమియం మోడల్ కావడం గమనార్హం. ఒక మీడియా రిపోర్ట్ ప్రకారం.. ఈ స్కూటర్‌లో 12.9 hp పీక్ పవర్‌ను, 48 Nm అద్భుతమైన టార్క్‌ను ప్రొడ్యూస్ చేసే పవర్‌ఫుల్ మోటార్‌ను అమర్చారు. దీనివల్ల స్కూటర్ పికప్, టాప్ స్పీడ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఇందులో ఉపయోగించిన బ్యాటరీలో హై-ఎనర్జీ టైప్ సెల్స్ వాడటం వల్ల ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా, లాంగ్ రైడింగ్ చేసినా స్కూటర్ పర్ఫార్మెన్స్ అస్సలు తగ్గదు.
రైడర్ల సౌకర్యార్థం ఈ స్కూటర్‌లో 1.5 kWh సామర్థ్యం కలిగిన డిటాచబుల్ బ్యాటరీని అందించారు. అంటే బ్యాటరీని స్కూటర్ నుంచి విడదీసి ఇంట్లోకి తీసుకెళ్లి కూడా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 117 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను ఇస్తుందని యమహా ధృవీకరించింది. సిటీ ట్రాఫిక్, రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా వాడుకోవడానికి ఇందులో ఈకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా రోడ్లపై వెళ్లేటప్పుడు ముందున్న వాహనాలను వేగంగా ఓవర్‌టేక్ చేయడానికి పవర్ అదనంగా పెంచే బూస్ట్ మోడ్‌ను కూడా ఇందులో ప్రత్యేకంగా చేర్చారు.
Vivo : భారత మార్కెట్లోకి వివో సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. శామ్‌సంగ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఎక్స్ ఫోల్డ్ 6
ఫీచర్లు, భద్రత విషయానికొస్తే.. యమహా ఏరాక్స్-ఇ లో అద్భుతమైన బ్రేకింగ్ కోసం ముందు వైపు ఏబీఎస్ టెక్నాలజీతో కూడిన డిస్క్ బ్రేక్, వెనుక వైపు సాధారణ డిస్క్ బ్రేక్‌ను అమర్చారు. రాత్రి వేళల్లో రోడ్లపై స్పష్టమైన విజిబిలిటీ కోసం ట్విన్-ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ ఎల్ईడీ టెయిల్-ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే రైడర్ మొబైల్ ఫోన్‌ను కనెక్ట్ చేసుకునేలా యాప్-బేస్డ్ కనెక్టివిటీ ఫీచర్ ఉన్న కలర్‌ఫుల్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లేను ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ ప్రీమియం ఈ-స్కూటర్ కేవలం ఢిల్లీ, ముంబై, చెన్నై, పూణే నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ముఖ్య నగరాల్లో కూడా దీని అమ్మకాలను ప్రారంభించనున్నారు.
ఏరాక్స్-ఇ కంటే ముందు యమహా సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ యమహా EC-06ని భారత్‌లో లాంచ్ చేసింది. స్టైలిష్, ఎకో-ఫ్రెండ్లీ ప్రయాణాన్ని కోరుకునే సిటీ కస్టమర్ల కోసం వచ్చిన ఈ స్కూటర్ ధర రూ.1,67,600 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో 4 kWh సామర్థ్యం ఉన్న ఫిక్స్‌డ్ బ్యాటరీతో పాటు ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ని ఉపయోగించారు. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 160 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను ఇస్తుంది. దీని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 8 గంటల సమయం పడుతుంది. గరిష్టంగా గంటకు 79 కిమీ టాప్ స్పీడ్‌తో వెళ్లే ఈ EC-06 మోడల్‌లో కూడా ఈకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌తో పాటు రెండు వైపులా డిస్క్ బ్రేక్స్, ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్ ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo ColorOS 17 India Launch Set for October 13; Enco X4 Earbuds, Pad Mini Teased
Amazon Great Indian Festival 2026: Best Refrigerator Deals