గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 17 సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
iPhone 17
iPhone 17 : ప్రముఖ అమెరికన్ బ్రాండ్ ఆపిల్ తన ఐఫోన్ వినియోగదారులకు, మార్కెట్ వర్గాలకు ఒక ఊహించని షాక్ ఇచ్చింది. రాబోయే కొద్ది నెలల్లో సరికొత్త ఐఫోన్ సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రస్తుత ఐఫోన్ 17 సిరీస్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. చైనాకు చెందిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వైబోలో ప్రముఖ టిప్‌స్టర్ ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్ షేర్ చేసిన సమాచారం ప్రకారం.. ఆపిల్ తన ఐఫోన్ 17 సిరీస్ ఉత్పత్తి అంచనాలను దాదాపు 15 శాతం వరకు తగ్గించుకుంది. గ్లోబల్ మార్కెట్లో ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ కాస్త మందగించడమే ఆపిల్ ఈ వెనకడుగు వేయడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
నిజానికి గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 17 సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 17 రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్స్‌లో ఒంటరిగానే ఐఫోన్ 17 మోడల్ సుమారు 6 శాతం వాటాను కలిగి ఉంది. ఇక ఇదే సిరీస్‌లోని ప్రీమియం మోడల్స్ అయిన ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో ప్రపంచ అమ్మకాల్లో వరుసగా రెండవ, మూడవ స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం.
ఆపిల్ సంస్థ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో కీలక మార్పులు చేసింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో కంపెనీ తన మ్యాక్‌బుక్, ఐప్యాడ్, కొన్ని ఇతర యాక్సెసరీస్ ధరలను భారీగానే పెంచింది. అయితే ఐఫోన్ లవర్స్‌కు ఊరటనిస్తూ ఐఫోన్ ధరలను మాత్రం ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగిస్తోంది. ఇలా ధరలు పెంచకుండా పాత ధరలనే మెయింటెన్ చేయడం వెనుక ఐఫోన్ అమ్మకాలను స్థిరంగా ఉంచాలనే వ్యూహం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే, ఆపిల్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంస్థ యొక్క మొట్టమొదటి మడతబెట్టే స్మార్ట్‌ఫోన్ కూడా ఈ ఏడాదే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు
ఆపిల్ లాంచ్ చేయబోయే ఈ సరికొత్స ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు ఐఫోన్ అల్ట్రా అనే పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు లీకుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఆపిల్ ఇప్పటికే డిస్‌ప్లే, బాడీ చేసిస్, మెకానికల్ స్ట్రక్చర్‌తో కూడిన కీలకమైన హార్డ్‌వేర్ భాగాలను ఆమోదించింది. గత ఏప్రిల్ నెలలోనే ఐఫోన్ అల్ట్రాకు సంబంధించిన మొదటి రౌండ్ ట్రయల్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను ఆపిల్ విజయవంతంగా పూర్తి చేసింది. ఆపిల్ యొక్క అతిపెద్ద కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ భాగస్వామి అయిన ఫాక్స్‌కాన్ ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల భారీ స్థాయి ఉత్పత్తిని జూలై చివరి నాటికి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఫోల్డబుల్ ఫోన్లలో సాధారణంగా వచ్చే ప్రధాన సమస్య స్క్రీన్ మధ్యలో పడే మడత మార్క్. ఐఫోన్ అల్ట్రాలో కూడా ఈ హింజ్‌కు సంబంధించిన కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిని అధిగమించడానికి ఆపిల్ ఒక సరికొత్త హంగును జోడిస్తోంది. ఐఫోన్ అల్ట్రా హింజ్ కోసం అడ్వాన్స్‌డ్ 3D ప్రింటెడ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. దీనివల్ల ఫోన్ స్క్రీన్‌పై వచ్చే మడత మార్క్ చాలా తక్కువగా ఉండి, డిస్‌ప్లే సున్నితంగా, పగలకుండా ఉంటుంది. గతంలో ఆపిల్ సంస్థ తన ఆపిల్ వాచ్ కోసం ఇటువంటి 3D ప్రింటెడ్ కేస్‌ను విజయవంతంగా వాడింది. ఇప్పుడు అదే ఫార్ములాను ఫోల్డబుల్ ఐఫోన్‌కు కూడా వర్తింపజేస్తూ ఆండ్రాయిడ్ ఫోల్డబుల్ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడానికి ఆపిల్ రెడీ అవుతోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999