iPhone 17 : ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రొడక్షన్‌ను భారీగా తగ్గించనున్న యాపిల్

యాపిల్ తన ఐఫోన్ 17 ఉత్పత్తిని దాదాపు 1/3 వంతు వరకు తగ్గించడానికి సిద్ధమైంది.

iPhone 17 : ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రొడక్షన్‌ను భారీగా తగ్గించనున్న యాపిల్

Apple to Cut iPhone 17

ముఖ్యాంశాలు
  • ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్
  • ఐఫోన్ 17 ప్రొడక్షన్‌ను భారీగా తగ్గించనున్న యాపిల్
  • ప్రపంచంలోనే మోస్ట్ సెల్లింగ్ ఫోన్‌గా ఐఫోన్ 17
ప్రకటన

iPhone 17 : గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన పాపులర్ మోడల్ ఐఫోన్ 17 ప్రొడక్షన్‌ను భారీగా తగ్గించాలని యోచిస్తోంది. గతేడాది మార్కెట్లోకి విడుదలైన ఐఫోన్ 17 సిరీస్‌కు వినియోగదారుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినప్పటికీ, మారుతున్న మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా యాపిల్ తన మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాన్స్‌ను సమీక్షిస్తోంది. ముఖ్యంగా హార్డ్‌వేర్ విడిభాగాల తయారీ ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఈ సిరీస్‌లోని స్టాండర్డ్ మోడల్ డిమాండ్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. అందుకే భవిష్యత్తులో రాబోయే నష్టాలను ముందే అంచనా వేసి, ఉత్పత్తిని నియంత్రించాలని యాపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

విడిభాగాల ధరలు పెరగడమే ప్రధాన కారణమా?
చైనాకు చెందిన ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్  వైబోలో ఒక పాపులర్ టిప్‌స్టర్  ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్ షేర్ చేసిన సమాచారం ప్రకారం.. యాపిల్ తన ఐఫోన్ 17 ఉత్పత్తిని దాదాపు 1/3 వంతు వరకు తగ్గించడానికి సిద్ధమైంది. అయితే దీనిపై యాపిల్ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ మెమొరీ విడిభాగాల ధరలు భారీగా పెరగడం వల్ల ఎలక్ట్రానిక్స్ తయారీదారులపై తీవ్ర ప్రభావం పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలకు డిమాండ్ విపరీతంగా పెరగడం వల్లే ఈ విడిభాగాల కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్నంటాయి. దీని కారణంగానే యాపిల్ ఇటీవలే తన మ్యాక్‌బుక్, ఐప్యాడ్ వంటి ఉత్పత్తుల ధరలను పెంచినప్పటికీ, ఐఫోన్ ధరలలో మాత్రం ఇంకా ఎలాంటి మార్పులు చేయలేదు.

ప్రపంచంలోనే మోస్ట్ సెల్లింగ్ ఫోన్‌గా ఐఫోన్ 17 
నిజానికి ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ ఇటీవలి నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 17 రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లలో ఐఫోన్ 17 ఏకంగా 6 శాతం వాటాను కలిగి ఉంది. ఇక ఈ సిరీస్‌లోని ప్రీమియం మోడల్స్ అయిన ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రోలు ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడవ స్థానాల్లో నిలిచాయి. ఇంతటి భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో విడిభాగాల ధరల భారం వినియోగదారులపై పడితే డిమాండ్ తగ్గుతుందనే ముందస్తు అంచనాతోనే యాపిల్ ఈ కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీని అవలంబిస్తోంది.

Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సరికొత్త సంచలనం.. జూలై 14న రెడ్‌మి నోట్ 17 సిరీస్ గ్రాండ్ లాంచ్

మార్కెట్లోకి యాపిల్ మొదటి ఫోల్డబుల్ మొబైల్ 
ఐఫోన్ 17 ప్రొడక్షన్‌ను తగ్గిస్తున్న యాపిల్.. మరోవైపు తన సరికొత్త ఆవిష్కరణపై పట్టు బిగిస్తోంది. యాపిల్ కంపెనీ నుంచి రాబోతున్న మొట్టమొదటి ఫోల్డబుల్  స్మార్ట్‌ఫోన్ ఇదే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఫోల్డబుల్ మొబైల్‌ను ఐఫోన్ అల్ట్రా అని పిలిచే అవకాశం ఉందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోల్డబుల్ ఐఫోన్‌కు అవసరమైన కీలకమైన హార్డ్‌వేర్ భాగాలను యాపిల్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే ఆమోదించింది. ఏప్రిల్ నెలలోనే ఈ ఐఫోన్ అల్ట్రాకు సంబంధించిన మొదటి రౌండ్ ట్రయల్ ప్రొడక్షన్ విజయవంతంగా పూర్తయింది. యాపిల్ ప్రధాన కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ భాగస్వామి అయిన  ఫాక్స్‌కాన్ ఈ జూలై చివరి నాటికి ఈ ఫోల్డబుల్ ఐఫోన్ల మాస్ ప్రొడక్షన్‌ను భారీ స్థాయిలో ప్రారంభించనున్నట్లు సమాచారం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »