స్టాండర్డ్ రెడ్‌మి నోట్ 17 మోడల్‌లో ఏకంగా 8000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు.
Photo Credit: X/@Techultimatum
Redmi Note 17
Redmi Note 17 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ రెడ్‌మి నోట్ 17ను మార్కెట్లోకి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది. జూలై 14న ఈ మొబైల్ సిరీస్ చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. లాంచ్‌కు ఇంకా కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సిరీస్ మునుపటి మోడల్స్ కంటే చాలా భిన్నంగా, భారీ డిస్‌ప్లే, ముందెన్నడూ లేనంత పెద్ద బ్యాటరీ కెపాసిటీతో రాబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా మిడ్-రేంజ్ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారిని ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతగానో ఆకట్టుకోనుంది.
ఏకంగా 8000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ
ప్రముఖ టిప్‌స్టర్ టెక్ అల్టిమేటమ్ లీక్ చేసిన సమాచారం ప్రకారం, స్టాండర్డ్ రెడ్‌మి నోట్ 17 మోడల్‌లో ఏకంగా 8000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. సాధారణంగా ఈ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీని చూడటం చాలా అరుదు. ఈ పవర్‌ఫుల్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా, ఈ ఫోన్ ద్వారా ఇతర గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండబోతోంది. అయితే, దీనిపై కంపెనీ ఇంకా అధికారికంగా ముద్ర వేయాల్సి ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వచ్చేలా దీనిని డిజైన్ చేశారు.
టాబ్లెట్ సైజ్ స్క్రీన్‌తో వస్తున్న రెడ్‌మి నోట్ 17
డిస్‌ప్లే పరంగా కూడా రెడ్‌మి ఈసారి సరికొత్త రికార్డును సృష్టించబోతోంది. ఒక స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటివరకు చూడని విధంగా ఏకంగా 7 ఇంచుల పెద్దదైన 1.5K ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ రానుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ బ్రైట్‌నెస్ విషయానికి వస్తే, ఇందులో 1200 నిట్స్ గ్లోబల్ బ్రైట్‌నెస్ ఇవ్వడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వినియోగదారుల కళ్లకు రక్షణ కల్పించేందుకు కంపెనీ ప్రత్యేకంగా 'ఐ-ప్రొటెక్షన్ టెక్నాలజీ'ని ఇందులో వాడింది. ఈ ఫోన్ ఫ్లాట్ డిజైన్‌తో పాటు ప్రీమియం ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది.
Tata Motors : భారత్‌లో ఈవీ కార్ల హవా.. జూన్ నెలలో ఏకంగా 108 శాతం పెరిగిన ఎలక్ట్రిక్ కార్ సేల్స్
మొదటిసారి మీటియోర్ పర్పుల్ కలర్‌లో మెరవనున్న మొబైల్
కంపెనీ షేర్ చేసిన టీజర్ల ప్రకారం, ఈ ఫోన్‌ను సరికొత్త మీటియోర్ పర్పుల్ కలర్ వేరియంట్‌లో ప్రదర్శించారు. ఈ రకమైన కలర్ షేడ్‌ను స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ఉపయోగించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రాసెసర్ విషయానికి వస్తే, కంపెనీ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించనప్పటికీ, బెంచ్‌మార్క్ లిస్టింగ్స్ ప్రకారం ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది. జూలై 14న చైనా కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు జరిగే లైవ్ ఈవెంట్ ద్వారా ఈ సిరీస్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ ఈవెంట్‌ను రెడ్‌మి అధికారిక సోషల్ మీడియా ఛానల్స్‌లో వీక్షించవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Microsoft Announces $50 Xbox Nano Controller, Launch Set for Next Month
Samsung Galaxy A38 5G Rear Camera Specifications Leaked; May Feature Same Sensors as Galaxy A37
Oppo Find X10 Pro Max Confirmed to Launch in India as First Phone With a Triple 200-Megapixel Camera System