Apple iOS 27 : మీ ఫోన్‌లో ఐఓఎస్ 27 సపోర్ట్ చేస్తుందా?.. ఎలిజిబుల్ ఐఫోన్ల పూర్తి లిస్ట్ ఇదే!

సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 27 డెవలపర్ బీటా 1 అప్‌డేట్‌ను రిజిస్టర్డ్ డెవలపర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఐఫోన్లలో సరికొత్త యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది.

Apple iOS 27 : మీ ఫోన్‌లో ఐఓఎస్ 27 సపోర్ట్ చేస్తుందా?.. ఎలిజిబుల్ ఐఫోన్ల పూర్తి లిస్ట్ ఇదే!

Apple's latest update brings a new adjustment slider for Liquid Glass

ముఖ్యాంశాలు
  • ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్
  • ఐఓఎస్ 27 లో మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు!
  • లిక్విడ్ గ్లాస్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫొటోస్ యాప్
ప్రకటన

Apple iOS 27 : యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్(WWDC 2026) కీనోట్ ప్రెజెంటేషన్ ముగిసిన వెంటనే, కంపెనీ తన ఐఫోన్ యూజర్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 27 డెవలపర్ బీటా 1 అప్‌డేట్‌ను రిజిస్టర్డ్ డెవలపర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఐఫోన్లలో సరికొత్త యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది. ముఖ్యంగా యాపిల్ కొత్తగా డిజైన్ చేసిన లిక్విడ్ గ్లాస్ డిజైన్ లాంగ్వేజ్ ఈ ఓఎస్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఐఓఎస్ 27 లో అదిరిపోయే మార్పులు
ఈ సరికొత్త ఐఓఎస్ 27 అప్‌డేట్‌లో కేవలం లుక్ మాత్రమే కాకుండా ఫోన్ లోపలి ఫీచర్లలో కూడా చాలా మార్పులు చేశారు. మన ఫోన్ లోని ఫొటోస్, మెయిల్ యాప్స్ సరికొత్త ఫీచర్లతో మరింత స్మార్ట్‌గా మారాయి. వీటితో పాటు పిల్లల భద్రత కోసం చైల్డ్ సేఫ్టీ ఫీచర్లను కూడా యాపిల్ మరింత పటిష్టం చేసింది. వీటన్నింటికంటే ముఖ్యంగా, 2024లో యాపిల్ ప్రామిస్ చేసిన మరింత తెలివైన స్మార్ట్ సిరి వాయిస్ అసిస్టెంట్‌ను ఎట్టకేలకు ఈ అప్‌డేట్ ద్వారా కస్టమర్ల ముందుకు తీసుకువచ్చారు.

మీ ఫోన్ లిస్టులో ఉందో లేదో చూసుకోండి
పాత ఓఎస్‌లతో పోలిస్తే యాపిల్ ఈసారి ఏ పాత మోడల్‌ను లిస్ట్ నుంచి తొలగించలేదు. ఐఓఎస్ 26 సపోర్ట్ చేసిన అన్ని ఐఫోన్లలోనూ ఈ కొత్త ఐఓఎస్ 27 రన్ అవుతుంది. ఐఫోన్ 11 సిరీస్ నుంచి మొదలుకొని లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ వరకు, ఐఫోన్ ఎస్ఈ (2020) మోడళ్లలో కూడా ఈ అప్‌డేట్ పనిచేస్తుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. యాపిల్ తీసుకొచ్చిన అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు మాత్రం కేవలం ఐఫోн 15 ప్రో, ఆపై మోడళ్లకే పరిమితం కానున్నాయి. ఇక రాబోయే ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 17 ప్రో మోడల్స్ కోసం కొన్ని ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు కూడా ఉండబోతున్నాయట.

WWDC 2026 : యాపిల్ ఇంటెలిజెన్స్ సరికొత్త ఆర్కిటెక్చర్.. ఇక మాటలతో కూడా ఇమేజ్ ఎడిటింగ్ చేయవచ్చు

ఐఓఎస్ 27 సపోర్ట్ చేసే ఐఫోన్ల పూర్తి జాబితా:
* ఐఫోన్ 16 సిరీస్ (అన్ని మోడల్స్)
* ఐఫోన్ 15 సిరీస్ (అన్ని మోడల్స్)
* ఐఫోన్ 14 సిరీస్ (అన్ని మోడల్స్)
* ఐఫోన్ ఎస్ఈ (2022)
* ఐఫోన్ 13 సిరీస్ (అన్ని మోడల్స్)
* ఐఫోన్ 12 సిరీస్ (అన్ని మోడల్స్)
* ఐఫోన్ 11 సిరీస్ (అన్ని మోడల్స్)
* ఐఫోన్ ఎస్ఈ (2020)

ఇన్‌స్టాల్ చేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
నిజానికి ఈ ఐఓఎస్ 27 పూర్తి స్థాయి పబ్లిక్ వెర్షన్ ఈ ఏడాది చివర్లో అందరికీ అందుబాటులోకి వస్తుంది. కానీ ముందే కొత్త ఫీచర్లను టెస్ట్ చేయాలనుకునే వారి కోసం ఈ ‘డెవలపర్ బీటా 1' అప్‌డేట్‌ను ఇచ్చారు. ఇవి కేవలం టెస్టింగ్ కోసం తయారు చేసిన ప్రీ-రిలీజ్ వెర్షన్లు కాబట్టి, ఇందులో కొన్ని బగ్స్ (సాఫ్ట్‌వేర్ లోపాలు) ఉండే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఫోన్ పర్ఫార్మెన్స్ తగ్గడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం లేదా ఫోన్ లోని డేటా డిలీట్ అవ్వడం లాంటి సమస్యలు రావచ్చు. అందుకే ఈ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసే ముందు మీ ఫోన్ డేటాను పూర్తిగా  బ్యాకప్ చేసుకోవాలని యాపిల్ గట్టిగా హెచ్చరిస్తోంది.

ఐఓఎస్ 27 బీటా 1 ఇన్‌స్టాల్ చేసుకునే స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్:
ఈ అప్‌డేట్ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఒక యాపిల్ డెవలపర్ అకౌంట్ ఉండాలి. దానికోసం క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:
* స్టెప్ 1: మొదట మీ ఫోన్ బ్రౌజర్‌లో beta.apple.com వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
* స్టెప్ 2: అక్కడ ఉన్న Signup బటన్‌పై క్లిక్ చేసి, మీ యాపిల్ ఐడీ (Apple ID) తో లాగిన్ అవ్వండి.
* స్టెప్ 3: టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి, చివరగా Accept బటన్‌ నొక్కండి. దీనితో మీ డెవలపర్ అకౌంట్ రెడీ అవుతుంది.
* స్టెప్ 4: ఇప్పుడు మీ ఐఫోన్ లోని Settings > General > Software Update ఆప్షన్‌కు వెళ్ళండి.
* స్టెప్ 5: అక్కడ Beta Updates పై క్లిక్ చేసి, Developer Beta ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.

ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత, మీ ఫోన్ స్క్రీన్‌పై ఐఓఎస్ 27 బీటా 1 అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి కనిపిస్తుంది. ఒకవేళ మీకు భవిష్యత్తులో బీటా అప్‌డేట్లు వద్దు అనుకుంటే, సింపుల్‌గా ఈ బీటా అప్‌డేట్ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »