Google Gemini Spark : గూగుల్ జెమిని స్పార్క్ వచ్చేస్తోంది.. ఇక మీ ఫోన్ మీకు చెప్పకుండానే పనులు చేసేస్తుంది

గూగుల్ వచ్చే వారం జరగనున్న గూగుల్ I/O 2026 వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌లో సరికొత్త ఏఐ ఏజెంట్ జెమిని స్పార్క్‎ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.

Google Gemini Spark : గూగుల్ జెమిని స్పార్క్ వచ్చేస్తోంది.. ఇక మీ ఫోన్ మీకు చెప్పకుండానే పనులు చేసేస్తుంది

Photo Credit: Google

Google I/O 2026 is scheduled to take place on May 19

ముఖ్యాంశాలు
  • గూగుల్ ఒక Gemini AI ఏజెంట్‌ను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
  • Gemini Spark రిమోట్ బ్రౌజర్ డేటాను సేవ్ చేస్తుంది.
  • Gemini Spark అనేది ఒక ప్రయోగాత్మక ఫీచర్.
ప్రకటన

Google Gemini Spark : టెక్ దిగ్గజం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో సంచలనానికి తెరలేపుతోంది. వచ్చే వారం జరగనున్న గూగుల్ I/O 2026 వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్‌లో సరికొత్త ఏఐ ఏజెంట్ జెమిని స్పార్క్‎ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు మనం చూసిన చాట్‌బాట్లు మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవి. కానీ ఈ జెమిని స్పార్క్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, మనం ఏమీ చెప్పకపోయినా మన అవసరాలను గుర్తించి పనులు పూర్తి చేసేస్తుందట. దీనికి సంబంధించిన లీకులు ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఏమిటి ఈ జెమిని స్పార్క్ ?  

జెమిని స్పార్క్ అనేది కేవలం ఒక అసిస్టెంట్ మాత్రమే కాదు, ఇది ఒక పవర్‌ఫుల్ ఏఐ ఏజెంట్. సాధారణంగా ఏఐ పని చేయాలంటే మనం ఏదో ఒక ప్రాంప్ట్ (ఆదేశం) ఇవ్వాలి. కానీ జెమిని స్పార్క్ నిరంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూనే ఉంటుంది. మీ ఫోన్‌లోని యాప్‌లు, మెయిల్స్, చాట్స్, లొకేషన్, మీరు లాగిన్ అయి ఉన్న వెబ్‌సైట్ల నుంచి డేటాను సేకరిస్తుంది. మీ అలవాట్లను బట్టి, మీ ప్రమేయం లేకుండానే కొన్ని పనులను ముందుగానే పూర్తి చేసేలా దీనిని రూపొందిస్తున్నారు. మే 19న జరగబోయే కాన్ఫరెన్స్‌లో దీని పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
 

మీ పనులన్నీ చిటికెలో.. కానీ జాగ్రత్త!

సోషల్ మీడియాలో లీకైన స్క్రీన్‌షాట్ల ప్రకారం..  జెమిని స్పార్క్ మీ వ్యక్తిగత సమాచారాన్ని, కాంటాక్ట్ డీటెయిల్స్, ఫైల్స్‌ను కూడా యాక్సెస్ చేయగలదు. కొన్ని సందర్భాల్లో ఇది మీ తరపున ఆన్‌లైన్ షాపింగ్ చేయడం లేదా సమాచారాన్ని థర్డ్ పార్టీ యాప్‌లతో పంచుకోవడం వంటి పనులను కూడా చేస్తుంది. అయితే, సెన్సిటివ్ పనులు చేసేటప్పుడు ఇది యూజర్ పర్మిషన్ అడుగుతుందని గూగుల్ చెబుతోంది. ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్నందున, వైద్య, న్యాయ లేదా ఆర్థిక పరమైన సలహాల కోసం దీనిపై పూర్తిగా ఆధారపడవద్దని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డేటా సేఫ్టీ, నియంత్రణ

వ్యక్తిగత సమాచారం విషయంలో యూజర్లకు పూర్తి నియంత్రణ ఉంటుందని గూగుల్ స్పష్టం చేసింది. యూజర్లు ఎప్పుడైనా సెట్టింగ్స్ లోకి వెళ్లి కనెక్టెడ్ యాప్స్ ఫీచర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే జెమిని స్పార్క్ సేకరించిన డేటాను డిలీట్ చేసే సదుపాయం కూడా ఉంటుంది. బ్రౌజర్ లాగిన్ వివరాలు, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వంటి అంశాలను కూడా ఇది సేవ్ చేస్తుంది కాబట్టి, సెక్యూరిటీ విషయంలో యూజర్లు అప్రమత్తంగా ఉండటం మంచిది. గూగుల్ తన కొత్త గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లలో కూడా ఈ జెమిని ఇంటెలిజెన్స్‌ను ఇన్ బిల్ట్‌గా తీసుకువచ్చే అవకాశం ఉంది.

టెక్ మార్కెట్‌లో సరికొత్త వార్ 

గూగుల్ ఐ/ఓ 2026 కేవలం ఈ ఏఐ ఏజెంట్‌కే పరిమితం కాకుండా, మరిన్ని ఏఐ అప్‌డేట్లను మోసుకొస్తోంది. జిమెయిల్ స్టోరేజ్ పాలసీల్లో మార్పులు, కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు, మ్యాజిక్ పాయింటర్ వంటి ఫీచర్లు టెక్ ప్రియులను ఊరిస్తున్నాయి. ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు పోటీగా గూగుల్ తీసుకువస్తున్న ఈ జెమిని స్పార్క్, స్మార్ట్‌ఫోన్ వాడే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

#తాజా కథనాలు
  1. Oppo FindX9s : ఒప్పో కొత్త ఫోన్ లో 7025mAh బ్యాటరీ.. ఇక ఛార్జర్ ను మర్చిపోవాల్సిందే
  2. Amazon Great Summer Sale 2026 : పాత ల్యాప్‌టాప్ కి గుడ్ బై.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై కళ్ళు చెదిరే ఆఫర్లు
  3. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ మ్యూజిక్ మ్యాజిక్... 11 వేల బోట్ స్పీకర్ కేవలం రూ. 2,999కే
  4. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ బంపర్ ధమాకా.. సగం రేటుకే ఎయిర్ ప్యూరిఫైయర్లు
  5. Amazon Great Summer Sale 2026: అమెజాన్ ఫ్రిజ్ మేళా.. రూ.58 వేల బాష్ ఫ్రిజ్ కేవలం రూ.33 వేలకే.. ఎగబడుతున్న జనం
  6. Google Gemini Spark : గూగుల్ జెమిని స్పార్క్ వచ్చేస్తోంది.. ఇక మీ ఫోన్ మీకు చెప్పకుండానే పనులు చేసేస్తుంది
  7. Amazon Great Summer Sale 2026: ఇంటిని థియేటర్‌లా మార్చేయండి.. అమెజాన్లో 65 ఇంచుల స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు
  8. Amazon Great Summer Sale 2026 : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. సగం ధరకే బ్రాండెడ్ ఏసీలు
  9. Google Search : ఇకపై ఏఐ చెప్పేది అబద్ధం అని డౌట్ పడక్కర్లేదు.. గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్
  10. Samsung Galaxy Watch : చావు అంచుల్లో నుంచి కాపాడే కొత్త టెక్నాలజీ.. ఈ వాచ్ ఉంటే ప్రాణాలు పదిలం
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »