Samsung Galaxy Watch : చావు అంచుల్లో నుంచి కాపాడే కొత్త టెక్నాలజీ.. ఈ వాచ్ ఉంటే ప్రాణాలు పదిలం

గెలాక్సీ వాచ్‌లోని సెన్సార్లు మన శరీరంలోని మార్పులను గమనించి, మనం ఎప్పుడు పడిపోయే అవకాశం ఉందో ముందే హెచ్చరిస్తాయని ఈ పరిశోధన స్పష్టం చేసింది.

Samsung Galaxy Watch : చావు అంచుల్లో నుంచి కాపాడే కొత్త టెక్నాలజీ.. ఈ వాచ్ ఉంటే ప్రాణాలు పదిలం

Photo Credit: Samsung

Newer Galaxy Watch models with PPG and HRV tracking could support the feature

ముఖ్యాంశాలు
  • ఈ ఫీచర్ ని Samsung 132 మంది పై పరీశోధన చేసింది
  • ఈ అధ్యయనం వాసోవాగల్ సింకోప్ లక్షణాలపై దృష్టి సారించింది
  • Galaxy Watch 6 84.6 శాతం కచ్చితత్వాన్ని సాధించింది
ప్రకటన

Samsung Galaxy Watch: సాధారణంగా ఎవరైనా స్పృహ తప్పి పడిపోతారని ముందే ఎవరూ చెప్పలేరు. కానీ, ఇప్పుడు మీ చేతికి ఉండే స్మార్ట్ వాచ్ ఆ విషయాన్ని ఐదు నిమిషాల ముందే పసిగడుతుంది. ప్రముఖ టెక్ దిగ్గజం శామ్సంగ్, దక్షిణ కొరియాలోని చుంగ్-ఆంగ్ యూనివర్సిటీ హాస్పిటల్‌తో కలిసి నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. గెలాక్సీ వాచ్‌లోని సెన్సార్లు మన శరీరంలోని మార్పులను గమనించి, మనం ఎప్పుడు పడిపోయే అవకాశం ఉందో ముందే హెచ్చరిస్తాయని ఈ పరిశోధన స్పష్టం చేసింది.

వాసోవాగల్ సింకోప్ అంటే ఏమిటి?

చాలా మంది ఒత్తిడి, భయం లేదా విపరీతమైన నొప్పి కలిగినప్పుడు అకస్మాత్తుగా గుండె కొట్టుకునే వేగం తగ్గి, రక్తపోటు పడిపోవడం వల్ల స్పృహ కోల్పోతుంటారు. వైద్య పరిభాషలో దీన్ని వాసోవాగల్ సింకోప్ అంటారు. ఇలా అకస్మాత్తుగా పడిపోవడం వల్ల తలకు దెబ్బలు తగలడం, ఎముకలు విరగడం వంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ముప్పును ముందే గుర్తించేలా శామ్సంగ్ తన గెలాక్సీ వాచ్ 6 ద్వారా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.

84 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుంది 

సుమారు 132 మంది రోగులపై నిర్వహించిన ఈ పరిశోధనలో గెలాక్సీ వాచ్ అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. వాచ్‌లోని ఫోటోప్లెతీస్మోగ్రఫీ సెన్సార్ సాయంతో గుండె లయలో వచ్చే మార్పులను ఏఐ  మోడల్ విశ్లేషించింది. ఈ టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోవడానికి ఐదు నిమిషాల ముందే 84.6 శాతం కచ్చితత్వంతో హెచ్చరికలు జారీ చేయవచ్చని పరిశోధకులు తేల్చారు. తద్వారా బాధితులు సురక్షితమైన ప్రదేశంలో కూర్చోవడానికి లేదా సహాయం కోసం ఎవరినైనా పిలవడానికి తగిన సమయం దొరుకుతుంది.

త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి..

ప్రస్తుతానికి ఈ ఫీచర్ క్లినికల్ అధ్యయన దశలోనే ఉంది. త్వరలోనే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా గెలాక్సీ వాచ్ వినియోగదారులకు ఈ హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. కేవలం గెలాక్సీ వాచ్ 6 మాత్రమే కాకుండా, హార్ట్ రేట్ వేరియబిలిటీని ట్రాక్ చేసే సామర్థ్యం ఉన్న ఇతర గెలాక్సీ మోడల్స్‌లో కూడా ఈ ఫీచర్ పనిచేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ధరించగలిగే పరికరాలు ప్రాణాలను కాపాడే సంజీవనిలా మారుతాయని ఈ అధ్యయనం నిరూపించింది.



(हेडलाइन के अलावा, इस खबर को एनडीटीवी टीम ने संपादित नहीं किया है, यह सिंडीकेट फीड से सीधे प्रकाशित की गई है।)
#తాజా కథనాలు
  1. Google Search : ఇకపై ఏఐ చెప్పేది అబద్ధం అని డౌట్ పడక్కర్లేదు.. గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్
  2. Samsung Galaxy Watch : చావు అంచుల్లో నుంచి కాపాడే కొత్త టెక్నాలజీ.. ఈ వాచ్ ఉంటే ప్రాణాలు పదిలం
  3. Oppo Find X9 Ultra X9s: ఒప్పో నుంచి ఫోటోగ్రఫీ కింగ్.. భారత్‌లో ఫైండ్ X9 అల్ట్రా, X9s లాంచ్ ఖరారు
  4. OnePlus : వన్‌ప్లస్ సంచలనం.. భారత మార్కెట్లోకి Nord CE 6, CE 6 Lite విడుదల
  5. Google Photos Wardrobe: గూగుల్ తెచ్చిన డిజిటల్ వార్డ్‌రోబ్.. ఏ డ్రెస్ బాగుంటుందో అదే ఇట్టే చెప్పేస్తుంది
  6. Moto Buds 2 Plus : భారత్‌లోకి మోటో బడ్స్ 2 ప్లస్ ఎంట్రీ.. బోస్ సౌండ్ క్వాలిటీతో రూ.6 వేలకే ప్రీమియం బడ్స్
  7. Meta Apps lost 2 Million users in 3 Months: మెటాకు కోలుకోలేని దెబ్బ.. మూడు నెలల్లో 2 కోట్ల మంది యూజర్లు జంప్
  8. Google Gemini : యూజర్లకు షాకింగ్ న్యూస్.. గూగుల్ జెమినిలో యాడ్స్ గోల
  9. YouTube : యూట్యూబ్ యూజర్లకు పండగే.. ఇక పిక్చర్-ఇన్-పిక్చర్ అందరికీ ఫ్రీ
  10. Mobile Price Hike : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన మొబైల్ ధరలు
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »