గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను మరింత శక్తివంతంగా మారుస్తోంది
Photo Credit: Google
Google is also adding a quick preview of a website when users hover over an inline link
Google Search : సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను మరింత శక్తివంతంగా మారుస్తోంది. సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే ఏఐ ఓవర్‌వ్యూస్, ఏఐ మోడ్ ఫీచర్లలో యూజర్లకు ఉపయోగపడేలా ఐదు కొత్త అప్‌డేట్‌లను గూగుల్ ప్రకటించింది. కేవలం సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా, నిపుణుల సలహాలు, వెబ్‌సైట్ లింక్‌ల ప్రివ్యూలు వంటి ఫెసిలిటీస్‌ను ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల యూజర్లు వెతుకుతున్న సమాచారం మరింత ఖచ్చితంగా, నమ్మదగ్గదిగా ఉండబోతోంది.
ఇప్పటివరకు గూగుల్ ఏఐ కేవలం వెబ్‌సైట్లలో ఉన్న సమాచారాన్ని మాత్రమే క్రోడీకరించి ఇచ్చేది. కానీ ఇప్పుడు కొత్తగా ఎక్స్‌పర్ట్ అడ్వైస్ ఫీచర్‌ను తెచ్చింది. మీరు ఏదైనా ప్రొడక్ట్ గురించి గానీ, వెళ్లాల్సిన చోటు గురించి గానీ అడిగితే.. దాన్ని వాడిన వారు లేదా ఆ రంగంలో నిపుణులైన వారు సోషల్ మీడియాలో, ఫోరమ్‌లలో పంచుకున్న అభిప్రాయాలను గూగుల్ ఏఐ చూపిస్తుంది. సమాచారం ఇచ్చిన వ్యక్తి పేరు, హ్యాండిల్ వంటి వివరాలు కూడా ఉండటం వల్ల ఆ రివ్యూ ఎంతవరకు కరెక్టో మనం సులభంగా తెలుసుకోవచ్చు.
సాధారణంగా ఏఐ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేసిన తర్వాతే ఆ వెబ్‌సైట్‌లో ఏముందో మనకు తెలుస్తుంది. కానీ ఇకపై డెస్క్‌టాప్ యూజర్లు ఏదైనా లింక్‌పై కర్సర్ ఉంచగానే, ఆ వెబ్‌సైట్ పేరు, పేజీ టైటిల్ ప్రివ్యూలా కనిపిస్తాయి. దీనివల్ల ఏ లింక్ ఓపెన్ చేయాలో, ఏది వద్దో ముందే డిసైడ్ అవ్వొచ్చు. ఇది యూజర్ల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, నమ్మకమైన వెబ్‌సైట్లను గుర్తించడంలో సహాయపడుతుంది.
మనం రెగ్యులర్‌గా ఫాలో అయ్యే న్యూస్ వెబ్‌సైట్లు లేదా సబ్‌స్క్రిప్షన్ ఉన్న ఛానెళ్ల నుంచి ఏఐ సమాచారం సేకరిస్తే, అక్కడ ఒక ప్రత్యేకమైన టిక్ మార్క్ కనిపిస్తుంది. దీనివల్ల మనకు నచ్చిన సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఇట్టే గుర్తు పట్టొచ్చు. అంతేకాకుండా.. ఏఐ ఇచ్చే సమాధానాల్లో పాయింట్ల పక్కనే చిన్న చిన్న గొలుసు ఆకారపు ఐకాన్లు కనిపిస్తాయి. వీటిని క్లిక్ చేస్తే ఆ పాయింట్ ఏ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నారో నేరుగా అక్కడికి వెళ్లి చదువుకోవచ్చు.
మీరు అడిగిన ప్రశ్నలకు జెమిని ఏఐ ఇచ్చే సమాధానం కింద డీప్ డైవ్ సూచనలు కనిపిస్తాయి. అంటే ఆ టాపిక్ గురించి ఇంకా లోతుగా తెలుసుకోవడానికి పనికొచ్చే ఆర్టికల్స్, అనాలసిస్ లింక్‌లను గూగుల్ ఆటోమేటిక్‌గా ఇస్తుంది. దీనివల్ల ఒక విషయంపై పూర్తి అవగాహన తెచ్చుకోవడం సులభం అవుతుంది. ఈ ఐదు ఫీచర్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికీ దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Z Fold 8, Galaxy Z Flip 8 to Launch With Google’s Gemini Intelligence Features: Report