ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒప్పో ఫైండ్ X9s భారత లాంచ్‌కు సర్వం సిద్ధమైంది. మే 21న ఈ ఫోన్ మన దేశంలో విడుదల కాబోతోంది.
Photo Credit: Oppo
Oppo Find X9s features a 32-megapixel selfie camera globally
Oppo FindX9s : స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒప్పో ఫైండ్ X9s భారత లాంచ్‌కు సర్వం సిద్ధమైంది. మే 21న ఈ ఫోన్ మన దేశంలో విడుదల కాబోతోంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇది భారత్‌లో లభించే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. ప్రీమియం డిజైన్, అదిరిపోయే టెక్నాలజీతో రాబోతున్న ఈ ఫోన్, మార్కెట్లోని ఇతర దిగ్గజ ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ సమాచారం ప్రకారం.. ఒప్పో ఫైండ్ X9s భారత్‌లో సుమారు రూ.79,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి రావచ్చు. మలేషియా వంటి ఇతర దేశాల్లో దీని ధర సుమారు రూ.85,000గా ఉంది. అంటే భారతీయ వినియోగదారులకు ఒప్పో కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ మొత్తం మూడు ఆకర్షణీయమైన రంగుల్లో రాబోతోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో ఇది అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించి. ఏకంగా 7,025mAh భారీ బ్యాటరీతో ఈ ఫోన్ రాబోతోంది. సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో 5,000mAh బ్యాటరీ చూస్తుంటాం, కానీ ఒప్పో ఏకంగా 7వేల మార్కును దాటేసింది. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిశ్చింతగా వాడుకోవచ్చు. అలాగే ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 తో పనిచేసే మొదటి ఫోన్లలో ఒకటిగా నిలవనుంది.
ఒప్పో ఫైండ్ X9s లో 6.59-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అంటే ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని వాడారు. ఇక పవర్ విషయానికి వస్తే, ఇందులో అత్యాధునిక 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌ను వాడారు. 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉండబోతున్నాయి.
ఫోటోగ్రఫీ కోసం ఒప్పో ఈసారి హాసల్‌బ్లాడ్ తో జతకట్టింది. వెనుక భాగంలో మూడు కెమెరాల సెటప్ ఉంటుంది, ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం దీనికి IP66, IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు. అంటే ఫోన్ నీటిలో పడినా ఏమీ కాదు. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఒప్పో ఫైండ్ X9s ఒక పవర్‌ఫుల్ ఆప్షన్ కానుంది.
ప్రకటన
ప్రకటన
Subnautica 2 Sells 2 Million Copies Within 12 Hours of Early Access Launch
Honor’s Robot Phone With a Rotating Gimbal Camera Gets an Official Launch Window