Google Home Smart speaker Launch Date leaked: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త హోమ్ స్మార్ట్ స్పీకర్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Photo Credit: Google
Google Home Smart Speaker
Google Home Smart speaker Launch Date leaked: ప్రస్తుత డిజిటల్ కాలంలో ఇళ్లను స్మార్ట్‌గా మార్చుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగదారుల ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త హోమ్ స్మార్ట్ స్పీకర్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త స్పీకర్ చూడటానికి ఎంతో అందంగా, ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటోంది. ఇటీవల ఒక ప్రముఖ ఆన్‌లైన్ రీటైలర్ వెబ్‌సైట్ లిస్టింగ్‌లో ఈ స్పీకర్ వివరాలు లీకైన తర్వాత, గూగుల్ సంస్థ స్వయంగా దీని రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్ వచ్చే వారమే అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ టెక్ వెబ్‌సైట్ నోట్‌బుక్ చెక్ నివేదిక ప్రకారం, కంపెనీ పంపిన కొన్ని అంతర్గత ఈమెయిల్స్ ద్వారా ఈ స్పీకర్ జూన్ 15 నుండి జూన్ 22 మధ్య కాలంలోనే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దీని అధికారిక విక్రయాలు జూన్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. నిజానికి ఈ స్పీకర్‌ను అక్టోబర్ నెలలో విడుదల చేయాలని గూగుల్ మొదట భావించినప్పటికీ, అనుకున్న సమయం కంటే చాలా ముందే దీనిని మార్కెట్లోకి తీసుకువస్తుండటం విశేషం.
ఇటీవలే ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ బెస్ట్ బై కెనడా వెబ్‌సైట్ లిస్టింగ్‌లో ఈ సరికొత్త గూగుల్ స్పీకర్ కనిపించింది. అక్కడ దీని రిలీజ్ డేట్ జూన్ 25 గా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో కమింగ్ సూన్ అనే టీజర్‌తో ఈ ప్రొడక్ట్ కనిపిస్తోంది. ఈ స్పీకర్ పాత మోడల్స్ తో పోలిస్తే చాలా భిన్నంగా, సరికొత్త టెక్నాలజీతో డిజైన్ చేయబడింది.
ఈ సరికొత్త గూగుల్ హోమ్ స్పీకర్ డిజైన్ పరంగా ఆపిల్ కంపెనీకి చెందిన ప్రముఖ హోమ్‌పాడ్‌ను పోలి ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్పీకర్ లోని ప్రత్యేకత ఏంటంటే, దీనిని Google TV Streamerతో చాలా సులభంగా Pair చేసుకోవచ్చు. దీనివల్ల వినియోగదారులు ఇంట్లో కూర్చుని సినిమా చూసేటప్పుడు థియేటర్ లాంటి పవర్ ఫుల్ సరాండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చు.
Oppo : ఒప్పో లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా పై క్రేజీ ఆఫర్స్
కస్టమర్లను ఆకట్టుకునేందుకు గూగుల్ ఈ స్మార్ట్ స్పీకర్‌ను బెర్రీ, హేజిల్, జెడ్ (గ్రీన్), పోర్స్ లేన్ అనే నాలుగు అద్భుతమైన రంగులలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రీటైలర్ లిస్టింగ్‌లో ఇది ప్రస్తుతం హేజిల్, పోర్స్ లేన్ కలర్ ఆప్షన్లలో కనిపిస్తోంది. ఇక ధర విషయానికి వస్తే, గ్లోబల్ మార్కెట్లో ఈ స్పీకర్ ధర దాదాపు 100 డాలర్లుగా ఉండవచ్చని అంచనా. మన భారతీయ కరెన్సీ ప్రకారం చూసుకుంటే దీని ధర సుమారు రూ.9,500 వరకు ఉండవచ్చు. అయితే భారతదేశంలో ఈ స్పీకర్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంపై గూగుల్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999