Oppo : ఒప్పో లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా పై క్రేజీ ఆఫర్స్

భారత మార్కెట్లో Oppo Find X9 Ultra స్మార్ట్‌ఫోన్ టాప్-ఎండ్ మోడల్ అయిన 12GB రామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,69,999 గా లిస్ట్ చేయబడింది.

Oppo : ఒప్పో లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా పై క్రేజీ ఆఫర్స్

Photo Credit: Oppo

Oppo Find X9 Ultra

ముఖ్యాంశాలు
  • ఒప్పో లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్
  • ఫ్లిప్‌కార్ట్‌లో ‘ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా’పై క్రేజీ ఆఫర్స్
  • బ్యాంక్ ఆఫర్లతో రూ. 16,999 ఫ్లాట్ డిస్కౌంట్
ప్రకటన

Oppo : మీరు ఏదైనా ప్రీమియం, అల్ట్రా లగ్జరీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గత నెలలోనే మార్కెట్లోకి విడుదలైన ఒప్పో సరికొత్త సంచలనం Oppo Find X9 Ultra మీకు ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ కానుంది. అత్యంత పవర్‌ఫుల్ ఫీచర్లు, అద్భుతమైన కెమెరా సెటప్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‎లో భారీ డిస్కౌంట్లతో లభిస్తోంది. పాత ఫోన్‌ను మార్చుకునే వారికి ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద భారీ తగ్గింపు లభిస్తుండటంతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి కస్టమర్లు పోటీ పడుతున్నారు.

ధర ఎంత? బ్యాంక్ ఆఫర్లు ఏంటి?
భారత మార్కెట్లో Oppo Find X9 Ultra స్మార్ట్‌ఫోన్  టాప్-ఎండ్ మోడల్ అయిన 12GB రామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,69,999 గా లిస్ట్ చేయబడింది. అయితే దీనిపై క్రేజీ బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే కస్టమర్లకు రూ.16,999 వరకు భారీ ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.1,53,000కి తగ్గిపోతుంది.

రూ.60,300 భారీ ఎక్స్ఛేంజ్ బోనస్
బ్యాంక్ ఆఫర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.60,300 వరకు అదనపు పొదుపు చేసుకోవచ్చు. దీనివల్ల ఈ లగ్జరీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర మరింతగా తగ్గిపోతుంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది మీరు ఇచ్చే పాత మొబైల్ కండిషన్, బ్రాండ్, మోడల్ వర్కింగ్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది. మంచి కండిషన్‌లో ఉన్న ప్రీమియం ఫోన్ ఇస్తే గరిష్ట ఆఫర్ లభించడం ఖాయం.

డిస్‌ప్లే, ప్రాసెసర్ పవర్ హౌస్
ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.82 ఇంచుల QHD+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ స్క్రీన్‌ను అందించారు. ఇది 1440×3168 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఫోన్ సెక్యూరిటీ కోసం ఇందులో సరికొత్త త్రీడీ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అమర్చారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ మొబైల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 పై పనిచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో క్వాల్‌కామ్, మోస్ట్ పవర్‌ఫుల్  స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ వాడారు.

OTT Movie : ఓటీటీ ప్రియులకు పండగే.. అమెజాన్ ప్రైమ్ లోకి వస్తోన్న పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ ఇసకపట్నం

7050mAh బిగ్ బ్యాటరీ.. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుంది, కానీ ఒప్పో ఈ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించింది. Oppo Find X9 Ultraలో ఏకంగా 7,050mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్,  50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఫోన్ చాలా త్వరగా ఛార్జ్ అవ్వడమే కాకుండా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే సులభంగా రెండు నుంచి మూడు రోజుల పాటు బ్యాకప్ ఇస్తుంది. హెవీ యూజర్లకు, గేమర్లకు ఈ బ్యాటరీ బ్యాకప్ ఒక పెద్ద వరమనే చెప్పాలి.

డిఎస్‌ఎల్‌ఆర్‎ను తలపించే క్వాడ్ కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే ఈ ఫోన్‌కు మార్కెట్లో తిరుగే లేదు. దీని వెనుక భాగంలో నాలుగు పవర్‌ఫుల్ కెమెరాలను అందించారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, మరో 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. కనెక్టివిటీ పరంగా వై-ఫై 7, బ్లూటూత్ 6.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 235 గ్రాములు, 8.65 మిమీ మందం కలిగి ఉంటుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »