Google released Android 17 OS Update: ఆండ్రాయిడ్ 17 లో తీసుకొచ్చిన అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ బబుల్స్
Photo Credit: Google
Android 17
Google released Android 17 OS Update: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో అత్యధికంగా వాడే ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్‌లో సరికొత్త తరం అప్‌డేట్ వచ్చేసింది. గూగుల్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ 17 ఓఎస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రాథమికంగా ఈ అప్‌డేట్ గూగుల్ పిక్సెల్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ల యూజర్లకు రోల్ అవుట్ కావడం ప్రారంభమైంది. అతి త్వరలోనే శాంసంగ్, వన్‌ప్లస్, షావోమి వంటి ఇతర ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లకూ ఈ లేటెస్ట్ ఓఎస్ లభించనుంది. యూజర్ల ప్రొడక్టివిటీ, ఎంటర్‌టైన్‌మెంట్, భద్రతను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లేలా ఈ కొత్త ఓఎస్‌ను డిజైన్ చేశారు. దీని సోర్స్ కోడ్‌ను కూడా ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (AOSP)లో అందుబాటులో ఉంచారు. అలాగే, కొన్ని ప్రీమియం ఫ్లాగ్‌షిప్ డివైజ్‌లలో ఈ ఏడాదిలోనే అడ్వాన్స్‌డ్ జెమిని ఇంటెలిజెన్స్ కూడా యాడ్ కానుంది.
బబుల్స్ ఫీచర్‌తో సూపర్‌ఫాస్ట్ మల్టీటాస్కింగ్..
ఆండ్రాయిడ్ 17 లో తీసుకొచ్చిన అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ బబుల్స్. దీని సహాయంతో యూజర్లు తాము వాడుతున్న ఏ యాప్‌నైనా సరే చాలా సులభంగా ఒక చిన్న ఫ్లోటింగ్ విండోలా (స్క్రీన్‌పై తేలియాడే విండో) మార్చుకోవచ్చు. దీని కోసం ఏదైనా యాప్ ఐకాన్‌ను కాసేపు లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, అది బబుల్‌గా మారిపోతుంది. ట్యాబ్‌లు, ఫోల్డబుల్ ఫోన్లు లేదా పెద్ద స్క్రీన్ ఉన్న డివైజ్‌లలో ఈ బబుల్స్ అన్నీ స్క్రీన్ కింద భాగంలో ఒక ప్రత్యేక బబుల్ బార్ లో అమరి ఉంటాయి. దీనివల్ల యూజర్లు కేవలం ఒక చిన్న టాప్‌తో వేర్వేరు యాప్స్ మధ్య స్విచ్ అవ్వొచ్చు. ఉదాహరణకు ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే పక్కనే మ్యాప్స్ చూసుకోవడం లేదా స్పోర్ట్స్ అప్‌డేట్స్ చెక్ చేసుకోవడం దీని ద్వారా చాలా సులభంగా మారుతుంది.
స్క్రీన్ రియాక్షన్స్‌తో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్..
యూజర్లు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవడానికి ఆండ్రాయిడ్ 17 లో ఒక క్రేజీ టూల్‌ను గూగుల్ పరిచయం చేసింది. అదే స్క్రీన్ రియాక్షన్స్. ఈ సరికొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫోన్ స్క్రీన్‌ను రికార్డ్ చేస్తున్నప్పుడు, అదే సమయంలో ఫోన్ సెల్ఫీ కెమెరాను ఆన్ చేసి తమ ఫేస్ ఎక్స్‌ప్రెషన్లను కూడా రికార్డ్ చేయవచ్చు. దీనికోసం ఎలాంటి గ్రీన్ స్క్రీన్ లేదా థర్డ్ పార్టీ యాప్స్ వాడాల్సిన అవసరం లేదు. ఏదైనా వెబ్‌సైట్, ట్రెండింగ్ వీడియో లేదా ఆర్టికల్ చూస్తున్నప్పుడు దానిపై మీ రియాక్షన్స్ ఏంటో లైవ్‌గా రికార్డ్ చేసి మీ ఫ్రెండ్స్‌తో లేదా సోషల్ మీడియాలో చాలా వేగంగా షేర్ చేసుకోవచ్చు.
Cell Broadcast : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్ తాత్కాలికంగా నిలిపివేత
ఫోల్డబుల్ ఫోన్ల కోసం స్పెషల్ గేమింగ్ మోడ్..
ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లకు క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఆండ్రాయిడ్ 17 లో ఒక ప్రత్యేకమైన ఫోల్డబుల్ గేమింగ్ మోడ్‌ను ప్రవేశపెట్టారు. ఈ మోడ్ గేమర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఫోల్డబుల్ స్క్రీన్‌ను ఓపెన్ చేసినప్పుడు ఇది అద్భుతమైన 50/50 లేఅవుట్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది. అంటే స్క్రీన్ పైభాగంలో గేమ్ పూర్తి విజువల్స్ కనిపిస్తుండగా, కింద భాగంలో ఒక డైనమిక్ గేమ్‌ప్యాడ్ ఓపెన్ అవుతుంది. దీనివల్ల బటన్స్ నొక్కడానికి, గేమ్‌ను స్పష్టంగా చూడటానికి యూజర్లకు ఎక్కువ స్పేస్ లభిస్తుంది. ఈ ఫీచర్ రాబోయే కొన్ని నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
దొంగల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సెక్యూరిటీ అప్‌డేట్స్..
యూజర్ల వ్యక్తిగత డేటా రక్షణ కోసం ఆండ్రాయిడ్ 17 లో గూగుల్ అత్యంత పటిష్టమైన భద్రతా ఫీచర్లను తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు ఏదైనా యాప్‌కు తమ లొకేషన్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కేవలం టెంపరరీ యాక్సెస్ మాత్రమే ఇవ్వొచ్చు. అలాగే మీ ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ కాకుండా కేవలం కొన్ని నంబర్లను మాత్రమే యాప్స్‌తో షేర్ చేసుకునే కంట్రోల్ లభించింది. అన్నింటికంటే హైలైట్ ఫీచర్ ఏంటంటే.. ఫైండ్ హబ్ లోని అప్‌డేటెడ్ మార్క్ యాజ్ లాస్ట్ ఫీచర్. దీని ద్వారా మీ ఫోన్ ఎక్కడైనా పోయినా లేదా దొంగిలించబడినా.. మీ బయోమెట్రిక్స్ తో ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేయవచ్చు. ఒకవేళ దొంగకు మీ ఫోన్ స్క్రీన్ పాస్‌కోడ్ ముందే తెలిసి ఉన్నప్పటికీ.. మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేనిదే ఫోన్ లోపల ఉన్న ఎలాంటి సమాచారాన్ని వారు యాక్సెస్ చేయలేరు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999