గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ టాప్ వేరియంట్ గత ఏడాది ఆగస్ట్ 2025 లో రూ.79,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది.
Photo Credit: Google Pixel 10
Google Pixel 10
Google Pixel 10 : స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు, ముఖ్యంగా బెస్ట్ కెమెరా ఫోన్ కోరుకునే వారికి ఒక అద్భుతమైన శుభవార్త. గూగుల్ గతేడాది ఆగస్ట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. లాంచ్ సమయంలో ఈ ఫోన్‌ను భారీ బడ్జెట్ కారణంగా కొనలేకపోయిన వారికి, ఇప్పుడు తక్కువ ధరకే ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్‌ను సొంతం చేసుకునే గోల్డెన్ ఛాన్స్ దొరికింది. గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ టాప్ వేరియంట్ గత ఏడాది ఆగస్ట్ 2025 లో రూ.79,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. అయితే, ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ రూ. 63,750 లకే లిస్ట్ చేయబడింది. దీనికి అదనంగా, హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగించి కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.3,000 వరకు (5 శాతం) ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కార్డ్ ఆఫర్ కూడా వర్తింపజేస్తే ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.60,750కి తగ్గుతుంది. అంటే లాంచ్ ధర కంటే దాదాపు రూ.19,249 తక్కువకే ఈ ఫోన్ లభిస్తోంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరిన్ని ఆదా
కార్డ్ డిస్కౌంట్లతో పాటు, పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకోవాలనుకునే వారి కోసం అమెజాన్ భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. వినియోగదారులు తమ పాత లేదా ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.30,900 వరకు అదనపు పొదుపును పొందవచ్చు. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది మీరు మార్పిడి చేసే పాత ఫోన్ యొక్క మోడల్, బ్రాండ్, అది ఎంతవరకు పని చేస్తోంది అనే కండిషన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పాత ఫోన్‌కు మంచి వాల్యూ వస్తే, పిక్సెల్ 10ని చాలా తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.
అద్భుతమైన యాక్చువా ఓఎల్ఈడీ డిస్‌ప్లే
గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిస్‌ప్లే ఫీచర్లతో వస్తుంది. ఇందులో 1080x2424 పిక్సెల్స్ రెజల్యూషన్ కలిగిన 6.3-ఇంచుల యాక్చువా ఓఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇది వాడుకను బట్టి బ్యాటరీని ఆదా చేసేలా 60Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఇందులో అత్యున్నతమైన 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్‌ను జోడించారు. ఈ ఫోన్ పొడవు 152.8 మిమీ, వెడల్పు 72 మిమీ, మందం 8.6 మిమీ, బరువు 204 గ్రాములుగా ఉంది.
టెన్సర్ G5 ప్రాసెసర్, లేటెస్ట్ సాఫ్ట్‌వేర్
పనితీరు విషయానికి వస్తే, ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ సొంతంగా అభివృద్ధి చేసిన సరికొత్త గూగుల్ టెన్సర్ G5 పవర్‌ఫుల్ ఏఐ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా, ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 అవుట్-ఆఫ్-ది-బాక్స్ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. గూగుల్ ఫోన్ కావడం వల్ల దీనికి రెగ్యులర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ చాలా వేగంగా లభిస్తాయి.
vivo y05e : భారత మార్కెట్లోకి వివో సరికొత్త బడ్జెట్ ఫోన్.. వివో Y05e లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్
ఫొటోగ్రఫీకి కేరాఫ్ అడ్రస్ ఏఐ ట్రిపుల్ కెమెరా
పిక్సెల్ ఫోన్ల ప్రధాన బలమే వాటి కెమెరాలు. గూగుల్ పిక్సెల్ 10 వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.7 అపెర్చర్ కలిగిన 48-మెగాపిక్సెల్ వైడ్ ప్రైమరీ కెమెరా, f/2.2 అపెర్చర్ కలిగిన 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, f/3.1 అపెర్చర్ కలిగిన 10.8-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, క్లియర్ వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో f/2.2 అపెర్చర్ గల 10.5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
భారీ బ్యాటరీ, కనెక్టివిటీ ఆప్షన్లు
ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లో లాంగ్ లాస్టింగ్ బ్యాకప్ కోసం 4,970mAh సామర్థ్యం గల శక్తివంతమైన బ్యాటరీని అందించారు. ఇది 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌ను, 10W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇక మిగిలిన కీలక కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్, సూపర్ ఫాస్ట్ 5జీ నెట్‌వర్క్, వై-ఫై 6E, బ్లూటూత్ v6, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్‌బీ టైప్-సి 3.2 పోర్ట్ వంటి అన్ని రకాల అడ్వాన్స్‌డ్ ఫీచర్లను గూగుల్ ఇందులో సమకూర్చింది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Lenovo ThinkBook 14x Launched in India With Intel Core Ultra Series 2 Processors: Price, Specifications