Google Pixel 11 Launching on August 12: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆగస్టు 12న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్

Google Pixel 11 deries Launching on August 12 2026: ఈ అప్‌కమింగ్ పిక్సెల్ 11 సిరీస్‌లో గూగుల్ ఒక సరికొత్త ఇన్నోవేటివ్ ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది

Google Pixel 11 Launching on August 12: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆగస్టు 12న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్

Photo Credit: Google

Samsung M16 OLED

ముఖ్యాంశాలు
  • రియర్ ప్యానెల్‌పై మెరిసిపోయే 'పిక్సెల్ గ్లో' ఫీచర్
  • గూగుల్ అధికారిక టీజర్‌లో సరికొత్త విజువల్ ఎలిమెంట్
  • ఒకే వేదికపై 4 కొత్త పిక్సెల్ మోడల్స్
ప్రకటన

Google Pixel 11 Series Launching on August 12: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సర్వం సిద్ధం చేసింది. ఎంతో కాలంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్‌ను వచ్చే నెలలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆగస్టు 12న జరగబోయే ప్రతిష్టాత్మక మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో ఈ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. గూగుల్ స్టోర్ హోమ్‌పేజీలో విడుదల చేసిన ఒక చిన్న ప్రమోషనల్ వీడియో క్లిప్‌ ద్వారా ఈ లాంచ్ తేదీని వెల్లడించడమే కాకుండా, ఇందులో గోల్డెన్ కలర్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు.

రియర్ ప్యానెల్‌పై మెరిసిపోయే పిక్సెల్ గ్లో ఫీచర్..

ఈ అప్‌కమింగ్ పిక్సెల్ 11 సిరీస్‌లో గూగుల్ ఒక సరికొత్త ఇన్నోవేటివ్ ఫీచర్‌ను పరిచయం చేయబోతోంది. దీనికి పిక్సెల్ గ్లో అని పేరు పెట్టారు. సాధారణంగా కొన్ని బ్రాండ్లు ఫోన్ వెనుక భాగంలో లైటింగ్ కోసం ప్రత్యేకంగా లైట్ స్ట్రిప్స్ వాడుతుంటాయి, కానీ గూగుల్ అలా కాకుండా కారు వెనుక వైపు ఉండే కెమెరా బార్‌లోని సర్క్యులర్ ఏరియాలో ఫ్లాష్ లైట్ ఉండే స్థానంలోనే ఈ కొత్త విజువల్ ఎలిమెంట్‌ను ఇంటెగ్రేట్ చేసింది. ఈ టీజర్ యానిమేషన్‌లో లైట్లు విభిన్న రంగుల్లో మెరుస్తూ కనిపించాయి. అయితే, ఈ పిక్సెల్ గ్లో ఫీచర్ కేవలం నోటిఫికేషన్ అలర్ట్ల కోసమా లేక దీనికి ఏవైనా కస్టమైజేషన్ ఆప్షన్లు ఉంటాయా అనే పూర్తి వివరాలను కంపెనీ ఇంకా సస్పెన్స్‌గానే ఉంచింది.

ఈవెంట్ ముగియగానే ప్రీ-ఆర్డర్లు షురూ..

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న గూగుల్ సంస్థ.. ఈ పిక్సెల్ 11 సిరీస్ ఫోన్ల ప్రీ-ఆర్డర్ల ప్రక్రియను ఆగస్టు 12న మేడ్ బై గూగుల్ ఈవెంట్ ముగిసిన వెంటనే ప్రారంభించనుంది. ముఖ్యంగా అమెరికాలోని గూగుల్ స్టోర్‌లో తమ గూగుల్ అకౌంట్‌తో ప్రమోషనల్ ఈమెయిల్స్ కొరకు సైన్-అప్ చేసిన కస్టమర్లకు జూలై 15 నుంచి ఆగస్టు 11 మధ్య ఒక ప్రత్యేక ప్రమోషనల్ కోడ్ లభిస్తుంది. ఈ కోడ్‌ను ఉపయోగించి వారు ఆగస్టు 27 లోపు సరికొత్త అన్‌లాక్డ్ పిక్సెల్ 11 లేదా గూగుల్ ఫై  మోడళ్లను గూగుల్ స్టోర్ ద్వారా ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు.

iQOO Z11 Lite : కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఐకూ బంపర్ ఆఫర్.. జూలై 24న మార్కెట్లోకి సరికొత్త iQOO Z11 Lite

ఒకే వేదికపై 4 కొత్త పిక్సెల్ మోడల్స్..

ఆగస్టు 12న జరగబోయే ఈ మెగా ఈవెంట్‌లో గూగుల్ కేవలం బేస్ మోడల్‌ను మాత్రమే కాకుండా ఒకేసారి నాలుగు విభిన్న వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉందని లీకుల ద్వారా తెలుస్తోంది. ఇందులో గూగుల్ పిక్సెల్ 11 బేస్ మోడల్‌తో పాటు పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్, ఫోల్డబుల్ స్క్రీన్‌తో వచ్చే పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ మోడళ్లు ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్లతో పాటు సరికొత్త గూగుల్ పిక్సెల్ వాచ్ 5 సిరీస్‌ను కూడా అదే వేదికపై లాంచ్ చేయనున్నారు. వీటితో పాటు గూగుల్ తన యూజర్ల కోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కూడా ఈ ఈవెంట్‌లో లాంచ్ చేయబోతోంది.

టెన్సార్ G6 పవర్‌ఫుల్ చిప్‌సెట్..

గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. డిస్‌ప్లే విభాగంలో ఈసారి సరికొత్త టెక్నాలజీని ఉపయోగించినట్లు టాక్ వినిపిస్తోంది. కొన్ని విశ్వసనీయ నివేదికల ప్రకారం, ఈ ఫోన్లలో అత్యంత ప్రకాశవంతమైన, కలర్ రిచ్ విజువల్స్ అందించే శామ్‌సంగ్ M16 ఓఎల్ఈడీ డిస్‌ప్లే ప్యానెల్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. అలాగే పర్ఫార్మెన్స్ మరింత వేగవంతంగా, ల్యాగ్-ఫ్రీగా ఉండటం కోసం గూగుల్ సొంతంగా డెవలప్ చేసిన నెక్స్ట్ జెనరేషన్ పవర్‌ఫుల్ గూగుల్ టెన్సార్ G6  చిప్‌సెట్‌ను ఈ మొబైల్స్‌లో వాడనున్నారు. మొత్తానికి సరికొత్త డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్స్, సరికొత్త ఏఐ ఫీచర్లతో రాబోతున్న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ మార్కెట్లో ఐఫోన్, శామ్‌సంగ్ ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »