iQOO Z11 Lite launching: కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఐకూ బంపరాఫర్.. జూలై 24న మార్కెట్లోకి సరికొత్త iQOO Z11 Lite ఫోన్

iQOO Z11 Lite launching in India on July 24 for Students: భారతదేశంలో ఈ సరికొత్త iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.20,000 బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి రానుంది

iQOO Z11 Lite launching: కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఐకూ బంపరాఫర్.. జూలై 24న మార్కెట్లోకి సరికొత్త iQOO Z11 Lite ఫోన్

Photo Credit: iQOO

iQOO Z11 Lite

ముఖ్యాంశాలు
  • కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఐకూ బంపర్ ఆఫర్
  • రూ. 20 వేల బడ్జెట్లోనే లగ్జరీ ఫీచర్లు
  • అమెజాన్‌లో ఐకూ కొత్త మొబైల్ విక్రయాలు!
ప్రకటన

iQOO Z11 Lite launching in India on July 24: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ భారతీయ వినియోగదారులను, ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేస్తూ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి రెడీ అయింది. iQOO Z11 Lite పేరుతో వస్తున్న ఈ మొబైల్‌ను ఈ నెల 24వ తేదీన దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనున్నారు. విద్యార్థుల రోజువారీ అవసరాలైన ఆన్‌లైన్ లెక్చర్స్ వినడం, ప్రాజెక్ట్ అసైన్‌మెంట్లు చేయడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వంటి మల్టీ టాస్కింగ్ పనులను సులభతరం చేసేలా ఈ ఫోన్‌ను బ్రాండ్ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. అత్యంత దృఢమైన బాడీ, బ్రైట్ డిస్‌ప్లే, అదిరిపోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తున్న ఈ కారుచౌక ఫోన్ విద్యార్థులకు పర్‌ఫెక్ట్ ఛాయిస్‌గా మారనుంది.

రూ. 20 వేల బడ్జెట్లోనే లగ్జరీ ఫీచర్లు..

భారతదేశంలో ఈ సరికొత్త iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.20,000 బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత ఐకూ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వేదికగా కస్టమర్లకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. లుక్స్ పరంగా ఎంతో స్టైలిష్‌గా ఉండే ఈ మొబైల్‌ను కంపెనీ రెండు ప్రీమియం కలర్ వేరియంట్లలో తీసుకొస్తోంది. అందులో ఒకటి సోలార్ ఫ్లేమ్ కాగా, మరొకటి మిడ్‌నైట్ బ్లూ రంగుల్లో లభించనుంది. మినిమలిస్ట్ డిజైన్, కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్, నోటిఫికేషన్ల కోసం వెనుక వైపు వచ్చే డైనమిక్ లైట్ ఈ ఫోన్ అందాన్ని మరింత పెంచుతాయి.

విద్యార్థుల చదువుకు అండగా నిలిచే అడ్వాన్స్‌డ్ ఏఐ..

ఈ ఫోన్‌లో విద్యార్థుల కోసం పవర్‌ఫుల్  AI ప్రొడక్టివిటీ ఫీచర్ల సెట్‌ను అందించారు. దీనిలోని AI క్రియేషన్ ఫీచర్ సహాయంతో విద్యార్థులు పెద్ద పెద్ద డాక్యుమెంట్లను సులభంగా సమ్మరైజ్ చేసుకోవచ్చు. అలాగే అసైన్‌మెంట్లను మరింత మెరుగుపరుచుకోవడానికి, కొత్త ఐడియాల కోసం, టెక్స్ట్ ట్రాన్స్‌లేషన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు ఉన్న AI క్యాప్షన్ ఫీచర్ ద్వారా లైవ్ లెక్చర్స్ లేదా డిస్కషన్లు జరుగుతున్నప్పుడు రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్, ఇన్‌స్టంట్ ట్రాన్స్‌లేషన్, వన్-ట్యాప్ సమ్మరీ వంటి సౌకర్యాలు లభిస్తాయి. దీనివల్ల కాలేజీ క్లాసుల నోట్స్ ప్రిపేర్ చేయడం, ఇతరులతో షేర్ చేయడం చాలా సులభం అవుతుంది.

ISRO : ఇస్రో శాస్త్రవేత్తల వరుస రాజీనామాలు.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం, కొత్త రూల్స్ జారీ


6500mAh భారీ బ్యాటరీతో సరికొత్త రికార్డు..

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్‌లో అమర్చిన బ్యాటరీ కెపాసిటీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో ఏకంగా 6500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. ఇది 44W ఫ్లాష్‌చార్జ్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల విద్యార్థులు ఒకసారి చార్జ్ చేస్తే చదువుల కోసం రోజంతా ఎలాంటి బ్రేక్ లేకుండా లాంగ్ పర్ఫార్మెన్స్ పొందవచ్చు. అంతేకాకుండా, ఈ బ్యాటరీ ఏకంగా 5 సంవత్సరాల బ్యాటరీ హెల్త్ లైఫ్‌తో వస్తుండటం విశేషం. కాబట్టి లాంగ్ రన్‌లో బ్యాటరీ పాడైపోతుందనే భయం యూజర్లకు ఉండదు.

పైనుంచి కింద పడినా చెక్కుచెదరదు..

క్యాంపస్ లైఫ్‌లో విద్యార్థులు ప్రయాణాలు చేసేటప్పుడు లేదా ఆత్రుతలో ఫోన్ కింద పడేయడం, వర్షంలో తడవడం వంటి ప్రమాదాలు సర్వసాధారణం. వీటన్నింటిని తట్టుకునేలా iQOO Z11 Lite ఫోన్‌కు అత్యున్నత రక్షణ కల్పించారు. దీనికి కఠినమైన మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఉంది. అలాగే పొరపాటున చేయి జారి కింద పడినా స్క్రీన్ పగలకుండా ఉండేందుకు SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. అవుట్‌డోర్ ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ గల డిస్‌ప్లేను ఇందులో అమర్చారు. మొత్తానికి రూ.20 వేల ధరలో స్టూడెంట్స్ కోసం ఆల్‌రౌండర్ ఫోన్‌గా ఈ మొబైల్ నిలవనుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »