స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీని ప్రధానంగా వేధిస్తున్న విడిభాగాల ధరల పెంపు ప్రభావం గూగుల్ హార్డ్‌వేర్ విభాగంపై కూడా పడింది.
Google Pixel 11 Series Price Hike
Google Pixel 11 Series Price Hike : అమెరికన్ టెక్ దిగ్గజం కంపెనీ గూగుల్ త్వరలో విడుదల చేయనున్న తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ పిక్సెల్ 11 ధరలు చాలా ఖరీదుగా ఉండబోతున్నాయని సూచనలు వస్తున్నాయి. ఈ సిరీస్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL , పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ మోడళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మెమరీ, స్టోరేజ్ కాంపోనెంట్ల తయారీ వ్యయం గణనీయంగా పెరగడం వల్ల ఈ కొత్త సిరీస్ ధరలు మునుపటి కంటే ఎక్కువగా ఉంటాయని గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
విడిభాగాల ధరల పెంపే ప్రధాన కారణం
స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీని ప్రధానంగా వేధిస్తున్న విడిభాగాల ధరల పెంపు ప్రభావం గూగుల్ హార్డ్‌వేర్ విభాగంపై కూడా పడింది. ఈ సవాలును కేవలం గూగుల్ మాత్రమే కాకుండా దాదాపు అన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీనివల్లే మార్కెట్‌లోకి వచ్చే కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంచ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గూగుల్ ఎగ్జిక్యూటివ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే పిక్సెల్ 11 సిరీస్‌తో పాటు, అంతకుముందు వచ్చిన పిక్సెల్ 10 సిరీస్ మోడళ్ల ధరలపై కూడా దీని ప్రభావం పడే అవకాశముంది.
Amazon Great Freedom Sale vs Flipkart Freedom Sale : ఆఫర్లే ఆఫర్లు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ఫ్రీడమ్ సేల్స్ వచ్చేస్తున్నాయ్
యూరోప్‌లో ధరల అంచనా ఎంతంటే?
యూరోపియన్ మార్కెట్ అంచనాల ప్రకారం.. పిక్సెల్ 11 ప్రారంభ ధర దాదాపు 999 యూరోలు (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.1,09,200) ఉండే అవకాశం ఉంది. అలాగే పిక్సెల్ 11 ప్రో మోడల్ ప్రారంభ ధర 1,199 యూరోలు (సుమారు రూ. 1,31,000), పిక్సెల్ 11 ప్రో XL ధర 1,399 యూరోలు (సుమారు రూ. 1,53,000) వరకు ఉండే అవకాశముంది. ఆగస్టు 12న జరగబోయే గ్లోబల్ మేడ్ బై గూగుల్ ఈవెంట్‌లో ఈ ఫోన్లను అధికారికంగా లాంచ్ చేయనున్నారని సమాచారం.
కొత్తగా ఆకట్టుకోనున్న పిక్సెల్ గ్లో ఫీచర్
ధరల పెంపు సంగతి పక్కన పెడితే, గూగుల్ తన కొత్త సిరీస్‌లో పిక్సెల్ గ్లో అనే వినూత్న విజువల్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. సాధారణంగా ఫోన్ల వెనుక భాగంలో లైట్ స్ట్రిప్స్ వాడతారు, కానీ గూగుల్ ఈ ఫీచర్‌ను కెమెరా బార్‌లోని సర్క్యులర్ ఏరియాలో కస్టమైజ్డ్ ఫ్లాష్ స్థానంలో ఇంటిగ్రేట్ చేసింది. గూగుల్ స్టోర్ హోమ్‌పేజీలో విడుదల చేసిన ప్రోమో క్లిప్‌లో గోల్డెన్ కలర్ ఫోన్‌పై ఈ ఫ్లాషింగ్ కలర్‌ఫుల్ లైటింగ్ యానిమేషన్ కనిపించింది. అయితే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది. ఇందులో ఏమైనా కస్టమైజేషన్ ఆప్షన్లు ఉంటాయా అనే విషయాలు పూర్తి లాంచ్ సమయంలోనే తెలియనున్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999