మెజాన్ తన గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ను సాధారణ వినియోగదారులందరికీ ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి తేనుంది.
Photo Credit: Amazon/Flipkart
Amazon Great Freedom Sale vs Flipkart Freedom Sale
Amazon Great Freedom Sale vs Flipkart Freedom Sale : భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వినియోగదారుల కోసం భారీ సేల్స్‌ను ప్రకటించాయి. ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈసారి కూడా కస్టమర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త ఆఫర్లు, బంపర్ డిస్కౌంట్లతో ముందుకు వస్తున్నాయి. ఈ రెండు సంస్థలు ఆగస్టు మొదటి వారంలోనే తమ ఆఫర్ల మేళాను ప్రారంభించనున్నట్లు అధికారికంగా తేదీలను వెల్లడించాయి. ఈ సేల్స్ ద్వారా ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులపై వినియోగదారులు భారీగా ఆదా చేసుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు, తేదీలు
అమెజాన్ తన గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ను సాధారణ వినియోగదారులందరికీ ఆగస్టు 7 నుంచి అందుబాటులోకి తేనుంది. అయితే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం ఒక రోజు ముందుగానే, అంటే ఆగస్టు 6 నుంచే ఎర్లీ యాక్సెస్ లభిస్తుంది. ఈ సేల్‌లో ట్రెండింగ్ డీల్స్, బ్లాక్‌బస్టర్ డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా కస్టమర్లు మైండ్ బ్లాకింగ్ డిస్కౌంట్లు పొందవచ్చు. అంతేకాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈజీ ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై ఏకంగా 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభించనుంది.
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్
మరోవైపు పోటీగా ఫ్లిప్‌కార్ట్ కూడా తన ఫ్రీడమ్ సేల్‌ను ఆగస్టు 8 నుంచి ప్రారంభించబోతోంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డ్ సభ్యులకు 24 గంటల ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో మేడ్ ఇన్ ఇండియా, టిక్ టాక్ డీల్స్, డీల్స్ ఆఫ్ ది డే, రష్ అవర్స్ వంటి స్పెషల్ సెగ్మెంట్ల ద్వారా బంపర్ ఆఫర్లు అందిస్తున్నారు. కొనుగోలుదారులు SBI కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందే అవకాశం కల్పించారు.
Smartphone Price Hike : భారీగా పెరిగిన షియోమి, రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు రాబోయే సేల్స్‌లో లభించే టాప్ డీల్స్‌ను ఒక్కొక్కటిగా రివీల్ చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 17, శామ్‌సంగ్ గెలాక్సీ S25, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వంటి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లపై ఊహించని ధరకు డీల్స్ రానున్నాయి. వీటితో పాటు శామ్‌సంగ్ 55 అంగుళాల 4K టీవీ, శామ్‌సంగ్ బుక్4 పీసీ, శామ్‌సంగ్ వాచ్ 9, శామ్‌సంగ్ టాబ్ A11+ వంటి ఎలక్ట్రానిక్స్, హోమ్ ప్రొడక్ట్స్ పై కూడా బెస్ట్ డిస్కౌంట్లు లభించనున్నాయి.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999