Huge discount on Google Pixel 7: గూగుల్ కంపెనీ తమ పిక్సెల్ 7 (8GB రామ్ + 128GB స్టోరేజ్) వేరియంట్‌ను అక్టోబర్ 2022 లో భారత మార్కెట్లో రూ.59,999ల భారీ ధరకు లాంచ్ చేసింది.
Photo Credit: Google Pixel 7
Google Pixel 7
Mega Discount on Google Pixel 7: ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఐఫోన్, శాంసంగ్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ.. ప్రీమియం ఫీచర్లు, ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది గూగుల్ పిక్సెల్ సిరీస్. మీరు కూడా ఒక మంచి గూగుల్ బ్రాండ్ ఫోన్ కొనాలని ఎదురుచూస్తుంటే ఇదే సరైన సమయం. అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫారమ్‌లో గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లైవ్‌లో ఉంది. ఈ ఆఫర్ ద్వారా ఒకప్పటి ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఇప్పుడు చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ధరల వివరాలు, లాంచ్ ప్రైస్ పోలిక..
గూగుల్ కంపెనీ తమ పిక్సెల్ 7 (8GB రామ్ + 128GB స్టోరేజ్) వేరియంట్‌ను అక్టోబర్ 2022 లో భారత మార్కెట్లో రూ.59,999ల భారీ ధరకు లాంచ్ చేసింది. అయితే ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఏకంగా రూ.29,499లకే లిస్ట్ అయ్యింది. అంటే ఎవరైనా కస్టమర్ ఎలాంటి అదనపు ఆఫర్లు వాడకుండానే నేరుగా కొనుగోలు చేసినా.. లాంచ్ ధర కంటే ఏకంగా రూ.30,500ల భారీ ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ముప్పై వేల లోపు బడ్జెట్ ఉన్న వారికి ఇది నిజంగా గోల్డెన్ డీల్ అని చెప్పాలి.
బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ ట్విస్ట్..
ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే దక్కించుకోవడానికి అమెజాన్ కొన్ని అద్భుతమైన ఆఫర్లను కూడా అందిస్తోంది. మీరు గనుక హెచ్ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే.. మీకు అదనంగా 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (రూ.1,474 వరకు) లభిస్తుంది. దీనితో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ రూ.28,024 కే తగ్గుతుంది. అంతేకాకుండా, మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.27,650 వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ ఫోన్‌పై దాదాపు రూ. 31,975 ల వరకు వాస్తవ లాభం చేకూరుతుంది.
కళ్ళు చెదిరే డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ పవర్..
గూగుల్ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఇందులో 2400 x 1080 పిక్సెల్స్ రెజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్న 6.30-ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీనివల్ల ఇండోర్, అవుట్‌డోర్లలో స్క్రీన్ బ్రైట్‌నెస్, కలర్స్ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, గూగుల్ కంపెనీ ఈ ఫోన్‌కు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ను కూడా అందించింది. ప్యూర్ ఆండ్రాయిడ్ కావడం వల్ల ఇందులో ఎలాంటి అనవసరమైన బ్లోట్‌వేర్ యాప్స్ ఉండవు, ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.
FIFA World Cup 2026 : భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ జాతర.. టీవీ, మొబైల్‌లో లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలంటే
గూగుల్ టెన్సార్ G2 ఇంజిన్, సెక్యూరిటీ..
ఈ ఫోన్‌లో గూగుల్ సొంతంగా తయారు చేసిన శక్తివంతమైన ఆక్టా-కోర్ గూగుల్ టెన్సార్ G2 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను,హెవీ గేమింగ్‌ను చాలా సులభంగా హ్యాండిల్ చేస్తుంది. ఇందులో 8GB రామ్ తో పాటు 256GB వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. భద్రత కోసం ఫోన్ స్క్రీన్ లోపలే అమర్చిన అడ్వాన్స్‌డ్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫాస్ట్ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
సినిమాటిక్ 50MP కెమెరా, అదిరిపోయే బ్యాటరీ..
గూగుల్ పిక్సెల్ ఫోన్లంటేనే కెమెరాకు పెట్టింది పేరు. పిక్సెల్ 7 బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు లాండ్‌స్కేప్ ఫోటోల కోసం 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు వైపు 10.8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వై-ఫై 6E, బ్లూటూత్ 5.2, ఎన్‌ఎఫ్‌సీ, టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు ప్రీమియం వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఆన్ చేస్తే ఈ ఫోన్ ఏకంగా 72 గంటల (3 రోజులు) బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుందని కంపెనీ గట్టిగా చెప్తోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999