FIFA World Cup 2026 LIVE in India: అట్లాంటా, బోస్టన్, డల్లాస్, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్, మయామి, మెక్సికో సిటీ, టొరంటో, వాంకోవర్, సీటెల్ వంటి మొత్తం 16 ప్రపంచ స్థాయి నగరాల్లోని అత్యాధునిక స్టేడియాలలో ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
Photo Credit: FIFA World Cup 2026
FIFA World Cup 2026
FIFA World Cup 2026 LIVE in India: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఫుట్‌బాల్ లవర్స్‌ను ఉర్రూతలూగించేందుకు ఫిఫా వరల్డ్ కప్ 2026 వచ్చేసింది. ఈ ఏడాది టోర్నమెంట్ ఎన్నో ప్రత్యేకతలతో సాగుతోంది. ఉత్తర అమెరికా ఖండంలోని మూడు పెద్ద దేశాలైన అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి. అట్లాంటా, బోస్టన్, డల్లాస్, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్, మయామి, మెక్సికో సిటీ, టొరంటో, వాంకోవర్, సీటెల్ వంటి మొత్తం 16 ప్రపంచ స్థాయి నగరాల్లోని అత్యాధునిక స్టేడియాలలో ఈ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
మొదటిసారి 48 జట్లు.. 104 మ్యాచ్‌లు..
గతంలో జరిగిన వరల్డ్ కప్‌లతో పోలిస్తే ఈసారి రూల్స్ మారాయి. టోర్నీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జట్ల సంఖ్యను పెంచారు. ఈసారి ఏకంగా 48 దేశాలు వరల్డ్ కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించి కప్పు కోసం పోటీ పడుతున్నాయి. జట్ల సంఖ్య పెరగడంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో సింహభాగం అంటే దాదాపు 78 మ్యాచ్‌లు అమెరికాలోనే జరగనుండగా.. మిగిలిన కీలక మ్యాచ్‌లను కెనడా, మెక్సికో దేశాల్లో నిర్వహిస్తున్నారు.
భారత్‌లో టీవీ టెలికాస్ట్ ఛానెళ్లు ఇవే..
భారతదేశంలో కూడా ఫుట్‌బాల్ ఆటకంటూ విపరీతమైన క్రేజ్ ఉంది. భారతీయ అభిమానుల కోసం ఫిఫా వరల్డ్ కప్ 2026 అధికారిక బ్రాడ్‌కాస్ట్ హక్కులను ప్రముఖ మీడియా సంస్థ జీ దక్కించుకుంది. టీవీలో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు Unite8 Sports టెలివిజన్ ఛానెళ్ల ద్వారా మ్యాచ్‌లను లైవ్‌లో ఎంజాయ్ చేయవచ్చు. దీనితో పాటు ప్రభుత్వ అధికారిక స్పోర్ట్స్ ఛానెల్ అయిన డీడీ స్పోర్ట్స్‌లో కూడా టోర్నీలోని కొన్ని ఎంపిక చేసిన కీలక మ్యాచ్‌లు, ముఖ్యంగా ఓపెనింగ్ మ్యాచ్, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేయనున్నారు.
మొబైల్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా స్మార్ట్ టీవీలలో డిజిటల్ పద్ధతిలో మ్యాచ్‌లను వీక్షించాలనుకునే వారి కోసం జీ5 యాప్, వెబ్‌సైట్ వేదికగా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. అయితే దీనికోసం యూజర్లు జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను కలిగి ఉండాలి. ఈ ప్లాన్ ద్వారా ఫిఫాతో పాటు ఇతర అంతర్జాతీయ ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్‌లను కూడా హై క్వాలిటీతో చూసే సదుపాయాన్ని కంపెనీ కల్పించింది.
Security Camera : ఇంట్లో పాత ఫోన్ ఊరికే పడి ఉందా? అయితే ఖర్చు లేకుండా సీసీటీవీ కెమెరాగా మార్చేయండి
ఉచితంగా చూసే అద్భుతమైన ఆప్షన్స్..
రూపాయి ఖర్చు లేకుండా మ్యాచ్‌లను ఫ్రీగా చూడాలనుకునే వారి కోసం కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫిఫా అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన FIFA+ యాప్, వెబ్‌సైట్‌లో ఎంపిక చేసిన కొన్ని ముఖ్యమైన మ్యాచ్‌లను ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అలాగే ఫిఫా సంస్థ యూట్యూబ్‌తో కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందం ప్రకారం.. కొన్ని ప్రధాన మ్యాచ్‌ల ప్రారంభ 10 నిమిషాల ఆటను అలాగే హైలైట్స్‌ను ఉచితంగా వీక్షించే ఛాన్స్ లభిస్తుంది.
నరాల తెగే నౌకౌట్ షెడ్యూల్.. ఫైనల్ ఎప్పుడంటే..?
ప్రస్తుతం గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతుండగా.. టోర్నమెంట్‌లోని అత్యంత కీలకమైన నాకౌట్ దశ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి గెలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్ దాటుకుని సెమీఫైనల్స్ కు చేరుకుంటాయి. ఉత్కంఠ రేపే సెమీఫైనల్ మ్యాచ్‌లు జూలై 15, జూలై 16 తేదీల్లో జరుగుతాయి. మూడో స్థానం కోసం జూలై 18న పోరు జరగనుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు కోరుకునే ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ జూలై 19న జరగనుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999