Buy Google Pixel 9A @ Rs 37,999 only: గూగుల్ పిక్సెల్ 9ఏ (8GB రేమ్ / 256GB స్టోరేజ్) టాప్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.39,999లకే లిస్ట్ చేయబడింది
Photo Credit: Google
Google Pixel 9a
Get Google Pixel 9A @ Rs 37,999 only: మీరు ఒక మంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్, ముఖ్యంగా బెస్ట్ కెమెరా ఉన్న మొబైల్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు భారీగా డబ్బు ఆదా అయ్యే సరికొత్త ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ వేదికగా గూగుల్ పిక్సెల్ 9ఏ స్మార్ట్‌ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం ఫ్లాట్ ప్రైస్ కట్ మాత్రమే కాకుండా, అదనంగా లభించే బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ ఫోన్‌ను కస్టమర్లు అత్యంత చౌక ధరకే దక్కించుకునే సువర్ణావకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది.
లాంచ్ ధర ఎంత? ఇప్పుడు ఎంతకు వస్తోంది..?
ధర మరియు ఆఫర్ల వివరాల్లోకి వెళ్తే.. గూగుల్ పిక్సెల్ 9ఏ (8GB రేమ్ / 256GB స్టోరేజ్) టాప్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.39,999లకే లిస్ట్ చేయబడింది. దీనికి తోడు అదనపు ఆఫర్ కింద మీ వద్ద ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, దాని ద్వారా జరిపే లావాదేవీలపై రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ కూడా వర్తింపజేస్తే ఈ ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ కేవలం రూ.37,999కి తగ్గిపోతుంది. గత మార్చి 2025లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.49,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఆ లెక్కన చూసుకుంటే ప్రస్తుతం కస్టమర్లకు నేరుగా రూ.12,000 భారీ లాభం చేకూరుతోంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత చౌకగా..
ఇక మీ పాత ఫోన్‌ను మార్చుకోవాలనుకునే వారి కోసం ఫ్లిప్‌కార్ట్ భారీగా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ప్రొవైడ్ చేస్తోంది. మీ పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఏకంగా రూ.35,600 వరకు అదనపు తగ్గింపును అందుకోవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది పూర్తిగా మీరు ఇచ్చే పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్, బ్రాండ్ వర్కింగ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పాత ఫోన్‌కు మంచి వాల్యూ వస్తే మాత్రం.. పిక్సెల్ 9ఏ ను అత్యంత నామమాత్రపు ధరకే జేబులో వేసుకోవచ్చు.
అద్భుతమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ టెన్సార్ జీ4 ప్రాసెసర్..
ఫీచర్ల విషయానికి వస్తే.. గూగుల్ పిక్సెల్ 9ఏ స్మార్ట్‌ఫోన్ అత్యుత్తమ స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఇందులో 1080x2424 పిక్సెల్స్ రెజల్యూషన్ సపోర్ట్ చేసే 6.3-ఇంచుల భారీ Actua pOLED డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా గూగుల్ తన సొంత పవర్‌ఫుల్ టెన్సార్ జీ4 ఏఐ ప్రాసెసర్‌ను ఇందులో అమర్చింది. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 154.7 మిమీ పొడవు, 73.3 మిమీ వెడల్పు, 8.9 మిమీ మందం, కేవలం 185.9 గ్రాముల లైట్ వెయిట్‌తో చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.
Gmail Tips : జీమెయిల్‌లో దాగున్న సీక్రెట్ ఆప్షన్.. బ్లూ కలర్ సెండ్ బటన్ పక్కనే ఉంది గమనించారా?
పిక్సెల్ మార్క్ అల్ట్రా-క్లియర్ కెమెరా, కనెక్టివిటీ
గూగుల్ పిక్సెల్ ఫోన్లంటేనే కెమెరాలకు కేరాఫ్ అడ్రస్. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.7 అపెర్చర్, ఫోటోలు షేక్ అవ్వకుండా ఉండేలా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో కూడిన 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇచ్చారు. దీనితో పాటు వైడ్ యాంగిల్ షాట్స్ కోసం f/2.2 అపెర్చర్‌తో 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, హై-క్వాలిటీ వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 అపెర్చర్ కలిగిన 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. కనెక్టెడ్ ఫీచర్ల పరంగా ఇందులో సూపర్‌ఫాస్ట్ 5G, 4G LTE, వై-ఫై 6E, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సీ (NFC), జీపీఎస్, ఇండియన్ నేవిగేషన్ సిస్టమ్ NavIC, లేటెస్ట్ యూఎస్‌బీ 3.2 టైప్-సి పోర్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999