G-Mail Schedule Option: జీమెయిల్‌లో ఈమెయిల్‌ను షెడ్యూల్ చేయడం చాలా సులభం. మొదట మీ కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌లో జీమెయిల్ ఓపెన్ చేయాలి.
Photo Credit: Gmail
Gmail
G-Mail schedule option: ఈరోజుల్లో ఆఫీస్ పనులు, వ్యాపార లావాదేవీలు, వ్యక్తిగత అవసరాల కోసం జీమెయిల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే చాలా మంది ఫ్రీగా ఉన్నప్పుడు ఈమెయిల్స్ రాసి వెంటనే పంపేస్తుంటారు. దీనివల్ల కొన్నిసార్లు అవతలి వ్యక్తి బిజీగా ఉండటం వల్ల లేదా ఆ సమయంలో ఆఫీస్ టైమ్స్ కాకపోవడం వల్ల ఆ మెయిల్స్ ఇన్బాక్స్‌లో ఎక్కడో వెనక్కి పడిపోతాయి. వారు వాటిని చదివే అవకాశం తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని నివారించడానికి జీమెయిల్‌లో ఒక అద్భుతమైన ఈమెయిల్ షెడ్యూల్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీని ద్వారా మీరు ఈమెయిల్ రాసి, అది ఏ సమయానికి వెళ్లాలో ముందే సెట్ చేసుకోవచ్చు.
ఈమెయిల్ ఎలా షెడ్యూల్ చేయాలి?
జీమెయిల్‌లో ఈమెయిల్‌ను షెడ్యూల్ చేయడం చాలా సులభం. మొదట మీ కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌లో జీమెయిల్ ఓపెన్ చేయాలి. స్క్రీన్ పైన ఎడమ వైపు మూలలో కనిపించే కంపోజ్ బటన్‌పై క్లిక్ చేసి, ఎప్పటిలాగే మీ ఈమెయిల్ కంటెంట్‌ను టైప్ చేయాలి. మెయిల్ అంతా రాసేసిన తర్వాత, కింద ఎడమ వైపున ఉండే బ్లూ కలర్ సెండ్ బటన్‌పై నేరుగా క్లిక్ చేయకుండా.. దాని పక్కనే ఉన్న చిన్న డౌన్ ఆరో (క్రిందికి ఉన్న బాణం గుర్తు) పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు షెడ్యూల్ సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీకు నచ్చిన తేదీ, సమయాన్ని ఎంచుకుంటే చాలు. మీరు ఆ సమయంలో ఏ టైమ్‌జోన్‌లో ఉంటారో దానికి అనుగుణంగా మెయిల్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది.
షెడ్యూల్ చేసిన ఈమెయిల్స్ ఎలా చూడాలి?
మీరు షెడ్యూల్ చేసిన ఈమెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, అవి కరెక్ట్ టైమ్‌కే వెళ్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీ జీమెయిల్ ఇన్బాక్స్ పక్కన ఉండే ఎడమ వైపు మెనూ ప్యానెల్‌లో షెడ్యూల్డ్ అనే ఒక ప్రత్యేక ఫోల్డర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు భవిష్యత్తులో వెళ్లడానికి సెట్ చేసిన అన్ని ఈమెయిల్స్ అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ ఆ మెయిల్‌లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే.. సదరు ఈమెయిల్ ఓపెన్ చేసి, పైభాగంలో కుడి వైపున ఉండే క్యాన్సిల్ సెండ్ పై క్లిక్ చేయాలి.
Amazon : జూన్ 18 వరకే ఛాన్స్.. అమెజాన్లో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై భారీ డిస్కౌంట్లు
రీషెడ్యూల్ చేయడం, లిమిట్స్
క్యాన్సిల్ చేసిన ఈమెయిల్‌లో మీకు కావలసిన కొత్త సమాచారాన్ని మార్చుకున్న తర్వాత, దానిని మళ్లీ రీషెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందుకోసం మళ్లీ సెండ్ బటన్ పక్కన ఉన్న డౌన్ ఆరో మార్క్‌పై క్లిక్ చేసి, షెడ్యూల్ సెండ్ ఆప్షన్ ద్వారా కొత్త తేదీ, సమయాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. జీమెయిల్ నిబంధనల ప్రకారం.. ఒక యూజర్ ఒకే సమయంలో గరిష్టంగా 100 ఈమెయిల్స్ వరకు ఇలా షెడ్యూల్ క్యూలో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, ఒకేసారి చాలా మందికి వేర్వేరు సమయాల్లో మెయిల్స్ పంపాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఫీచర్.
షెడ్యూల్ చేసిన మెయిల్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది?
చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది.. షెడ్యూల్ చేసిన ఈమెయిల్‌ను క్యాన్సిల్ చేస్తే ఆ మేటర్ అంతా డిలీట్ అయిపోతుందేమో అని భయపడుతుంటారు. కానీ జీమెయిల్ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. మీరు ఎప్పుడైనా షెడ్యూల్ ఫోల్డర్‌లోకి వెళ్లి క్యాన్సిల్ సెండ్ క్లిక్ చేసినప్పుడు.. ఆ ఈమెయిల్ మాయం అయిపోదు. అది ఆటోమేటిక్‌గా ఒక సాధారణ డ్రాఫ్ట్ మెయిల్‌లా మారిపోతుంది. దీనివల్ల మీరు కష్టపడి రాసిన టెక్స్ట్ లేదా అటాచ్ చేసిన ఫైల్స్ ఏవీ డిలీట్ కావు. మళ్లీ వాటిని ఎడిట్ చేసుకుని పంపుకోవడానికి వీలుంటుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Luna Smart Glasses Without a Camera Said to Be in the Works; Launch Timeline Tipped