Nothing Phone (4b) Sale in Inida: భారత్‌లో నథింగ్ ఫోన్ (4b) సేల్స్ షురూ.. మార్కెట్లోకి సరికొత్త గ్లిఫ్ లైటింగ్ స్మార్ట్‌ఫోన్!

Nothing Phone (4b) Sales Live in India: బేస్ వేరియంట్ అయిన 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ మోడల్ ధరను రూ.34,999గా నిర్ణయించారు.

Nothing Phone (4b) Sale in Inida: భారత్‌లో నథింగ్ ఫోన్ (4b) సేల్స్ షురూ.. మార్కెట్లోకి సరికొత్త గ్లిఫ్ లైటింగ్ స్మార్ట్‌ఫోన్!

Nothing Phone (4b)

ముఖ్యాంశాలు
  • భారత్‌లో నథింగ్ ఫోన్ (4b) సేల్స్ షురూ
  • ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే లాంచ్ ఆఫర్లు
  • క్రెడిట్ కార్డ్‌లపై భారీ ఇన్‌స్టంట్ డిస్కౌంట్
ప్రకటన

Nothing Phone (4b) Sales Live in India: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనదైన శైలి డిజైన్‌తో గుర్తింపు తెచ్చుకున్న లండన్ బ్రాండ్ నథింగ్, దేశంలో గత వారం లాంచ్ చేసిన తన సరికొత్త మొబైల్ నథింగ్ ఫోన్ (4b) అమ్మకాలను అధికారికంగా ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన పాపులర్ మోడల్ నథింగ్ ఫోన్ (4a)కి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ సరికొత్త ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో బ్యాటరీ సామర్థ్యాన్ని భారీగా పెంచడమే కాకుండా, నథింగ్ బ్రాండ్ సిగ్నేచర్ స్టైల్ అయిన గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చారు. ఈ ఫోన్ వెనుక భాగంలో ఏకంగా 45 మినీ ఎల్ఈడీ లైట్లను అమర్చడం విశేషం.

భారతీయ కస్టమర్ల కోసం నథింగ్ కంపెనీ ఈ ఫోన్‌ను రెండు అద్భుతమైన స్టోరేజ్ వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ మోడల్ ధరను రూ.34,999గా నిర్ణయించారు. అలాగే హై-ఎండ్ వేరియంట్ అయిన 8 GB ర్యామ్, 256 GB స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. కస్టమర్లు తమకు నచ్చిన విధంగా వైట్ (తెలుపు), బ్లూ (నీలం),  బ్లాక్ (నలుపు) రంగులలో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేదికగా విక్రయానికి అందుబాటులో ఉంది.

కొత్తగా ఫోన్ కొనాలనుకునే వారి కోసం కంపెనీ కొన్ని ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ప్రముఖ బ్యాంకులైన యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లగ్జరీ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే కస్టమర్లకు వెంటనే 7.5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు పాత ఫోన్‌ను మార్చుకోవాలనుకునే వారి కోసం బంపర్ ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది. అంతేకాకుండా, ఒకేసారి అంత డబ్బు పెట్టలేని వారి కోసం ఎలాంటి వడ్డీ లేని 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు.

సాంకేతిక ఫీచర్ల పరంగా చూస్తే డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ లో 6.77 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ శామ్‌సంగ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్, 1000 Hz ఇన్‌స్టంట్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌తో వస్తుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు అడ్రినో 810 జీపీయూని జత చేశారు. దీనివల్ల మల్టీటాస్కింగ్,హెవీ గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది.

BSNL : బీఎస్ఎన్ఎల్ దూకుడు.. తొలి త్రైమాసికంలో 10 శాతం పెరిగిన కంపెనీ ఆదాయం

నథింగ్ ఫోన్ లోని మరో ప్రధాన ఆకర్షణ దీనిలోని భారీ 6,000 mAh బ్యాటరీ. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేందుకు 7.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. కెమెరా విభాగం చూస్తే.. వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మరియు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. దీని ద్వారా 4K క్వాలిటీతో సెకనుకు 30 ఫ్రేమ్స్ వేగంతో అద్భుతమైన వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు.

ఎక్కువ సమయం ఫోన్ వాడినా లేదా గేమ్స్ ఆడినా మొబైల్ వేడెక్కకుండా ఉండేందుకు నథింగ్ కంపెనీ ఇందులో ఒక ప్రత్యేకమైన థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. 4,400 చదరపు మిల్లీమీటర్ల  హీట్ డిస్సిపేషన్ ఏరియాతో కూడిన వేపర్ ఛాంబర్ కూలింగ్ సొల్యూషన్ ను ఇందులో వాడారు. ఇది ఫోన్ ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ కంట్రోల్ లో ఉంచుతుంది. ఈ ఫోన్ బరువు సుమారు 210 గ్రాములు కాగా, దీని సైజ్ 164.4 x 78.2 x 8.6 mm గా ఉంది. పాత నథింగ్ ఫోన్ (4a)తో పోలిస్తే ఈ కొత్త మోడల్ లుక్, బ్యాటరీ, పర్ఫార్మెన్స్ పరంగా కస్టమర్లకు ఒక సరికొత్త, బెస్ట్ ఎంపికగా నిలవనుంది. 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »