Kerala Man Uses Google Gemini AI to find Saudi friend in Telangana: 1990వ దశకం చివరి రోజుల్లో కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్, తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ఎడ్ల లచ్చన్న ఇద్దరూ సౌదీ అరేబియాలో ఒకే కంపెనీలో కలిసి పని చేసేవారు.
Photo Credit: Pexels/Ingo Joseph
Kerala Man Uses Google Gemini AI to find Saudi friend in Telangana: సమాజంలో నమ్మకం, నిజాయితీ అనే పదాలకు అర్థం మారుతున్న ఈ రోజుల్లో.. ఒక వ్యక్తి తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం ఏకంగా పాతికేళ్ల నాటి అప్పును వెతుక్కుంటూ వచ్చి తీర్చి నిజమైన మానవత్వానికి, విలువలకు నిదర్శనంగా నిలిచాడు. దాదాపు 25 సంవత్సరాల క్రితం కష్టకాలంలో తన స్నేహితుడి వద్ద తీసుకున్న చేబదులును తిరిగి ఇచ్చేందుకు ఆ వ్యక్తి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చాడు. ఈ అరుదైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు సదరు వ్యక్తి నిజాయితీని కొనియాడుతున్నారు.
గల్ఫ్ దేశంలో చిగురించిన స్నేహం
ఈ కథకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 1990వ దశకం చివరి రోజుల్లో కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్, తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ఎడ్ల లచ్చన్న ఇద్దరూ సౌదీ అరేబియాలో ఒకే కంపెనీలో కలిసి పని చేసేవారు. పరాయి దేశంలో మన దేశస్థులు కావడంతో వారిద్దరి మధ్య పరిచయం కాస్తా గాఢమైన స్నేహంగా మారింది. ఆ సమయంలో ఇస్మాయిల్‌కు అత్యవసరంగా డబ్బు అవసరం పడటంతో లచ్చన్న చేబదులు ఇచ్చి ఆదుకున్నాడు. ఆ తర్వాత ఇస్మాయిల్ ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు, తన ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వగానే ఈ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని లచ్చన్నకు మాట ఇచ్చాడు. కానీ, కేరళకు వచ్చిన తర్వాత ఇస్మాయిల్ పరిస్థితులు మరింత దిగజారాయి. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన చాలా కాలం పాటు ఆ అప్పును తీర్చలేకపోయారు.
గూగుల్ మ్యాప్స్, జెమిని ఏఐతో పాత దోస్త్ వేట
కాలక్రమేణా ఇస్మాయిల్ వద్ద ఉన్న లచ్చన్న కాంటాక్ట్ నంబర్ పోయింది. వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోయింది. ఇస్మాయిల్‌కు తన స్నేహితుడి గురించి గుర్తున్నదల్లా ఒకే ఒక్క విషయం.. లచ్చన్న తెలంగాణలోని ధర్మపురి అనే ప్రాంతానికి చెందినవాడనే సమాచారం మాత్రమే. ఎలాగైనా తన స్నేహితుడి అప్పు తీర్చి మనశ్శాంతి పొందాలనుకున్న ఇస్మాయిల్ ఇంటర్నెట్ సాయం తీసుకున్నారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ జెమిని ఏఐ టూల్స్ ద్వారా తెలంగాణలోని ధర్మపురి లొకేషన్‌ను ట్రాక్ చేశారు. కేవలం ఆ ప్రాంతం పేరు ఆధారంగానే నేరుగా తెలంగాణకు చేరుకుని, అక్కడ స్థానిక ప్రజలను అడుగుతూ లచ్చన్న ఇంటి కోసం సుదీర్ఘంగా గాలించారు. ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం ఆయన లచ్చన్న ఇంటిని విజయవంతంగా కనుగొనగలిగారు.
Google : గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయిందా? ముఖ్యమైన ఫొటోలు డిలీట్ చేయకుండానే స్పేస్ ఖాళీ చేయండిలా
వాట్సాప్ వీడియో కాల్‌లో ఎమోషనల్ సీన్
కేరళ నుంచి ఎవరో తెలియని వ్యక్తి తమ ఇంటికి వెతుక్కుంటూ రావడంతో లచ్చన్న కుటుంబ సభ్యులు మొదట చాలా ఆశ్చర్యపోయారు. లచ్చన్న ప్రస్తుతం మళ్లీ గల్ఫ్ దేశంలోనే ఉద్యోగం చేస్తుండటంతో, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పారు. నిజానికి లచ్చన్న తాను పాతికేళ్ల క్రితం తన స్నేహితుడికి ఇచ్చిన అప్పు గురించి ఎప్పుడో మర్చిపోయారు. ఇస్మాయిల్ తన వద్దకు రావడం చూసి ఆయన షాక్ తిన్నారు. వారిద్దరూ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మాట్లాడుకుంటూ పాత రోజులను గుర్తుచేసుకుని ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఇస్మాయిల్ తన స్నేహితుడి కుటుంబ సభ్యులకు ఫోన్‌పే ద్వారా రూ.25,000 ఆన్‌లైన్ పేమెంట్ చేసి, ఇన్నేళ్లుగా తన మనసుపై భారంగా ఉన్న పాత రుణాన్ని తీర్చేసుకున్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999