Free up Google Cloud Storage without deleting Important Memories: జీమెయిల్‌కు వచ్చే ముఖ్యమైన ఈమెయిళ్లు, గూగుల్ డ్రైవ్‌లో దాచుకునే ఫైల్స్ వంటి ఇతర సేవలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది..
Photo Credit: AI Generated
Google Photos
Free up Google Cloud Storage without deleting Important Memories: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ ఫోటోలు, వీడియోలు సురక్షితంగా దాచుకోవడానికి గూగుల్ ఫొటోస్ యాప్‌ను ఎంతగానో ఉపయోగిస్తున్నారు. అయితే, గూగుల్ ప్రతి అకౌంట్‌కు ఉచితంగా ఇచ్చే 15జీబీ స్టోరేజ్ పరిమితి కొన్ని నెలల్లోనే నిండిపోవడం సర్వసాధారణం. ఈ స్టోరేజ్ గనుక ఒక్కసారి పూర్తిగా నిండిపోతే కొత్త ఫొటోల బ్యాకప్ ఆగిపోవడమే కాకుండా.. జీమెయిల్‌కు వచ్చే ముఖ్యమైన ఈమెయిళ్లు, గూగుల్ డ్రైవ్‌లో దాచుకునే ఫైల్స్ వంటి ఇతర సేవలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే దీనికోసం మీ స్వీట్ మెమరీస్ లాంటి ముఖ్యమైన ఫొటోలను డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన స్మార్ట్ చిట్కాలను పాటించడం ద్వారా మీ గూగుల్ అకౌంట్ స్టోరేజ్‌ను భారీగా ఆదా చేసుకోవచ్చు.
మీ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ వేగంగా నిండిపోవడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలాసార్లు 4K క్వాలిటీతో తీసిన పెద్ద వీడియో ఫైల్స్, వాట్సాప్ ఆటోమేటిక్ బ్యాకప్స్, స్క్రీన్ రికార్డింగ్‌లు లేదా ఒకేలాంటి ఫొటోలు మళ్లీ మళ్లీ సేవ్ అవ్వడం వల్ల ఎక్కువ మెమరీ వృధా అవుతుంది. గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఉండే మేనేజ్ స్టోరేజ్ సెక్షన్‌లోకి వెళ్లి చూస్తే.. ఏ రకమైన ఫైల్స్ మీ క్లౌడ్ స్పేస్‌ను ఎక్కువగా ఆక్రమిస్తున్నాయో క్లియర్‌గా కనిపిస్తుంది. వాటిని చూసి అనవసరమైన వాటిని డిలీట్ చేయడం ద్వారా వెంటనే కొంత స్పేస్ దొరుకుతుంది.
గూగుల్ ఫొటోస్ యాప్‌లో ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది. అది మన ఫోన్‌లోని స్క్రీన్‌షాట్లు, స్పష్టంగా లేని బ్లర్ ఫొటోలు, ఒకేలాంటి డూప్లికేట్ ఫొటోలను గుర్తించి వేర్వేరు కేటగిరీలుగా చూపిస్తుంది. ఈ సెక్షన్‌లోకి వెళ్లి, గతంలో ఎప్పుడో తీసుకున్న పనికిరాని స్క్రీన్‌షాట్లు, సరిగ్గా రాని బ్లర్ ఫొటోలను ఎంపిక చేసి డిలీట్ చేయడం ద్వారా మీ ఫోన్‌లోని అసలైన ఫొటోలకు ఎలాంటి నష్టం కలగకుండానే చాలా సులభంగా స్టోరేజ్ ఖాళీ అవుతుంది.
మీరు గూగుల్ ఫొటోస్ సెట్టింగ్స్‌లో బ్యాకప్ క్వాలిటీని ఒరిజినల్ క్వాలిటీగా సెట్ చేసి ఉంటే, స్టోరేజ్ చాలా వేగంగా నిండిపోతుంది. ఎందుకంటే కెమెరా తీసిన భారీ సైజ్ ఫొటోలు అలాగే అప్‌లోడ్ అవుతాయి. దీనికి బదులుగా గూగుల్ ఫొటోస్ సెట్టింగ్స్‌కు వెళ్లి స్టోరేజ్ సేవర్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇది ఫొటోలు మరియు వీడియోల సైజును కొద్దిగా తగ్గిస్తుంది. కానీ సాధారణ వినియోగంలో ఫొటో క్వాలిటీలో పెద్దగా తేడా ఏమీ కనిపించదు. ఈ చిన్న మార్పుతో మీ స్టోరేజ్ ఎక్కువ కాలం పాటు ఫుల్ అవ్వకుండా ఉంటుంది.
Samsung : శాంసంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ A56 5G ధర
మనం ఫోన్లలో రికార్డ్ చేసే హై-రిజల్యూషన్, నిడివి ఎక్కువ ఉన్న వీడియోలు జీబీలకు జీబీలు స్పేస్ లాగేస్తాయి. ఇటువంటి పెద్ద పెద్ద వీడియోలను ఎల్లప్పుడూ గూగుల్ ఫొటోస్ క్లౌడ్‌లోనే ఉంచాల్సిన అవసరం లేదు. వాటిని మీ పర్సనల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్‌లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గూగుల్ ఫొటోస్ నుండి వాటిని డిలీట్ చేస్తే పెద్ద ఎత్తున మెమరీ ఖాళీ అవుతుంది. అలాగే, ఫోన్‌లోని అన్ని ఫోల్డర్ల బ్యాకప్ ఆన్‌లో ఉండటం వల్ల కూడా స్పేస్ నిండుతుంది. అందుకే డౌన్‌లోడ్స్, వాట్సాప్ ఇమేజెస్ లేదా స్క్రీన్‌షాట్స్ వంటి అనవసరమైన ఫోల్డర్ల ఆటో-బ్యాకప్‌ను సెట్టింగ్స్‌లో ఆఫ్ చేయడం ఉత్తమం.
ఒకవేళ మీ వద్ద వేల సంఖ్యలో ఫొటోలు, వీడియోలు ఉండి.. వాటిని ఎక్కడికీ మార్చకుండా క్లౌడ్‌లోనే ఉంచాలనుకుంటే, గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవడం మరొక మంచి మార్గం. దీని ద్వారా నెలకు లేదా ఏడాదికి కొంత మొత్తం చెల్లించి 15జీబీ కంటే ఎక్కువ (100GB లేదా అంతకంటే ఎక్కువ) క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చు. ఈ అదనపు స్పేస్ మీ గూగుల్ ఫొటోస్, జీమెయిల్, గూగుల్ డ్రైవ్ మూడింటికీ కలిపి ఉపయోగపడుతుంది. అయితే ఫొటోస్ యాప్ నుంచి ఏదైనా డిలీట్ చేసే ముందు, ఆ ఫొటో మీ ఫోన్ మెమరీలో లేదా ఇతర బ్యాకప్‌లో ఉందో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999