బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన ప్రముఖ టెక్ అనలిస్ట్ మార్క్ గుర్మన్ ఈ ఈవెంట్‌కు సంబంధించిన అఫీషియల్ ఇన్విటేషన్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ లీక్స్ నిజమయ్యాయి.
Made by Google
Google : ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గూగుల్ మెగా ఈవెంట్ మేడ్ బై గూగుల్ లాంచ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఈ ఏడాది 2026 ఆగస్టు 12వ తేదీన ఈ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో గూగుల్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గూగుల్ పిక్సెల్ 11ను మార్కెట్లోకి పరిచయం చేయనుంది. బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన ప్రముఖ టెక్ అనలిస్ట్ మార్క్ గుర్మన్ ఈ ఈవెంట్‌కు సంబంధించిన అఫీషియల్ ఇన్విటేషన్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ లీక్స్ నిజమయ్యాయి. ఈ సిరీస్ కింద గూగుల్ ఒకేసారి నాలుగు ప్రీమియం మోడళ్లను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.
ఒకే వేదికపై నాలుగు పవర్‌ఫుల్ పిక్సెల్ ఫోన్లు
గూగుల్ లాంచ్ చేయబోతున్న ఈ సరికొత్త సిరీస్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్, ఫోల్డబుల్ మోడల్ అయిన పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్ల డిజైన్ దాదాపు పాత పిక్సెల్ 10 సిరీస్‌ను పోలి ఉన్నప్పటికీ, బాడీ బిల్డ్ క్వాలిటీలో గూగుల్ భారీ మార్పులు చేస్తోంది. ఐఫోన్ 17 ప్రో మోడల్స్ తరహాలోనే ఈసారి పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల చేసిస్‌ను ప్రీమియం టైటానియం మెటీరియల్‌తో తయారు చేసినట్లు తెలుస్తోంది. దీనితో పాటు టైటానియం మోచా అనే సరికొత్త రాయల్ కలర్ వేరియంట్‌ను కూడా గూగుల్ పరిచయం చేయబోతోంది.
గూగుల్ యూజర్లకు షాక్
పిక్సెల్ లవర్స్‌ను కాస్త నిరాశపరిచే ఒక క్రేజీ అప్‌డేట్ కూడా నెట్టింట హల్‌చల్ చేస్తోంది. గూగుల్ ఈసారి తన ఫోన్లలో బేస్ స్టోరేజ్ వేరియంట్ అయిన 128జీబీ మోడల్‌ను పూర్తిగా తొలగించనుంది. దీని స్థానంలో ఫోన్ల ప్రారంభ స్టోరేజ్ నేరుగా 256జీబీ నుంచి స్టార్ట్ కానుంది. దీనివల్ల పిక్సెల్ 11 సిరీస్ ప్రారంభ ధరలు గతంతో పోలిస్తే చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే, లుక్ పరంగా ఈ ఫోన్లు చాలా స్లిమ్‌గా ఉంటాయని, డిస్‌ప్లే బెజెల్స్ కూడా చాలా సన్నగా డిజైన్ చేశారని సమాచారం. వెనుక వైపు ఉండే కెమెరా బార్‌ను కూడా మరింత స్టైలిష్‌గా మార్చారు. ముఖ్యంగా పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్‌లో సరికొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్ కనిపించనుంది.
Instagram : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్.. మీ అనుమతి లేకుండానే మీ ఫోటోలతో AI ఇమేజ్ జనరేషన్
డిస్‌ప్లే ఫీచర్లు, సైజ్ వేరియేషన్స్
ఈ సిరీస్‌లో వచ్చే బేస్ మోడల్ గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్‌ఫోన్‌లో 6.3 ఇంచుల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో వచ్చే పవర్‌ఫుల్ OLED ప్యానెల్ కానుంది. పిక్సెల్ 11 ప్రో మోడల్‌లోనూ దాదాపు ఇవే స్క్రీన్ ఫీచర్లు ఉన్నప్పటికీ, కెమెరా సెటప్‌లో పెద్ద మార్పు ఉంటుంది. ఇందులో నార్మల్ కెమెరాలతో పాటు అదనంగా హై-జూమింగ్ సామర్థ్యం ఉన్న టెలిఫోటో లెన్స్‌ను జోడించనున్నారు. ఇకపోతే, పెద్ద స్క్రీన్ ఇష్టపడే వారి కోసం పిక్సెల్ 11 ప్రో ఎక్స్‌ఎల్ మోడల్‌ను 6.8 ఇంచుల భారీ OLED డిస్‌ప్లే, 120Hz రీఫ్రెష్ రేట్‌తో లాంచ్ చేయబోతున్నారు.
ఫోల్డబుల్ ఫోన్ స్క్రీన్ సైజ్, సరికొత్త టెన్సర్ జీ6 చిప్‌సెట్ పవర్!
సిరీస్‌లోనే అత్యంత ఖరీదైన మోడల్ అయిన పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ విషయానికి వస్తే.. ఇందులో వెలుపలి వైపు 6.4 ఇంచుల కవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్ కలిగిన OLED ప్యానెల్. ఇక ఫోన్‌ను ఓపెన్ చేసినప్పుడు లోపల 8.1 ఇంచుల భారీ ఎల్‌టీపీఓ అమోలెడ్ స్క్రీన్ దర్శనమిస్తుంది. దీనికి కూడా 120Hz హై-రీఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్లన్నింటిలో గూగుల్ తన నెక్స్ట్ జనరేషన్ పవర్‌ఫుల్ టెన్సర్ జీ6 చిప్‌సెట్‌ను వాడబోతోంది. ఇది సరికొత్త 2ఎన్ఎమ్ ప్రాసెసింగ్ టెక్నాలజీపై తయారైంది. దీనివల్ల ఫోన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా, బ్యాటరీ లైఫ్ కూడా మునుపటి కంటే చాలా ఎక్కువగా వస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రకటన
ప్రకటన
Dell Pro Precision 5, Pro Precision 7, Pro Precision 7 T1 Series Launched in India With Up to Intel Core Ultra Series 3 Chips