ఎవరైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ప్రొఫైల్స్‌ను విజువల్ రెఫరెన్స్‌గా వాడుకుని సరికొత్త AI ఇమేజ్స్‌ను తయారు చేయవచ్చు.
Photo Credit: Pexels/Brian Ramirez
Instagram : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా తన మొట్టమొదటి ఇన్-హౌస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ జనరేషన్ మోడల్ మ్యూజ్ ఇమేజ్‌ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా మెటా AI, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త క్రియేటివ్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ టూల్స్ తెచ్చిన ఆనందం కంటే, దీనితో పాటు కంపెనీ తీసుకొచ్చిన ఒక కొత్త ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల కొద్దీ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల ప్రైవసీ పై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ఈ ఫీచర్ వల్ల యూజర్ల పర్సనల్ ఫోటోలకు భద్రత కరువయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పర్మిషన్ లేదు.. నోటిఫికేషన్ రాదు
మెటా ప్రవేశపెట్టిన ఈ కొత్త సిస్టమ్ ప్రకారం.. ఎవరైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న ప్రొఫైల్స్‌ను విజువల్ రెఫరెన్స్‌గా వాడుకుని సరికొత్త AI ఇమేజ్స్‌ను తయారు చేయవచ్చు. అంటే, మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గనుక పబ్లిక్‌లో ఉంటే, వేరే ఏ యూజర్ అయినా సరే తమ AI ప్రాంప్ట్‌లో మీ అకౌంట్ యూజర్‌నేమ్‌ను టైప్ చేస్తే చాలు. మెటా AI సిస్టమ్ వెంటనే మీ ప్రొఫైల్‌లో ఉన్న ఫోటోలను ఆధారం చేసుకుని, దానికి సరిపోయేలా కొత్త ఇమేజ్‌ను క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్‌లో మీ ఫోటోలను వాడుకోవడానికి మీ అనుమతి అస్సలు అవసరం లేదు. అంతేకాదు, మీ ఫోటోను బేస్ చేసుకుని ఒక AI ఇమేజ్ తయారైందనే విషయం కూడా మీకు ఎలాంటి నోటిఫికేషన్ ద్వారా తెలియదు.
డిఫాల్ట్‌గా ఆన్‌లోనే ప్రైవసీని దెబ్బతీసే ఫీచర్
మెటా సంస్థ ఈ వివాదాస్పద ఫీచర్‌ను అన్ని పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌కు డిఫాల్ట్‌గా ఆన్‌లోనే ఉంచింది. సాధారణంగా ఇలాంటి ఫీచర్లు తెచ్చినప్పుడు యూజర్ల అనుమతి అడిగి ఆన్ చేయాలి. కానీ మెటా ఇందుకు రివర్స్‌గా ఆప్ట్-అవుట్ పద్ధతిని ఎంచుకుంది. అంటే, మీ ఫోటోలు AIకి వాడకూడదు అనుకుంటే, మీరే స్వయంగా అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆ ఫీచర్‌ను మాన్యువల్‌గా ఆఫ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఆ సెట్టింగ్‌ను మార్చకపోతే, మీ పబ్లిక్ కంటెంట్ మొత్తాన్ని మెటా తన AI మోడల్స్ ట్రైనింగ్ కోసం, ఇమేజ్ జనరేషన్ కోసం యథేచ్ఛగా వాడేసుకుంటుంది.
మీ ఫోటోలు సురక్షితంగా ఉండాలా?
మీ పబ్లిక్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు లేదా రీల్స్ మెటా AI టూల్స్‌కు చేరకుండా ఉండాలంటే, మీరు వెంటనే మీ అకౌంట్ సెట్టింగ్స్‌లో ఈ చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం
* స్టెప్ 1: మొదట మీ మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* స్టెప్ 2: మీ ప్రొఫైల్ పేజీలోకి వెళ్లి, పైన కుడి వైపున కనిపించే త్రీ లైన్స్ మెనూపై క్లిక్ చేసి సెట్టింగ్స్ అండ్ యాక్టివిటీలోకి వెళ్లండి.
* స్టెప్ 3: అక్కడ కిందకు స్క్రోల్ చేస్తే హౌ అదర్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ యూ అనే ఆప్షన్ కింద షేరింగ్ అండ్ రీడ్యూస్ సెక్షన్ కనిపిస్తుంది, దానిపై టాప్ చేయండి.
* స్టెప్ 4: అందులో మీ పోస్ట్‌లు, రీల్స్‌ను మెటా AI ఫీచర్స్ కోసం ఉపయోగించడానికి అనుమతించే పర్మిషన్స్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిని వెంటనే ఆఫ్ చేసుకోండి.
iPhone Air 2 : ఐఫోన్ చరిత్రలోనే అత్యంత సన్నని ఫోన్.. మార్కెట్లోకి రాబోతున్న సరికొత్త ఐఫోన్ ఎయిర్ 2
అయితే ఇక్కడ యూజర్లు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మీరు ఈ రోజు సెట్టింగ్స్ మార్చితే, అది కేవలం భవిష్యత్తులో జరిగే AI ఇమేజ్ జనరేషన్‌ను మాత్రమే ఆపుతుంది. మీరు ఈ సెట్టింగ్ ఆఫ్ చేయడానికి ముందే, మీ ప్రొఫైల్ రెఫరెన్స్‌తో ఎవరైనా AI ఫోటోలు క్రియేట్ చేసి ఉంటే, అవి మాత్రం డిలీట్ అవ్వవు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీ అకౌంట్ సెట్టింగ్స్ చెక్ చేసుకోండి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999