కోపైలట్ ప్లస్ సపోర్ట్‌తో పనిచేసే సరికొత్త విండోస్ 11 పీసీలను Acer గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Photo Credit: Acer
Aspire X 16 AI features a 16-inch 3K OLED WQXGA+ display
Acer : ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ తన పాపులర్ ఆస్పైర్ ఏఐ లైనప్‌ను భారీగా విస్తరించింది. కోపైలట్ ప్లస్ సపోర్ట్‌తో పనిచేసే సరికొత్త విండోస్ 11 పీసీలను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఏసర్ ఆస్పైర్ X 16 ఏఐ, ఏసర్ ఆస్పైర్ 18 ఏఐ ల్యాప్‌టాప్‌లతో పాటు.. ఆస్పైర్ C27 ఏఐ, ఆస్పైర్ C24 ఏఐ ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అత్యాధునిక ఇంటెల్, ఏఎమ్‌డీ ప్రాసెసర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తున్న ఈ సరికొత్త డివైజ్‌ల ధరలు, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు ఇప్పుడు విడివిడిగా చూద్దాం.
ఏసర్ ఆస్పైర్ X 16 ఏఐ ల్యాప్‌టాప్
ఈ సరికొత్త ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 16 ఇంచుల 3K OLED డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో లేటెస్ట్ ఇంటెల్ కోర్ అల్ట్రా X9 388H ప్రాసెసర్‌తో పాటు ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌ను జత చేశారు. ఇది కాకుండా ఇంటెల్ కోర్ అల్ట్రా X7, కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్ ఆప్షన్లలోనూ లభిస్తుంది. ఇందులో గరిష్టంగా 32జీబీ ర్యామ్, 2టీబీ వరకు ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్ ఉంటుంది.
![]()
ఈ ల్యాప్‌టాప్‌లో 1080p ఐఆర్ కెమెరా, డీటీఎస్ ఎక్స్ అల్ట్రా ఆడియో సిస్టమ్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం రెండు థండర్‌బోల్ట్ 4 పోర్టులు, హెచ్‌డీఎమ్‌ఐ 2.1, వై-ఫై 6E వంటి ఫీచర్లు ఇచ్చారు. ఇందులో అమర్చిన 84Wh పవర్‌ఫుల్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 24 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని బరువు కేవలం 1.6 కేజీలు మాత్రమే ఉంటుంది.
ఏసర్ ఆస్పైర్ 18 ఏఐ ల్యాప్‌టాప్
పెద్ద స్క్రీన్ ఇష్టపడే వారి కోసం ఏసర్ 18 ఇంచుల డబ్ల్యూయూఎక్స్‌జీఏ ఐపీఎస్ డిస్‌ప్లేతో ఈ మోడల్‌ను తెచ్చింది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ గరిష్టంగా ఇంటెల్ కోర్ అల్ట్రా 9 386H ప్రాసెసర్‌తో పాటు ఇంటెల్ గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటుంది. ఇతర చిప్‌సెట్ వేరియంట్లలో ఇంటెల్ కోర్ అల్ట్రా 7, కోర్ అల్ట్రా 5 ఆప్షన్లు కూడా ఉన్నాయి.
ఇందులో కూడా 32జీబీ ర్యామ్, 2టీబీ స్టోరేజ్ లభిస్తాయి. ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకత ఏంటంటే, దీని స్క్రీన్‌ను 180 డిగ్రీల వరకు వెనక్కి తిప్పుకోవచ్చు. అలాగే ఇది మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) మన్నికను కలిగి ఉంటుంది. ఇందులో 71Wh బ్యాటరీని ఇచ్చారు, ఇది 22 గంటల వరకు నాన్‌స్టాప్ వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. వై-ఫై 7, బ్లూటూత్ 5.4, థండర్‌బోల్ట్ 4 పోర్టులు దీని సొంతం. దీని బరువు 2.19 కేజీలు.
![]()
Acer Aspire C27 AI
Photo Credit: Acer
Samsung : శాంసంగ్ నుంచి నయా ఫోల్డబుల్ ఫోన్.. హోటల్‌లో లీకైన రియల్ లుక్
ఆస్పైర్ C27 ఏఐ, ఆస్పైర్ C24 ఏఐ డెస్క్‌టాప్‌లు
ఇక డెస్క్‌టాప్ విషయానికి వస్తే, ఏసర్ రెండు ఆల్-ఇన్-వన్ పీసీలను ప్రదర్శించింది. ఆస్పైర్ C27 ఏఐ మోడల్ 27 ఇంచుల ఫుల్-హెచ్‌డీ స్క్రీన్‌ను కలిగి ఉంటే, ఆస్పైర్ C24 ఏఐ మోడల్ 23.8 ఇంచుల ఫుల్-హెచ్‌డీ స్క్రీన్‌తో వస్తుంది. ఈ రెండింటిలోనూ ఆప్షనల్ టచ్‌స్క్రీన్ సపోర్ట్, 144Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ డెస్క్‌టాప్‌లు రెండు రకాల ప్రాసెసర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి.
మొదటి వేరియంట్ లేటెస్ట్ ఏఎమ్‌డీ రైజెన్ ఏఐ 400 సిరీస్ (Ryzen AI 9 465 వరకు) ప్రాసెసర్లు, రేడియాన్ 880M గ్రాఫిక్స్‌తో పనిచేస్తుంది. రెండవ వేరియంట్ ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 (Core Ultra 7 356H వరకు) ప్రాసెసర్లతో వస్తుంది. ఈ డెస్క్‌టాప్‌లలో గరిష్టంగా 64జీబీ డ్యూయల్ చానల్ ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఇచ్చారు. వీటిలో 5 మెగాపిక్సెల్ ఐఆర్ పాప్-అప్ వెబ్‌క్యామ్, స్టీరియో స్పీకర్లు, వై-ఫై 6E, అనేక కనెక్టివిటీ పోర్టులు ఉన్నాయి.
ధరలు, మార్కెట్ లభ్యత
ఈ సరికొత్త ఏఐ కంప్యూటర్ల ధరల వివరాలను ఏసర్ కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే వీటి లభ్యత వివరాలను వెల్లడించింది.
ఆస్పైర్ X 16 ఏఐ ల్యాప్‌టాప్: జూలైలో ఈఎమ్‌ఈఏ (EMEA) ప్రాంతంలో, ఆగస్టులో నార్త్ అమెరికాలో అందుబాటులోకి వస్తుంది.
ఆస్పైర్ 18 ఏఐ ల్యాప్‌టాప్: జూన్‌లో ఈఎమ్‌ఈఏ లో, ఆగస్టులో నార్త్ అమెరికాలో విక్రయాలు ప్రారంభమవుతాయి.
C27 ఏఐ & C24 ఏఐ డెస్క్‌టాప్‌లు: నార్త్ అమెరికాలో ఈ ఏడాది మూడో త్రైమాసికంలో, సెప్టెంబర్‌లో ఈఎమ్‌ఈఏ లో, చివరి త్రైమాసికంలో ఆస్ట్రేలియాలో ఇవి అమ్మకానికి వస్తాయి. భారతదేశంలో ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ప్రకటన
ప్రకటన