రాబోయే శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఫోన్ వెనుక వైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండబోతోంది
Samsung Galaxy Z Fold 8 series might succeed Galaxy Z Fold 7 lineup
Samsung : టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శాంసంగ్ నెక్స్ట్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల సందడి మొదలైంది. వచ్చే నెల (జూలై 2026)లో జరగబోయే శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. అయితే కంపెనీ ఈ ఫోన్లను అధికారికంగా ప్రకటించకముందే, ఇంటర్నెట్‌లో దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన రియల్ లైఫ్ ఫోటో లీకై టెక్ ప్రపంచంలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈసారి శాంసంగ్ తన ఫోల్డబుల్ లైనప్‌లో పేర్లను మారుస్తూ సరికొత్త వ్యూహంతో ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
ప్రముఖ టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన సమాచారం ప్రకారం.. ఒక కొరియన్ నెటిజన్ హోటల్‌లో భోజనం చేస్తున్న శాంసంగ్ ఉద్యోగిని గమనించాడు. ఆ ఉద్యోగి చేతిలో రాబోయే సరికొత్త శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 స్మార్ట్‌ఫోన్ స్పష్టంగా కనిపించింది. ఫోన్ డిజైన్ బయటకు తెలియకుండా ఉండటం కోసం దానిపై యాంటీ-లీక్ ప్రొటెక్టివ్ కేస్ (క్యామఫ్లేజ్ స్కిన్) వేసి ఉన్నప్పటికీ, ఆ ఫోన్ వెనుక భాగం, కెమెరా సెటప్ కెమెరాకు చిక్కాయి. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
లీకైన రియల్ లైఫ్ ఫోటో ప్రకారం, రాబోయే శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 ఫోన్ వెనుక వైపు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండబోతోంది. ఈ కెమెరాలను ఒక పిల్-షేప్ (క్యాప్సూల్ ఆకారం)లో ఉండే మోడ్యూల్‌లో అమర్చారు. ఈ కెమెరా సెటప్ కిందనే ఒక ఎల్‌ఈడీ ఫ్లాష్ లైట్ కూడా కనిపిస్తోంది. శాంసంగ్ కంపెనీ నుంచి రాబోతున్న మొట్టమొదటి వైడ్-ఫోల్డింగ్ (వెడల్పాటి స్క్రీన్) స్మార్ట్‌ఫోన్ ఇదేనని టెక్ వర్గాలు చెప్తున్నాయి.
WhatsApp : వాట్సాప్ యూజర్లకు షాక్.. ఇకపై డబ్బులు కట్టాల్సిందేనా?
గత ఏడాదిలా కాకుండా, ఈసారి ఫోల్డబుల్ లైనప్‌లో శాంసంగ్ సరికొత్త మార్పులు చేస్తోంది. ఈ సిరీస్‌లో గెలాక్సీ Z ఫోల్డ్ 8 మరియు గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా అనే రెండు వేరియంట్లు రానున్నాయి. మొదట వీటిని గెలాక్సీ Z ఫోల్డ్ 8 వైడ్, గెలాక్సీ Z ఫోల్డ్ 8 అని పిలుస్తారని ప్రచారం జరిగినా, మార్కెటింగ్ కోసం కంపెనీ వీటి పేర్లను మార్చేసింది. ఇప్పటికే తన ఫ్లాగ్‌షిప్ లాప్‌టాప్‌లు, గెలాక్సీ S సిరీస్ ఫోన్లకు వాడుతున్న లగ్జరీ అల్ట్రా బ్రాండింగ్‌ను ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్లకు కూడా శాంసంగ్ తీసుకురాబోతోంది.
లీకైన రెండర్ల ప్రకారం.. ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్లు కూడా ఒకే రకమైన బ్లూ కలర్ షేడ్‌లో కనిపించాయి. వైడ్-ఫోల్డింగ్ మోడల్ (గెలాక్సీ Z ఫోల్డ్ 8) పైన చెప్పుకున్నట్లు డ్యూయల్ కెమెరాతో వస్తుండగా, పొడవుగా ఉండే ప్రీమియం మోడల్ (గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా)లో మాత్రం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇస్తున్నారు. ఇది కూడా పిల్-షేప్ కెమెరా ఐలాండ్‌లోనే ఉంటుంది. ఇక సెల్ఫీల విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్ల కవర్ డిస్‌ప్లేపై మధ్యలో పంచ్-హోల్ స్టైల్ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Huawei Nova 16 Pro, Nova 16 Ultra Launched With Kirin 9010S SoC, 7,000mAh Battery: Price, Specifications