Acer : గేమర్లకు పూనకాలే.. మార్కెట్లోకి ఏసర్‌ ‘పవర్ హౌస్’ లాప్‌టాప్

అత్యంత పవర్‌ఫుల్ ఫీచర్లతో కూడిన ఏసర్ ప్రిడేటర్ హెలియోస్ 18 ఏఐ (2026) గేమింగ్ ల్యాప్‌టాప్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది.

Acer :  గేమర్లకు పూనకాలే.. మార్కెట్లోకి ఏసర్‌ ‘పవర్ హౌస్’ లాప్‌టాప్

Photo Credit: Acer

Acer Predator Helios 18 AI (2026) an RGB backlit keyboard

ముఖ్యాంశాలు
  • ఏసర్ ప్రిడేటర్ హెలియోస్ 18 ఏఐ గేమింగ్ ల్యాప్‌టాప్‌ గ్లోబల్ లాంచ్
  • కళ్లు చెదిరే 18 ఇంచుల 4K మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే
  • ఎన్విడియా ఆర్‌టీఎక్స్ 5090 గ్రాఫిక్స్.. ఇంటెల్ ప్రాసెసర్
ప్రకటన

 Acer :  ప్రముఖ టెక్ దిగ్గజం ఏసర్ గేమింగ్ లవర్స్ కోసం మార్కెట్లోకి ఒక సరికొత్త అల్టిమేట్ డివైజ్‌ను పరిచయం చేసింది. తన పాపులర్ ప్రిడేటర్ సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ ఫీచర్లతో కూడిన  ఏసర్ ప్రిడేటర్ హెలియోస్ 18 ఏఐ (2026) గేమింగ్ ల్యాప్‌టాప్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. పేరుకు తగ్గట్టే ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో పాటు, ఊహకందని రేంజ్‌లో స్పెసిఫికేషన్లను జోడించారు. హెవీ గేమింగ్ ఆడేవారికి, గ్రాఫిక్స్ డిజైనర్లకు ఇదొక డ్రీమ్ ల్యాప్‌టాప్ అని చెప్పవచ్చు. ఈ ఏడాది చివర్లో ఇది ప్రపంచవ్యాప్తంగా అమ్మకానికి రానుంది. మరి టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

కళ్లు చెదిరే 18 ఇంచుల 4K మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే  
ఈ ల్యాప్‌టాప్‌లో ఏకంగా 18 ఇంచుల 4K మినీ ఎల్‌ఈడీ  భారీ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 240Hz హై రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. దీనివల్ల గేమ్స్ ఆడేటప్పుడు విజువల్స్ అస్సలు లాగ్ అవ్వవు. 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు ఎన్విడియా అడ్వాన్స్‌డ్ ఆప్టిమస్, ఎన్విడియా జీ-సింక్, 100 శాతం DCI-P3 కలర్ గ్యామట్, హెచ్‌డీఆర్ మోడ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ కలర్ అక్యూరెసీ కోసం దీనికి కాల్‌మన్ వెరిఫికేషన్ కూడా ఉంది.

ఎన్విడియా ఆర్‌టీఎక్స్ 5090 గ్రాఫిక్స్.. ఇంటెల్ ప్రాసెసర్  
ఈ ల్యాప్‌టాప్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇందులో లేటెస్ట్ ఇంటెల్ కోర్ అల్ట్రా 9 290HX ప్లస్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి తోడు గ్రాఫిక్స్ కోసం కింగ్ లాంటి ఎన్విడియా జీఫోర్స్ ఆర్‌టీఎక్స్ 5090 (Nvidia GeForce RTX 5090) జీపీయూని జత చేశారు. ఇందులో 24జీబీ GDDR7  VRAM ఉంటుంది. అంటే ప్రపంచంలోనే అత్యంత భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్‌నైనా ఇది చాలా ఈజీగా రన్ చేసేస్తుంది.

 256జీబీ ర్యామ్.. 6టీబీ స్టోరేజ్ 
సాధారణంగా ల్యాప్‌టాప్‌లలో 8జీబీ లేదా 16జీబీ ర్యామ్ చూస్తుంటాం. కానీ ఏసర్ కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌లో ఏకంగా 256జీబీ DDR5 ర్యామ్‌ను అందించింది. అంతేకాదు, ఇందులో మూడు పిసిఐఇ జనరేషన్ 5 ఎన్‌వీఎమ్‌ఈ ఎస్‌ఎస్‌డీ స్లాట్లు ఉన్నాయి. వీటి సహాయంతో ల్యాప్‌టాప్ అంతర్గత స్టోరేజీని ఏకంగా 6టీబీ వరకు పెంచుకోవచ్చు. దీనివల్ల ఎంత డేటా అయినా నిమిషాల్లో స్టోర్ చేసుకోవచ్చు.

వేడెక్కని అడ్వాన్స్‌డ్ కూలింగ్ సిస్టమ్ 
హెవీ గేమింగ్ ఆడేటప్పుడు ల్యాప్‌టాప్ వేడెక్కకుండా ఉండటం కోసం ఏసర్ ఒక సూపర్ కూలింగ్ టెక్నాలజీని వాడింది. ఇందులో 6వ జనరేషన్‌కు చెందిన రెండు ప్రిడేటర్ ఏరోబ్లేడ్ 3D ఫ్యాన్స్‌ను అమర్చారు. వీటితో పాటు ఒక వెక్టార్ హీట్ పైప్, లిక్విడ్ మెటల్ థర్మల్ గ్రీస్‌ను ఉపయోగించడం వల్ల ఎంతసేపు గేమ్స్ ఆడినా ల్యాప్‌టాప్ ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది.

 

Acer : సరికొత్త ఫీచర్లతో విండోస్ 11 ఏసర్ ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు లాంచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే

పవర్‌ఫుల్ బ్యాటరీ.. విండోస్ 11 ఓఎస్  
ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో గరిష్టంగా అనుమతించదగిన 99Wh భారీ బ్యాటరీని ప్యాక్ చేశారు. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది విండోస్ 11 ప్రో  లేదా విండోస్ 11 హోమ్ ఆప్షన్లతో లభిస్తుంది. వీడియో కాల్స్ కోసం 1080p ఐఆర్  ఫుల్-హెచ్‌డీ వెబ్‌క్యామ్‌ను ఇచ్చారు. అలాగే ల్యాప్‌టాప్ చుట్టూ ఆర్‌జీబీ బ్యాక్‌లిట్ కీబోర్డ్ మెరుస్తూ గేమింగ్ లుక్‌ను ఇస్తుంది.

కనెక్టివిటీ పోర్టుల జాతర  
కనెక్టివిటీ కోసం ఇందులో ఇంటెల్ కిల్లర్ వై-ఫై 7, బ్లూటూత్ 5.4 ఉన్నాయి. పోర్టుల విషయానికి వస్తే.. రెండు థండర్‌బోల్ట్ 5 పోర్టులు, రెండు యూఎస్‌బీ 3.2 జనరేషన్ 1 టైప్-ఏ పోర్టులు, ఒక యూఎస్‌బీ 3.2 జనరేషన్ 2 టైప్-ఏ పోర్ట్, ఒక హెచ్‌డీఎమ్‌ఐ 2.1 పోర్ట్, ఎస్‌డీ కార్డ్ రీడర్, 3.5mm ఆడియో జాక్, ఆర్‌జే-45 ఇంటర్నెట్ పోర్ట్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ బరువు దాదాపు 3.5 కేజీలు ఉంటుంది.

ధర, ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? 
ఈ ల్యాప్‌టాప్ ధర ఎంత అనేది ఏసర్ కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే రాబోయే ఆగస్టు నెలలో నార్త్ అమెరికా, ఈఎమ్ఈఏ మార్కెట్లలో ఇది అమ్మకానికి రానుంది. ఆస్ట్రేలియాలో మాత్రం 2026 చివరి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుంది. ఈ సూపర్ గేమింగ్ ల్యాప్‌టాప్‌ను ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారనే దానిపై కంపెనీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »