ఈ గేమింగ్ టాబ్లెట్‌లో కంపెనీ అద్భుతమైన డిస్‌ప్లేను అమర్చింది. ఇందులో 9.06 ఇంచుల ఓఎల్ఈడీ ప్యానల్ ఉంటుంది.
Photo Credit: Red Magic Tablet 5Pro
Red Magic Tablet 5Pro
Red Magic Tablet 5Pro : చైనీస్ డివైజెస్ తయారీ సంస్థ జెడ్‌టీఈకి చెందిన సబ్ బ్రాండ్ రెడ్‌మ్యాజిక్ తన సరికొత్త గేమింగ్ టాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 5 ప్రో పేరుతో లాంచ్ కానున్న ఈ టాబ్లెట్ జూన్ 30న చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రీ-రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సరికొత్త టాబ్లెట్ గత ఏడాది మార్కెట్లోకి వచ్చిన పాపులర్ మోడల్ రెడ్‌మ్యాజిక్ గేమింగ్ టాబ్లెట్ 3 ప్రో స్థానాన్ని భర్తీ చేయనుంది. దీని డిజైన్ పాత వెర్షన్ల మాదిరిగానే చాలా స్టైలిష్‌గా ఉండబోతోందని, ఇది సిల్వర్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని కంపెనీ ప్రకటించింది.
ఈ గేమింగ్ టాబ్లెట్‌లో కంపెనీ అద్భుతమైన డిస్‌ప్లేను అమర్చింది. ఇందులో 9.06 ఇంచుల ఓఎల్ఈడీ ప్యానల్ ఉంటుంది. గేమింగ్ ఆడేటప్పుడు ఎలాంటి ల్యాగ్ లేదా ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా స్క్రీన్ స్మూత్‌గా సాగడం కోసం దీనికి ఏకంగా 185 Hz హై రిఫ్రెష్ రేట్‌ను అందించారు. అంతేకాకుండా, ఈ డిస్‌ప్లేలో అప్‌గ్రేడ్ చేసిన X10 ల్యుమినసెంట్ మెటీరియల్‌ను ఉపయోగించారు, ఇది స్క్రీన్ క్వాలిటీని మరింత పెంచుతుంది. ఎండలో లేదా వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా దీనికి 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌ను జోడించారు.
హెవీ గేమింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేయడానికి ఈ టాబ్లెట్‌లో క్వాల్‌కామ్ సంస్థకు చెందిన మోస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడేటప్పుడు డివైజ్ వేడెక్కుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి రెడ్‌మ్యాజిక్ కంపెనీ ఇందులో ప్రత్యేకంగా RGB Liquid Cooling టెక్నాలజీని అందించింది. ఇది టాబ్లెట్ ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ, గేమర్స్‌కు సుదీర్ఘ కాలం పాటు అంతరాయం లేని అత్యుత్తమ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
టాబ్లెట్‌తో పాటు, ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన రెడ్‌మ్యాజిక్ 11 ఎయిర్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144 Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.85 ఇంచుల 1.5K ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. కళ్లకు రక్షణగా ఇందులో స్టార్ షీల్డ్ ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ 2.0, డీసీ డిమ్మింగ్, ఎస్‌జీఎస్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఇచ్చారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రెడ్‌మ్యాజిక్ ఓఎస్ 11.0 పై రన్ అవుతుంది. ఇందులో గేమింగ్ కోసం ప్రత్యేకంగా రెడ్‌కోర్ ఆర్4 చిప్‌ను కూడా అమర్చారు.
ఈ 11 ఎయిర్ స్మార్ట్‌ఫోన్‌లో గేమర్స్ కోసం క్యూబ్ స్కై ఇంజిన్ 3.0, ఇన్-బిల్ట్ పీసీ ఎమ్యులేటర్, 520 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన షోల్డర్ ట్రిగ్గర్ బటన్స్ వంటి ఎన్నో గేమింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి ఐస్ మ్యాజిక్ కూలింగ్ సిస్టమ్ తో పాటు డ్యూయల్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, వేపర్ ఛాంబర్ ఇచ్చారు. కెమెరాల విషయానికి వస్తే, దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వీటన్నింటితో పాటు ఏకంగా 7,000 mAh భారీ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ దీని సొంతం.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Lenovo ThinkBook 14x Launched in India With Intel Core Ultra Series 2 Processors: Price, Specifications