ప్రారంభ మోడల్ అయిన Dell XPS 13 ప్రారంభ ధరను రూ.79,990 గా నిర్ణయించారు. ఇది స్కై , స్ట్రోమ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Photo Credit: Dell
Dell XPS 13
Dell Laptops : ప్రముఖ దిగ్గజ టెక్ సంస్థ డెల్ భారతీయ వినియోగదారుల కోసం కేక పుట్టించే ఫీచర్లతో మూడు కొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. Dell XPS 13, Dell 14S, Dell 16S మోడళ్లను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. లేటెస్ట్ ఇంటెల్ కోర్ సిరీస్ 3, ఇంటెల్ కోర్ ఆల్ట్రా సిరీస్ 3, ఎఎమ్‌డీ రైజెన్ ఎఐ 400 సిరీస్ ప్రాసెసర్లతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లు సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తాయి. కంటెంట్ క్రియేటర్లు, ఆఫీస్ ప్రాజెక్ట్స్ చేసేవారు, హై-ఎండ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని డెల్ వీటిని రూపొందించింది.
ధరలు, లభ్యత వివరాలు
ధరల విషయానికి వస్తే.. ప్రారంభ మోడల్ అయిన Dell XPS 13 ప్రారంభ ధరను రూ.79,990 గా నిర్ణయించారు. ఇది స్కై , స్ట్రోమ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అదేవిధంగా ప్రీమియం మోడల్ అయిన Dell 14S ప్రారంభ ధర రూ.1,19,990 కాగా, అల్ట్రా ఫ్లాగ్‌షిప్ మోడల్ Dell 16S ధర రూ.2,29,990 గా ఉంది. ఈ రెండూ సెలెస్టియల్ బ్లూ, ఫ్రాస్ట్ బ్లూ కలర్ వేరియంట్లలో లభ్యమవుతాయి. ఈ ల్యాప్‌టాప్‌లు అన్నీ డెల్ అధికారిక వెబ్‌సైట్ (Dellstore.com), డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ఇంటెల్ ప్రొసెసర్‌తో వచ్చే Dell 14S మోడళ్లు ప్రముఖ మల్టీ-బ్రాండ్ రిటైల్ అవుట్‌లెట్లలో కూడా లభిస్తాయి.
Dell XPS 13
Dell XPS 13 ల్యాప్‌టాప్ 13.4 అంగుళాల 2.5K LCD ఇన్ఫినిటీ ఎడ్జ్ టచ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 30Hz నుంచి 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 100% DCI-P3 కలర్ కవరేజ్‌ను కలిగి ఉంది. ఇందులో ఇంటెల్ కోర్ సిరీస్ 3 లేదా ఇంటెల్ కోర్ ఆల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్లు, 32GB వరకు LPDDR5X ర్యామ్, ఇంటెల్ గ్రాఫిక్స్ ఉంటాయి. సన్నని CNC అల్యూమినియం బాడీతో కేవలం 12.7 మిమీ మందం, 1 కేజీ బరువు మాత్రమే ఉంటుంది. వైఫై 7, బ్యాక్‌లిట్ చిక్లెట్ కీబోర్డ్, విండోస్ టచ్‌ప్యాడ్ కలిగి ఉన్న ఈ ల్యాప్‌టాప్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 17 గంటల వరకు వీడియో స్ట్రీమింగ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
Plastic Currency : త్వరలో ప్లాస్టిక్ నోట్లు.. రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Dell 14S:
Dell 14S మోడల్ 14 అంగుళాల ఫుల్ HD+ OLED నాన్-టచ్ డిస్‌ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో ఇంటెల్ కోర్ ఆల్ట్రా సిరీస్ 3 లేదా ఎఎమ్‌డీ రైజెన్ ఎఐ 400 ప్రాసెసర్లను అందించారు. ఏఐ (AI) టాస్క్‌లను వేగంగా చేయడానికి ఇందులో 50 TOPS సామర్థ్యం ఉన్న NPU (న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్) ఉంది. 70Wh బాటరీతో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌ను 65W టైప్-సి అడాప్టర్‌తో ఛార్జ్ చేయవచ్చు. దీని బరువు 1.46 కేజీలు కాగా మందం 15.3 మిమీ ఉంటుంది.
Dell 16S:
ఇక అత్యంత ప్రీమియం ల్యాప్‌టాప్ Dell 16S విషయానికొస్తే.. ఇది 16 అంగుళాల 2.8K OLED టచ్ డిస్‌ప్లేను కలిగి ఉండి 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇంటెల్ కోర్ ఆల్ట్రా X7 358H లేదా AMD రైజెన్ AI 400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది మునుపటి మోడళ్ల కంటే 55 శాతం మెరుగైన గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇందులో కూడా 50 TOPS సామర్థ్యం గల AI NPU అందించారు. రీసైకిల్ అల్యూమినియం, ప్లాస్టిక్‌తో తయారైన ఈ ల్యాప్‌టాప్ ఎనర్జీ స్టార్ 9.0, EPEAT 2.0 గోల్డ్ సర్టిఫికేషన్లను పొందింది. దీని బరువు 1.77 కేజీలు ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999