Plastic Currency : త్వరలో ప్లాస్టిక్ నోట్లు.. రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

రూ. 10, రూ. 20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి ఆర్బీఐకి అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేసింది.

Plastic Currency : త్వరలో ప్లాస్టిక్ నోట్లు.. రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Photo Credit: AI Generated

Plastic Currency

ముఖ్యాంశాలు
  • భారత కరెన్సీ చరిత్రలోనే అతిపెద్ద విప్లవం
  • వర్షంలో తడిసినా, వాషింగ్ మిషన్‌లో పడినా నోటుకి ఏమీ కాదు
  • ప్లాస్టిక్ నోట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ప్రకటన

Plastic Currency : భారతదేశంలో మనం ప్రతినిత్యం వాడే కాగితపు కరెన్సీ నోట్లలో త్వరలోనే పెద్ద మార్పు రాబోతోంది. పాత కాగితం నోట్ల స్థానంలో ప్లాస్టిక్ ఆధారిత పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టేందుకు భారత రిజర్వ్ బ్యాంక్  మళ్లీ ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో కీలక సమాచారాన్ని వెల్లడించింది. రూ. 10, రూ. 20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి ఆర్బీఐకి అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతానికి మార్కెట్‌లో ఉన్న కాగితపు నోట్లన్నింటినీ ఒకేసారి మార్చే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అసలు ఏమిటీ పాలిమర్ నోట్లు? తయారీ విధానం ఎలా ఉంటుంది?
పాలిమర్ నోట్లు సాధారణ కాగితంతో కాకుండా బయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలీప్రొపీలీన్(BOPP) అనే ప్రత్యేకమైన సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేయబడతాయి. వీటిని తయారు చేసే విధానం సాధారణ నోట్ల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ముందుగా పాలిమర్ షీట్‌ను తయారు చేసి, దానిపై డిజైన్, ప్రింటింగ్ పూర్తి చేస్తారు. ఆ తర్వాత పారదర్శక విండో, అధునాతన సెక్యూరిటీ ఫీచర్లను జోడిస్తారు. రంగులు, ప్రింట్ పాడవకుండా ప్రొటెక్టివ్ కోటింగ్ వేసి, చివరిగా బ్యాంకింగ్ ఎటిఎంలు, క్యాష్ కౌంటింగ్ మిషన్లలో సులభంగా వాడేలా కట్ చేసి క్వాలిటీ చెక్ చేస్తారు.

కాగితపు నోట్లకు, పాలిమర్ నోట్లకు తేడా ఏమిటి?
సాధారణ కాగితపు నోట్లు తరచూ వాడటం వల్ల, నీటిలో తడవడం వల్ల లేదా మడతలు పడటం వల్ల త్వరగా చిరిగిపోతాయి, పాడవుతాయి. కానీ పాలిమర్ నోట్ల అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఇవి నీటిని, తేమను తట్టుకుంటాయి. త్వరగా నలగవు, చిరిగిపోవు. వివిధ కేంద్ర బ్యాంకుల నివేదికల ప్రకారం.. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. దీనివల్ల ఆర్బీఐ ప్రతి ఏటా కొత్త నోట్లను ముద్రించే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

నకిలీ నోట్లకు చెక్ పెట్టే టెక్నాలజీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా తెలిపిన వివరాల ప్రకారం.. పాలిమర్ నోట్లలో అత్యాధునిక రక్షణ ఫీచర్లను పొందుపరచవచ్చు. వీటిలో ట్రాన్స్‌పారెంట్ విండోస్, మైక్రో ప్రింటింగ్, ఆప్టికల్లీ వేరియబుల్ సెక్యూరిటీ ఎలిమెంట్స్ ఉంటాయి. పారదర్శక విండో అనేది నోటుకు వేరేగా అంటించింది కాదు, అదే పాలిమర్ షీట్‌లో భాగంగా డిజైన్ చేస్తారు. ఈ కారణంగా నకిలీ పాలిమర్ నోట్లను సృష్టించడం సైబర్ నేరగాళ్లకు, కేటుగాళ్లకు చాలా కష్టతరంగా మారుతుంది.

Nokia 250 4G Smart : ఇదేం కీప్యాడ్ ఫోన్ బాబోయ్.. ఫ్రంట్ ఫ్లాష్, AI ఫీచర్లతో వస్తున్న Nokia అదరగొట్టిందిగా

 భారత్‌లో గత ప్రయత్నాలు
ప్రపంచంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా 1988లో పాలిమర్ బ్యాంక్‌నోట్‌ను విడుదల చేసి, ఆ తర్వాత తన కరెన్సీ మొత్తాన్ని ప్లాస్టిక్ నోట్లలోకి మార్చేసింది. ఆ తర్వాత కెనడా, న్యూజిలాండ్, యూకే, బ్రూనై, రొమేనియా, వియత్నాం వంటి దేశాలు కూడా ఈ సాంకేతికతను అమలు చేశాయి. భారత్‌లో కూడా ఇది కొత్త ఆలోచన ఏమీ కాదు.. 2012లోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో రూ. 10 పాలిమర్ నోట్లను ట్రయల్ చేయడానికి అనుమతించింది. ఇప్పుడు మరోసారి రూ.10, రూ.20 నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »