Flipkart Sasa Lele Sale 2026: ఫ్లిప్‌కార్ట్ సాసా లెలే సేల్ వచ్చేసింది.. ల్యాప్‌టాప్‌లపై కనీవినీ ఎరుగని ఆఫర్లు

మే 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ తన ప్రతిష్టాత్మకమైన సాసా లెలే 2026 సేల్‌ ప్రారంభించింది.

Flipkart Sasa Lele Sale 2026: ఫ్లిప్‌కార్ట్ సాసా లెలే సేల్ వచ్చేసింది.. ల్యాప్‌టాప్‌లపై కనీవినీ ఎరుగని ఆఫర్లు
ముఖ్యాంశాలు
  • మే 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ తన ప్రతిష్టాత్మకమైన సాసా లెలే 2026 సేల్‌ ప్రారంభ
  • శామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 i7 మోడల్ సేల్‌లో రూ.58,990కే సొంతం చేసుకోవచ్చు
  • ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 % అదనపు డిస్కౌంట్‌ను అందిస
ప్రకటన

Flipkart Sasa Lele Sale 2026: ఫ్లిప్‌కార్ట్ ప్రియులకు అదిరిపోయే వార్త. మే 9 నుంచి ఫ్లిప్‌కార్ట్ తన ప్రతిష్టాత్మకమైన సాసా లెలే 2026 సేల్‌ ప్రారంభించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లకే కాకుండా ల్యాప్‌టాప్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. శామ్సంగ్, ఆసుస్, మోటరోలా, డెల్, హెచ్‌పీ వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లు మునుపెన్నడూ లేని తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. దీనికి తోడు బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు కలుపుకుంటే ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్‌లకు ఒక రోజు ముందుగానే, అంటే మే 8 నుంచే ఈ డీల్స్ అందుబాటులోకి వచ్చాయి.

ఏ బ్రాండ్లపై ఎంత తగ్గుతుందంటే?

ముఖ్యంగా శామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 i7 మోడల్ అసలు ధర రూ.89,689 కాగా, సేల్‌లో దీనిని కేవలం రూ.58,990కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఆసుస్ వివోబుక్ 14 కూడా అదే ధరకు అందుబాటులో ఉండనుంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన డీల్ మోటోబుక్ 60 LED ల్యాప్‌టాప్‌పై ఉంది. రూ.93,690 విలువైన ఈ ప్రీమియం ల్యాప్‌టాప్ దాదాపు సగం ధరకే, అంటే రూ.47,490 కే లభించనుంది. డెల్ 15 (2024) రైజెన్ 5 మోడల్ రూ.49,490కి, హెచ్‌పీ ఓమ్నీబుక్ 7 ఏరో రూ.82,990కి సేల్‌లో ఉండబోతున్నాయి.

బ్యాంక్ ఆఫర్స్, అదనపు ప్రయోజనాలు

ఫ్లిప్‌కార్ట్ కేవలం నేరుగా ధర తగ్గించడమే కాకుండా, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి మరిన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. యూపీఐ ద్వారా పేమెంట్ చేసేవారికి, సూపర్ కాయిన్స్ ఉపయోగించేవారికి కూడా ధరలో రాయితీ లభిస్తుంది. పాత ల్యాప్‌టాప్‌లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా వేల రూపాయల డిస్కౌంట్ పొందే వెసులుబాటు కూడా ఉంది.

అమెజాన్‌తో పోటీ.. 

ఫ్లిప్‌కార్ట్‌కు పోటీగా అమెజాన్ కూడా మే 8 నుంచి గ్రేట్ సమ్మర్ సేల్‎ను ప్రారంభించింది. అందుకే ఏదైనా ల్యాప్‌టాప్ కొనేముందు రెండు ప్లాట్‌ఫామ్‌లలో ధరలను పోల్చి చూసుకోవడం మంచిది. ఫ్లిప్‌కార్ట్ తన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ మినట్స్ ద్వారా కూడా కొన్ని సెలెక్టెడ్ ల్యాప్‌టాప్‌లను వేగంగా డెలివరీ చేయనుంది. మీరు కాలేజీ స్టూడెంట్ అయినా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారైనా, కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు ఇదే సరైన సమయం.

Product Name List Price Effective Sale Price Buying Link
Samsung Galaxy Book 4 i7 Rs. 89,689 Rs. 58,990 Buy Now
AsusVivobook 14 Rs. 92,990 Rs. 58,990 Buy Now
Asus Expertbook P1 Rs. 71,990 Rs. 63,990 Buy Now
Motobook 60 OLED Rs. 93,690 Rs. 47,490 Buy Now
Motobook 60 Pro Rs. 68,990 Rs. 61,990 Buy Now
Dell 15 2024 (AMD Ryzen 5 Hexa Core 7530U) Rs. 56,925 Rs. 49,490 Buy Now
HP OmniBook 7 Aero (AMD Ryzen AI 5 Hexa Core AI 5 340) Rs. 96,137 Rs. 82,990 Buy Now

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung : భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ A27 5G సేల్స్ షురూ.. రూ.3,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్
  2. iQOO Z11 Lite : భారత మార్కెట్లోకి ఐకూ కొత్త సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో iQOO Z11 Lite ఎంట్రీ
  3. RAM Price Hike : కంప్యూటర్, ల్యాప్‌టాప్ ప్రియులకు షాక్.. రాబోయే రోజుల్లో భారీగా పెరగనున్న ర్యామ్ ధరలు
  4. Motorola : మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో లీకైన Motorola Edge 70 Max
  5. Motorola : భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో Moto G77 Power ఎంట్రీ
  6. QCY MeloBuds : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల బ్యాటరీ లైఫ్..మార్కెట్లోకి క్యూసీవై కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్
  7. Tesla : భారత్‌లో టెస్లా ఈవీ కార్ల జోరు.. సరికొత్త 6-సీటర్ మోడల్ వై ఎల్‎కు భారీ డిమాండ్
  8. Flipkart Goat Sale : రియల్‌మి లవర్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో రేటు తగ్గిన పవర్‌ఫుల్ 5జీ స్మార్ట్‌ఫోన్
  9. Samsung : శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ ఖరారు.. లండన్ వేదికగా సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ల లాంచ్
  10. iQOO Z11 : భారత్‎లోకి ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో iQOO Z11 ఎంట్రీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »