ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎడ్జ్ 70, ఎడ్జ్ 70 ప్రో, ఎడ్జ్ 70 ఫ్యూజన్, ఎడ్జ్ 70 ప్రో ప్లస్ మోడళ్లను లాంచ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు ఈ సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ ఫోన్‌గా మ్యాక్స్ మోడల్‌ను తీసుకువస్తోంది.
Photo Credit: Motorola
Motorola
Motorola : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా భారతీయ వినియోగదారుల కోసం మరో పవర్‌ఫుల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలాకు చెందిన ఒక అప్‌కమింగ్ ఫోన్ కోసం ప్రత్యేకంగా ఒక మైక్రోసైట్ లైవ్ అయ్యింది. అయితే, ఈ పేజీలో మొబైల్ మోడల్ పేరును కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఆ వెబ్‌సైట్ యూఆర్ఎల్ ద్వారా ఇది మరేదో కాదు, మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ అని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఎడ్జ్ 70, ఎడ్జ్ 70 ప్రో, ఎడ్జ్ 70 ఫ్యూజన్, ఎడ్జ్ 70 ప్రో ప్లస్ మోడళ్లను లాంచ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు ఈ సిరీస్‌లో అత్యంత పవర్‌ఫుల్ ఫోన్‌గా మ్యాక్స్ మోడల్‌ను తీసుకువస్తోంది.
ఏఐ టాస్క్‌ల కోసం ప్రత్యేక బటన్
లీకైన సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన మోస్ట్ అడ్వాన్స్డ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రొసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా ఫ్లాట్ రేర్ ప్యానెల్‌తో పాటు వెనుక వైపు చదరపు ఆకారం కలిగిన కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన పనుల కోసం ఎన్‌పీయూ పర్ఫార్మెన్స్‌ను మునుపటి కంటే 46 శాతం మెరుగుపరిచినట్లు మోటోరోలా క్లెయిమ్ చేస్తోంది. అంతేకాకుండా, ఈ ఫోన్ ఎడమ వైపున ప్రత్యేకంగా ఒక స్మార్ట్ బటన్‌ను ఇస్తున్నారు, దీని ద్వారా యూజర్లు సింగిల్ క్లిక్‌తో ఏఐ టాస్క్‌లను ఆపరేట్ చేయవచ్చు. కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి.
పెరిస్కోప్ లెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్
ఫొటోగ్రఫీ పరంగా మోటోరోలా ఎడ్జ్ 70 మ్యాక్స్ వెనుక భాగంలో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉండబోతోంది. ఇందులో హై-రెజల్యూషన్ ప్రైమరీ కెమెరాతో పాటు, దూరంగా ఉన్న వస్తువులను స్పష్టంగా క్యాప్చర్ చేసేందుకు ప్రీమియం పెరిస్కోప్ లెన్స్, వైడ్ షాట్స్ కోసం అల్ట్రా-వైడ్ కెమెరాను అందించనున్నారు. కస్టమర్ల లైఫ్‌స్టైల్‌కు తగ్గట్టుగా ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది. దీనితో పాటు, ప్రీమియం ఫోన్లలో ఉండేలా ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ సపోర్ట్‌ను కూడా ఇందులో ఇస్తున్నట్లు సమాచారం.
Motorola : భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో Moto G77 Power ఎంట్రీ
గత నెలలోనే లాంచ్ అయిన Motorola Edge 70 Pro+ అదిరిపోయే ఫీచర్లు
మోటోరోలా కంపెనీ సరిగ్గా గత నెలలోనే భారత మార్కెట్లోకి తన అల్ట్రా-ప్రీమియం మోడల్ మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఫీచర్లను గమనిస్తే.. ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగిన 6.8 ఇంచుల సూపర్ హెచ్‌డీ ప్లస్ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌ను వాడారు. కెమెరా పరంగా వెనుక వైపు 50MP సోనీ లిటియా 710 మెయిన్ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా, 50MP ఆల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. ముందు వైపు కూడా 50MP సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ లోపల భారీ 6,500 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo ColorOS 17 India Launch Set for October 13; Enco X4 Earbuds, Pad Mini Teased
Amazon Great Indian Festival 2026: Best Refrigerator Deals