మోటోరోలా కంపెనీ ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్ల సౌకర్యార్థం రెండు వేర్వేరు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చింది.
Photo Credit: Motorola
Motorola
Motorola : స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బ్రాండ్ మోటోరోలా, భారతీయ వినియోగదారుల కోసం మరో సరికొత్త మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. జీ-సిరీస్‌ను మరింత బలోపేతం చేస్తూ మోటో జీ77 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను నేడు (జూలై 8) అధికారికంగా భారత్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన డిజైన్, కెమెరా, ప్రొసెసర్, బ్యాటరీ వివరాలను కంపెనీ ఇప్పటికే తన అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్, క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభూతిని కోరుకునే కస్టమర్లను టార్గెట్ చేస్తూ మోటోరోలా ఈ ఫోన్‌ను రూపకల్పన చేసింది.
మోటోరోలా కంపెనీ ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్ల సౌకర్యార్థం రెండు వేర్వేరు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో బేస్ వేరియంట్ 4 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్‌తో రాగా, హై-ఎండ్ వేరియంట్ 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో లభించనుంది. ఇక లుక్, డిజైన్ పరంగా ఈ ఫోన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినియోగదారుల కోసం మోటోరోలా ఈ మొబైల్‌ను నాలుగు వినూత్నమైన కలర్ ఆప్షన్లలో డిజైన్ చేసింది. అవి పాంటోన్ నాటికల్ బ్లూ, పాంటోన్ ఇంపెనెట్రబుల్, పాంటోన్ లారెల్ గ్రీన్, పాంటోన్ ఫురియా రెడ్.
ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో 6.72 ఇంచుల సైజ్ గల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. ఇది గేమింగ్, స్క్రోలింగ్ సమయంలో సూపర్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు 120 Hz రిఫ్రెష్ రేట్, 120 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌ను ఇందులో ఇచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఫోన్ కింద పడినా స్క్రీన్ పగలకుండా ఉండేందుకు వీలుగా దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అత్యుత్తమ రక్షణను కల్పించారు.
పర్ఫార్మెన్స్ విషయంలో ఈ మోటో జీ77 పవర్ ఎక్కడా తగ్గదు. ఇందులో సరికొత్త ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ పటిష్టంగా ఉండేందుకు Arm Mali-G57 MP2 జీపీయూని జత చేశారు. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే, ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. వినియోగదారులకు మరింత భరోసా ఇచ్చేలా ఈ ఫోన్‌కు ఒక మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌తో పాటు, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని మోటోరోలా కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఫోన్ బాడీ ప్రీమియం ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో వస్తుంది.
QCY MeloBuds : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల బ్యాటరీ లైఫ్..మార్కెట్లోకి క్యూసీవై కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్
ఫొటోగ్రఫీ లవర్స్ కోసం మోటో జీ77 పవర్ వెనుక భాగంలో అద్భుతమైన డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ సోనీ లిటియా 600 మెయిన్ ప్రైమరీ కెమెరాను అమర్చారు, ఇది తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలను తీస్తుంది. దీనితో పాటు వైడ్ యాంగిల్ షాట్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, హై-క్వాలిటీ వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో ఏకంగా 32 మెగాపిక్సెల్ స్మార్ట్ ఫ్రంట్ కెమెరాను కేటాయించడం విశేషం.
ఈ స్మార్ట్‌ఫోన్‌కు పవర్ అనే పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఇందులో ఉన్న ఏకంగా 7,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ. దీనివల్ల సాధారణ వినియోగదారులకు ఈ ఫోన్ బ్యాటరీ దాదాపు రెండు నుంచి మూడు రోజుల పాటు నాన్‌స్టాప్‌గా వస్తుంది. ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే దీని ద్వారా వేరే చిన్న గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకునేందుకు 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా ఇచ్చారు. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. సినిమాటిక్ సౌండ్ కోసం డాల్బీ అట్మోస్ సపోర్ట్ గల స్టీరియో స్పీకర్లను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 4G, 5G, బ్లూటూత్, జీపీఎస్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఈ-కంపస్ వంటి అన్ని రకాల అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 215 గ్రాములు, 166.23 x 76.50 x 8.89 mm సైజ్ కొలతలతో వస్తుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo ColorOS 17 India Launch Set for October 13; Enco X4 Earbuds, Pad Mini Teased
Amazon Great Indian Festival 2026: Best Refrigerator Deals