iQOO Z11 : భారత్‎లోకి ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో iQOO Z11 ఎంట్రీ

భారతదేశంలో ఐకూ విభాగానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‎గా వ్యవహరిస్తున్న నిపున్ మౌర్య తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

iQOO Z11   : భారత్‎లోకి ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో iQOO Z11 ఎంట్రీ

Photo Credit: iQOO

iQOO Z11

ముఖ్యాంశాలు
  • జూలై 15న ఐకూ జెడ్11 (iQOO Z11) లాంచ్
  • ఇంటర్నేషనల్ మోడల్‌కు భిన్నంగా భారతీయ వేరియంట్!
  • ఆండ్రాయిడ్ 16 లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్
ప్రకటన

iQOO Z11   : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఐకూ కంపెనీ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఐకూ, త్వరలోనే భారతీయ మార్కెట్లో తన సరికొత్త మొబైల్ iQOO Z11ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే భారతదేశంలో లాంచ్ కాబోయే మోడల్.. ఇంటర్నేషనల్ వేరియంట్ కంటే కొన్ని కీలక మార్పులతో, ప్రత్యేకమైన ఫీచర్లతో రాబోతోందని సమాచారం. ఇటీవల ఈ ఫోన్ ఒక ప్రముఖ బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా కనిపించడంతో టెక్ వర్గాల్లో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది.

జూలై 15న ఐకూ జెడ్11 లాంచ్?  
భారతదేశంలో ఐకూ విభాగానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‎గా వ్యవహరిస్తున్న నిపున్ మౌర్య తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. కంపెనీకి చెందిన పాపులర్ జెడ్ సిరీస్‎లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రాబోతోందంటూ ఒక టీజర్‌ను షేర్ చేశారు. అయితే ఆయన నేరుగా మొబైల్ మోడల్ పేరును ప్రకటించనప్పటికీ, అది కచ్చితంగా iQOO Z11 మోడలేనని టెక్ నిపుణులు బలంగా చెప్తున్నారు. తాజాగా అందుతున్న లీకుల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 15, 2026 నాటికల్లా ఇండియాలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

 చైనా, మలేషియా వేరియంట్లకు భిన్నంగా భారతీయ మోడల్ 
ఈ iQOO Z11 స్మార్ట్‌ఫోన్‌ను చైనా, మలేషియా దేశాలలో వేర్వేరు హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్లతో కంపెనీ ఇప్పటికే ప్రవేశపెట్టింది. చైనాలో విడుదల చేసిన వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రొసెసర్‌ను వాడగా, మలేషియా మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. అయితే ఈ రెండు అంతర్జాతీయ మోడల్స్ లోనూ 6.83 ఇంచుల భారీ  AMOLED డిస్‌ప్లేతో పాటు ఏకంగా 9,020 mAh సామర్థ్యం గల పవర్‌ఫుల్ బ్యాటరీని అందించారు. కాగా, ఇండియాకు వచ్చే మోడల్‌లో ప్రొసెసర్‌ను కాస్త మార్చబోతున్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Apps Ban : యాప్ నొక్కితే కారు, రిక్షా ఆగిపోతున్నాయ్.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్లకు కేంద్ర ఐటీ శాఖ నోటీసులు

గీక్‌బెంచ్ ఏఐలో ఐకూ కొత్త ఫోన్ హల్చల్ 
ఇటీవల ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్ Geekbench AIలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రోటోటైప్  లిస్టింగ్ అయింది. ఈ లిస్టింగ్ ద్వారా లీకైన వివరాల ప్రకారం, ఇండియాలో లాంచ్ కాబోయే iQOO Z11 ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండేలా ఈ ప్రొసెసర్‌ను డిజైన్ చేశారు. దీనితో పాటు ఈ సరికొత్త ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుందని సమాచారం. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం, చైనాలో ఇటీవల విడుదలైన వీవో ఎస్60ఇ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో పేరు మార్చి iQOO Z11గా రీబ్రాండ్ చేసి లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.

మార్చిలో వచ్చిన iQOO Z11x 5G సూపర్ హిట్ 
ఐకూ కంపెనీ ఇదే ఏడాది మార్చి నెలలో iQOO Z11x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. డ్యుయల్ సిమ్ సపోర్ట్‌తో వచ్చిన ఈ ఫోన్ అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఫోన్‌లో 6.76 ఇంచుల ఎల్‌సీడీ స్క్రీన్‌తో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ప్రొసెసర్‌గా మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బోను ఇచ్చారు. కెమెరాల విషయానికొస్తే.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా మరియు ముందు భాగంలో సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. అలాగే 7,200 mAh బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు రాబోయే కొత్త iQOO Z11 మోడల్ అంతకంటే అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో వస్తుండటంతో కస్టమర్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Redmi Note 17 Launching on August 6th 2026: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సరికొత్త సంచలనం.. భారత్‌లో ఆగస్టు 6న రెడ్‌మి నోట్ 17 లాంచ్!
  2. Full Page Screenshot in iPhones: ఐఫోన్ యూజర్లకు అదిరిపోయే ట్రిక్.. ఒకే ఫైల్‌లో మొత్తం వెబ్‌పేజీని భద్రపరుచుకునే స్మార్ట్ ఫీచర్
  3. OnePlus Exit Rumors form India: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వన్‌ప్లస్ సంచలనం.. భారత్‌లో వ్యాపారం బంద్ కానుందా?
  4. Social Media Curfew in United Kingdom: టీనేజర్ల రక్షణ కోసం బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాపై రాత్రి వేళల్లో కర్ఫ్యూ
  5. Belkin 10K Power Bank: ఒకేసారి రెండు డివైజ్‌లు చార్జ్ చేసుకునే సదుపాయం.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే పవర్‌బ్యాంక్!
  6. Google Pixel 11 Launching on August 12: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆగస్టు 12న గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్
  7. iQOO Z11 Lite launching: కాలేజ్ స్టూడెంట్స్ కోసం ఐకూ బంపర్ ఆఫర్.. జూలై 24న మార్కెట్లోకి సరికొత్త iQOO Z11 Lite
  8. ISRO Scientist Mass Resignations: ఇస్రో శాస్త్రవేత్తల వరుస రాజీనామాలు.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం, కొత్త రూల్స్ జారీ!
  9. Xiaomi Smart Camera C401 launched: చిన్న మూలపైనా డేగ కన్ను వేస్తుంది.. మోడరన్ సెక్యూరిటీ కెమెరాను తెచ్చిన షియోమీ!
  10. Apple Back to School Sale 2026: విద్యార్థులు, ఉపాధ్యాయులకు యాపిల్ బంపర్ ఆఫర్.. దేశంలో బ్యాక్ టు స్కూల్ సేల్ షురూ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »