మార్కెట్లో ఎంతో పాపులర్ అయిన రియల్‌మి పి3 ఆల్ట్రా 5జీ (8GB ర్యామ్ + 128GB స్టోరేజ్) బేస్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.26,499 ధరతో లిస్ట్ చేయబడింది.
Photo Credit: Realme
Realme P3 Ultra 5G
Flipkart Goat Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తోన్న ప్రతిష్టాత్మక గోట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం అదిరిపోయే డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మిడ్-రేంజ్ బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలనుకునే వారికి రియల్‌మి సంస్థ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఆల్ట్రా చిప్‌సెట్‌తో మార్కెట్లో దుమ్మురేపుతోన్న రియల్‌మి పి3 ఆల్ట్రా 5జీ ఫోన్‌పై ఈ సేల్‌లో భారీగా ధర తగ్గింది. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా తోడవడంతో ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకే దక్కించుకునే వీలుంది.
మార్కెట్లో ఎంతో పాపులర్ అయిన రియల్‌మి పి3 ఆల్ట్రా 5జీ (8GB ర్యామ్ + 128GB స్టోరేజ్) బేస్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.26,499 ధరతో లిస్ట్ చేయబడింది. అయితే ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పేమెంట్ చేసే కస్టమర్లకు నేరుగా రూ. 1,800 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ పోను ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ.24,699కే చేరుకుంటుంది. నిజానికి ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది మార్చి 2025 లో రూ.26,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఆ లెక్కన చూసుకుంటే ప్రస్తుత సేల్‌లో ఈ ఫోన్ నేరుగా రూ.2,300 తక్కువకే లభిస్తోంది.
మీరు మీ పాత లేదా ప్రస్తుతం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ సరికొత్త రియల్‌మి ఫోన్‌పై మరింత భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ కొనుగోలుపై గరిష్టంగా రూ. 19,600 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ యొక్క పూర్తి ప్రయోజనం అనేది మీరు ఇచ్చే పాత మొబైల్ యొక్క మోడల్, బ్రాండ్ మరియు అది ఎంతవరకు వర్కింగ్ కండిషన్‌లో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీ పాత ఫోన్‌కు మంచి వాల్యూ వస్తే కనుక.. రియల్‌మి పి3 ఆల్ట్రాను చాలా తక్కువ బడ్జెట్‌లోనే మీ సొంతం చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే.. ఇందులో 6.83 ఇంచుల సైజ్ గల ప్రీమియం కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. ఇది గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు సూపర్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు 120Hz రిఫ్రెష్ రేట్, 2800x1272 పిక్సెల్స్ హై-రెజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లోపల అత్యంత శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఆల్ట్రా ప్రొసెసర్‌ను అమర్చారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మి యూఐ 6.0 లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
Samsung : శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ ఖరారు.. లండన్ వేదికగా సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ల లాంచ్
సేఫ్టీ, డ్యూరబిలిటీ విషయంలో రియల్‌మి ఈ ఫోన్‌లో ఒక అద్భుతమైన ప్రయోగం చేసింది. కారు లేదా బైక్ పై వెళ్లేటప్పుడు అకస్మాత్తుగా వర్షం పడినా, ఫోన్ దుమ్ములో పడినా పాడవకుండా ఉండేందుకు ఈ ఫోన్‌కు ఏకంగా IP66 + IP68 + IP69 అనే ట్రిపుల్ రేటింగ్స్ రక్షణను ఇచ్చారు. మొబైల్ హిస్టరీలోనే ఇలాంటి కాంబినేషన్ రేటింగ్స్ ఇవ్వడం చాలా అరుదు. దీనితో పాటు భద్రత కోసం స్క్రీన్ కిందనే అమర్చిన ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం రియల్‌మి పి3 ఆల్ట్రా 5జీ వెనుక వైపు డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ మెయిన్ ప్రైమరీ కెమెరాతో పాటు, వైడ్ యాంగిల్ షాట్స్ కోసం f/2.2 అపెర్చర్ ఉన్న 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరాను అమర్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ స్మార్ట్ కెమెరాను కేటాయించారు. బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 6000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ఉంది, ఇది 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 163.10 మీమీ పొడవు, 76.90 మీమీ వెడల్పు, కేవలం 7.38 మీమీ మందం, 183 గ్రాముల తేలికపాటి బరువుతో చాలా స్లిమ్‌గా ఉంటుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Z Flip 8 Roundup: Launch Date, Expected Price, Specifications