Google : టెక్ ప్రపంచంలో గూగుల్ కొత్త సంచలనం.. ల్యాప్‌టాప్ మార్కెట్లోకి Googlebook

గూగుల్ బుక్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

Google : టెక్ ప్రపంచంలో గూగుల్ కొత్త సంచలనం.. ల్యాప్‌టాప్ మార్కెట్లోకి Googlebook

Photo Credit: Google

Googlebooks will have a Gemini backed Create your Widget feature

ముఖ్యాంశాలు
  • సరికొత్త కేటగిరీ ల్యాప్‌టాప్‌లను గూగుల్ బుక్ పేరుతో అధికారికంగా అనౌన్స్
  • గూగుల్ బుక్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడి
  • ఈ ల్యాప్‌టాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లతో చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది
ప్రకటన

Google : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ల్యాప్‌టాప్ ప్రపంచంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. తన వార్షిక ఆండ్రాయిడ్ షో ఐ/ఓ ఎడిషన్ వేదికగా సరికొత్త కేటగిరీ ల్యాప్‌టాప్‌లను గూగుల్ బుక్ పేరుతో అధికారికంగా అనౌన్స్ చేసింది. దాదాపు 15 ఏళ్ల క్రితం క్రోమ్‌బుక్స్‌ను పరిచయం చేసిన గూగుల్.. ఇప్పుడు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెమిని ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ నెక్స్ట్ జనరేషన్ ల్యాప్‌టాప్‌లను డిజైన్ చేసింది. కేవలం ఓఎస్ మాత్రమే కాకుండా, యూజర్ల అవసరాలను ముందే ఊహించి పనిచేసే ఒక అల్టిమేట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ లాగా ఇవి పనిచేస్తాయని గూగుల్ స్పష్టం చేసింది.

గూగుల్ బుక్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ ల్యాప్‌టాప్‌లు ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది. మొదటి తరం గూగుల్ బుక్ ల్యాప్‌టాప్‌లను తయారు చేయడానికి గూగుల్ సంస్థ ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లయిన ఏసర్, ఆసస్, డెల్, హెచ్‌పీ, లెనోవో కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ల్యాప్‌టాప్‌ల బాడీ వెనుక భాగంలో గూగుల్ లోగో రంగులతో వెలిగిపోయే ఒక స్టైలిష్  గ్లోబార్ డిజైన్‌ను కూడా ఇవ్వబోతున్నారు.

గూగుల్ డీప్‌మైండ్ బృందం సాయంతో రూపొందించిన మ్యాజిక్ పాయింటర్ ఈ ల్యాప్‌టాప్‌లో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్. యూజర్లు తమ మౌస్ కర్సర్‌ను స్క్రీన్‌పై కాస్త అటుఇటు కదిలిస్తే చాలు.. జెమిని ఏఐ యాక్టివేట్ అయ్యి స్క్రీన్‌పై ఉన్న కంటెంట్‌కు తగిన సలహాలను ఇస్తుంది. ఉదాహరణకు.. ఒక ఈమెయిల్‌లో ఉన్న డేట్‌పై కర్సర్ ఉంచితే చాలు, అది వెంటనే మీ క్యాలెండర్‌లో మీటింగ్‌ను సెట్ చేస్తుంది. అలాగే రెండు ఇమేజ్‌లను సెలెక్ట్ చేస్తే.. ఆ రెండింటినీ కలిపి ఒకే ఫ్రేమ్‌లో విజువలైజ్ చేసి చూపిస్తుంది.

googlebook features Googlebooks

Googlebook
Photo Credit: Google

కొత్త గూగుల్ బుక్స్‌లో జెమిని ఆధారిత క్రియేట్ యువర్ విడ్జెట్ ఫీచర్‌ను ఇచ్చారు. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన విడ్జెట్‌ను కేవలం ఒక చిన్న టెక్స్ట్ ప్రోంప్ట్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. జెమిని ఏఐ స్వయంగా ఇంటర్నెట్‌తో పాటు మీ జీమెయిల్, క్యాలెండర్‌లను సెర్చ్ చేసి మీకోసం ఒక పర్సనలైజ్డ్ డ్యాష్‌బోర్డ్‌ను తయారు చేస్తుంది. ఉదాహరణకు.. మీరు ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, మీ హోటల్ బుకింగ్ వివరాలు, ఫ్లైట్ టైమింగ్స్, ట్రిప్ కౌంట్‌డౌన్‌లను ఒకే విడ్జెట్ రూపంలో మీ డెస్క్‌టాప్‌పై అమరుస్తుంది.

ఈ ల్యాప్‌టాప్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లతో చాలా వేగంగా కనెక్ట్ అవుతుంది. కాస్ట్ మై యాప్స్ ఫీచర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని యాప్స్‌ను ల్యాప్‌టాప్ కోసం ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేయకుండానే నేరుగా ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై రన్ చేయవచ్చు. అంటే.. మీరు ఫోన్ జేబులో నుండి బయటకు తీయకుండానే, ల్యాప్‌టాప్ స్క్రీన్ నుండే ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. దీనితో పాటు క్విక్ యాక్సెస్ ఫీచర్ ద్వారా మీ ఫోన్లోని ఫోటోలు, ఫైల్స్‌ను ఎలాంటి కేబుల్స్ లేదా మ్యాన్యువల్ ట్రాన్స్‌ఫర్ లేకుండానే నేరుగా ల్యాప్‌టాప్ ఫైల్ బ్రౌజర్ నుండి యాక్సెస్ చేయవచ్చు, సెర్చ్ చేయవచ్చు.

ఈ ల్యాప్‌టాప్‌లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్, గూగుల్ ప్లే స్టోర్ సదుపాయం ఉంటుంది. ఇవి గూగుల్ అంతర్గతంగా డెవలప్ చేస్తున్న సరికొత్త మోడరన్ ఆపరేటింగ్ సిస్టమ్ అల్యూమినియం ఓఎస్ పై పనిచేసే అవకాశం ఉంది. ఇది ఎమ్యులేటర్ల సాయం లేకుండానే నేటివ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్లను డెస్క్‌టాప్ స్క్రీన్‌పై చాలా స్మూత్‌గా రన్ చేయడానికి సాయపడుతుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Samsung : భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ A27 5G సేల్స్ షురూ.. రూ.3,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్
  2. iQOO Z11 Lite : భారత మార్కెట్లోకి ఐకూ కొత్త సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో iQOO Z11 Lite ఎంట్రీ
  3. RAM Price Hike : కంప్యూటర్, ల్యాప్‌టాప్ ప్రియులకు షాక్.. రాబోయే రోజుల్లో భారీగా పెరగనున్న ర్యామ్ ధరలు
  4. Motorola : మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో లీకైన Motorola Edge 70 Max
  5. Motorola : భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో Moto G77 Power ఎంట్రీ
  6. QCY MeloBuds : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 గంటల బ్యాటరీ లైఫ్..మార్కెట్లోకి క్యూసీవై కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్
  7. Tesla : భారత్‌లో టెస్లా ఈవీ కార్ల జోరు.. సరికొత్త 6-సీటర్ మోడల్ వై ఎల్‎కు భారీ డిమాండ్
  8. Flipkart Goat Sale : రియల్‌మి లవర్స్‌కు పండగే.. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో రేటు తగ్గిన పవర్‌ఫుల్ 5జీ స్మార్ట్‌ఫోన్
  9. Samsung : శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ ఖరారు.. లండన్ వేదికగా సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ల లాంచ్
  10. iQOO Z11 : భారత్‎లోకి ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లతో iQOO Z11 ఎంట్రీ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »