Microsoft : మైక్రోసాఫ్ట్ నుంచి ఎన్విడియా గ్రాఫిక్స్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ సర్ఫేస్ లాప్‌టాప్

ప్రముఖ గ్రాఫిక్స్ దిగ్గజం Nvidia భాగస్వామ్యంతో ఈ ల్యాప్‌టాప్‌ను మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసింది. ముఖ్యంగా క్రియేటర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఏఐ రీసెర్చర్లు, హెవీ ప్రొఫెషనల్స్ కోసం ఈ డివైజ్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు.

Microsoft : మైక్రోసాఫ్ట్ నుంచి  ఎన్విడియా గ్రాఫిక్స్‌తో మోస్ట్ పవర్‌ఫుల్ సర్ఫేస్ లాప్‌టాప్

Photo Credit: Microsoft

The new Surface Laptop Ultra will be offered in two colour options

ముఖ్యాంశాలు
  • ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ వచ్చేసింది
  • సూపర్ కంప్యూటర్‌ను ల్యాప్‌టాప్‌లా మార్చేసిన మైక్రోసాఫ్ట్
  • ఎన్విడియా గ్రాఫిక్స్‌తో మైండ్ బ్లాక్ చేస్తున్న సరికొత్త సర్ఫేస్ అల్ట్రా
ప్రకటన

Microsoft : టెక్నాలజీ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటివరకు కంపెనీ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ల్యాప్‌టాప్‌గా పేరుగాంచిన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ అల్ట్రాను అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ గ్రాఫిక్స్ దిగ్గజం  Nvidia భాగస్వామ్యంతో ఈ ల్యాప్‌టాప్‌ను మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసింది. ముఖ్యంగా క్రియేటర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, ఏఐ రీసెర్చర్లు, హెవీ ప్రొఫెషనల్స్ కోసం ఈ డివైజ్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. భారీ ఏఐ మోడల్స్ రన్ చేయడం, 3D రెండరింగ్, సాఫ్ట్‌వేర్ కంపైలేషన్ వంటి అత్యంత కష్టమైన పనులను కూడా ఇది చాలా ఈజీగా చిటికెలో చేసేస్తుంది. 

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ అల్ట్రా ల్యాప్‌టాప్‌లో ఎన్విడియాకు చెందిన లేటెస్ట్ బ్లాక్‌వెల్ ఆర్టీఎక్స్ గ్రాఫిక్స్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించారు. పూర్తి CUDA సపోర్ట్‌తో వస్తున్న మొట్టమొదటి సర్ఫేస్ డివైజ్ ఇదే కావడం విశేషం. ఇది ఏకంగా 1 పెటాఫ్లాప్ ఏఐ కంప్యూట్ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ లేకపోయినా.. ఏకంగా 120 బిలియన్ పారామీటర్లు ఉన్న లోకల్ ఏఐ మోడళ్లను సైతం ఈ ల్యాప్‌టాప్‌లో చాలా స్మూత్‌గా రన్ చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ హార్డ్‌వేర్ మొత్తాన్ని ఎన్విడియా లేటెస్ట్ ఆర్టీఎక్స్ స్పార్క్ వర్క్‌లోడ్స్, నెక్స్ట్ జనరేషన్ విండోస్ ఏఐ ఎక్స్‌పీరియన్స్ కోసం ట్యూన్ చేశారు. అసలు ఆర్టీఎక్స్ స్పార్క్ అంటే.. ఇదొక సరికొత్త సూపర్‌చిప్. ఇందులో బ్లాక్‌వెల్ ఆర్టీఎక్స్ జీపీయూతో పాటు 6,144 CUDA కోర్లు, 5వ జనరేషన్ టెన్సార్ కోర్లు, 20-కోర్ ఎన్విడియా గ్రేస్ సీపీయూ కలిసి ఉంటాయి. అంటే ఇదొక పవర్‌హౌస్ అన్నమాట.

ఈ ల్యాప్‌టాప్‌ను గరిష్టంగా 128జీబీ యూనిఫైడ్ మెమొరీతో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మనం చేసే పనిని బట్టి.. సీపీయూ, జీపీయూల మధ్య సిస్టమ్ రిసోర్సెస్‌ను ఇది డైనమిక్‌గా అలోకేట్ చేస్తుంది. అంటే హెవీ గ్రాఫిక్స్ వర్క్ చేసేటప్పుడు జీపీయూకి ఎక్కువ పవర్, కోడింగ్ చేసేటప్పుడు సీపీయూకి ఎక్కువ పవర్ ఆటోమేటిక్‌గా షిఫ్ట్ అవుతుందన్నమాట. ఈ సర్ఫేస్ ల్యాప్‌టాప్ అల్ట్రాలో 15 ఇంచుల మినీ-ఎల్‌ఈడీ  పిక్సెల్‌సెన్స్ అల్ట్రా టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఏకంగా 2,000 నిట్స్ పీక్ హెచ్‌డీఆర్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ తన సర్ఫేస్ డివైజ్‌లలో ఇప్పటివరకు ఇచ్చిన అత్యంత బ్రైటెస్ట్ డిస్‌ప్లే ఇదే. దీని పిక్సెల్ డెన్సిటీ 262ppi కాగా, ప్రొఫెషనల్ క్రియేటివ్ పనుల కోసం ఇది అత్యంత ఖచ్చితమైన కలర్ అక్యూరెసీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Acer : గేమర్లకు పూనకాలే.. మార్కెట్లోకి ఏసర్‌ ‘పవర్ హౌస్' లాప్‌టాప్

 
ల్యాప్‌టాప్ ఎంత వాడినా వేడెక్కకుండా ఉండటం కోసం ఇందులో అడ్వాన్స్‌డ్ థర్మల్ సిస్టమ్‌ను అమర్చారు. గతంలో వచ్చిన 15 ఇంచుల సర్ఫేస్ ల్యాప్‌టాప్ (7వ ఎడిషన్)తో పోలిస్తే.. దీని థర్మల్ కెపాసిటీ ఏకంగా 2.5 రెట్లు ఎక్కువ. కనెక్టివిటీ పరంగా చూస్తే.. ఇందులో హెచ్‌డీఎమ్‌ఐ (HDMI) పోర్ట్, యూఎస్‌బీ టైప్-సి పోర్టులు, యూఎస్‌బీ టైప్-ఏ పోర్ట్, ఎస్‌డీ కార్డ్ స్లాట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి అన్ని రకాల ఆప్షన్లను ఇచ్చారు. ఈ ల్యాప్‌టాప్‌లో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇప్పటివరకు రూపొందించిన వాటిలోనే అతిపెద్ద హ్యాప్టిక్ టచ్‌ప్యాడ్‌ను అమర్చింది. అలాగే ఫేషియల్ రికగ్నిషన్ కోసం విండోస్ హెల్లో ఫీచర్ కూడా ఉంది. మరొక మంచి విషయం ఏంటంటే, ఈ ల్యాప్‌టాప్‌ను రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. దీని లోపల విడిభాగాలను సులభంగా గుర్తించేలా ఇంటర్నల్ వేఫైండింగ్  డిజైన్ చేశారు. పాడైపోయిన పార్ట్స్‌ను మార్చుకోవడానికి విడిగా స్పేర్ పార్ట్స్‌ను కూడా కంపెనీయే అమ్మబోతోంది.

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ అల్ట్రా ప్లాటినం, నైట్‌ఫాల్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఈ ల్యాప్‌టాప్‌ను ఈ ఏడాది చివర్లోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ కన్ఫర్మ్ చేసింది. అయితే దీని ధర ఎంత ఉంటుంది? భారతదేశంతో పాటు ఏ ఏ దేశాల్లో మొదట రిలీజ్ చేస్తారు? అనే వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »