ఈ సమ్మర్ సేల్‌లో కింగ్‌డమ్ కమ్: డెలివరెన్స్ 2, నియో 3, డిస్పాచ్, కాల్ ఆఫ్ డ్యూటీ: బ్లాక్ ఆప్స్ 7 వంటి క్రేజీ గేమ్‌లు భారీ ఆఫర్లతో లభిస్తున్నాయి.
Photo Credit: Steam
Steam Summer Sale began on June 25
Steam Summer Sale : కంప్యూటర్లలో గేమింగ్ పిచ్చి ఉన్న పీసీ గేమర్లందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే స్టీమ్ సమ్మర్ సేల్ అధికారికంగా ప్రారంభమైంది. వివిధ కేటగిరీలకు చెందిన వేలాది పాపులర్ గేమ్‌లపై స్టీమ్ సంస్థ భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ మోస్ట్ అవైటెడ్ సేల్ జూన్ 25 నుంచే లైవ్‌లోకి వచ్చేసింది. ఇది వచ్చే నెల జూలై 9వ తేదీ ఉదయం 10 గంటల (PT టైమింగ్స్) వరకు అందుబాటులో ఉంటుంది. అంటే మీకు నచ్చిన బెస్ట్ గేమ్‌లను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈ సమ్మర్ సేల్‌లో కింగ్‌డమ్ కమ్: డెలివరెన్స్ 2, నియో 3, డిస్పాచ్, కాల్ ఆఫ్ డ్యూటీ: బ్లాక్ ఆప్స్ 7 వంటి క్రేజీ గేమ్‌లు భారీ ఆఫర్లతో లభిస్తున్నాయి.
కొత్తగా రిలీజైన గేమ్‌లపై అదిరిపోయే ఆఫర్లు
ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన పలు సరికొత్త గేమ్‌లపై కూడా స్టీమ్ ఈసారి మంచి డిస్కౌంట్లను ఇస్తోంది. కాప్‌కామ్ కంపెనీకి చెందిన పాపులర్ హర్రర్ గేమ్ రెసిడెంట్ ఈవిల్ రిక్వియమ్ ఫిబ్రవరిలోనే లాంచ్ కాగా, ఇప్పుడిది 20 శాతం తగ్గింపుతో కేవలం రూ.3,519 కే లభిస్తోంది. అలాగే ఇండీ హిట్ గేమ్ మ్యూజెనిక్స్ 25 శాతం డిస్కౌంట్ తర్వాత రూ. 975 కి అందుబాటులో ఉంది. హ్యాండ్-డ్రాన్ యానిమేషన్ స్టైల్‌తో ఆకట్టుకునే ఫస్ట్-పర్సన్ షూటర్ గేమ్ 'మౌస్: పి.ఐ. ఫర్ హైర్' కూడా 20 శాతం ఆఫర్‌తో రూ. 1,040 కే దొరుకుతోంది.
పాత సూపర్ హిట్ గేమ్‌లపై భారీ కొల్లగొట్టే డిస్కౌంట్లు: కేవలం రూ. 179 కే విట్చర్ 3!
కొత్త వాటితో పాటు గతంలో గేమింగ్ ప్రపంచాన్ని ఊపేసిన పెద్ద పెద్ద గేమ్‌లపై స్టీమ్ ఊహించని రేంజ్‌లో రేట్లు తగ్గించేసింది. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఆర్‌పీజీ గేమ్‌గా పేరు తెచ్చుకున్న ది విట్చర్ 3: వైల్డ్ హంట్ పై ఏకంగా 90 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. దీంతో ఈ గేమ్ ఇప్పుడు కేవలం రూ. 179 కే సొంతం చేసుకోవచ్చు. ఇక గేమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న క్లైర్ అబ్స్క్యూర్: ఎక్స్‌పెడిషన్ 33 గేమ్ 20 శాతం ఆఫర్‌తో రూ. 2,399 కి లభిస్తుండగా, సిడ్ మేయర్స్ సివిలైజేషన్ VII 50 శాతం భారీ తగ్గింపుతో రూ. 1,999 కే అందుబాటులోకి వచ్చింది.
90 శాతం ఆఫర్ల జోరు
ది విట్చర్ 3 లాగే మరికొన్ని మోస్ట్ పాపులర్ గేమ్‌లపై స్టీమ్ ఏకంగా 90 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌ను బాదేసింది. ఇందులో ఫార్ క్రై 4, ఘోస్ట్‌వైర్ టోక్యో, డిష్ హానర్డ్, ఏ ప్లేగ్ టేల్: ఇన్నోసెన్స్ కాల్ ఆఫ్ డ్యూటీ: మోడరన్ వార్‌ఫేర్ 2 వంటి టాప్ రేటెడ్ గేమ్‌లు ఉన్నాయి. వీటితో పాటు గేమర్స్ ఫేవరెట్ అయిన కల్ట్ ఆఫ్ ది లాంబ్, రస్ట్ గేమ్‌లు 50 శాతం డిస్కౌంట్‌తో వరుసగా రూ. 449 మరియు రూ. 899 లకే లభిస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో వచ్చిన పవర్‌వాష్ సిమ్యులేటర్ 2 కూడా 20 శాతం ఆఫర్‌తో రూ.800కి, ఇండీ మాస్టర్‌పీస్ హేడిస్ 75 శాతం తగ్గింపుతో కేవలం రూ. 275 కే దొరుకుతున్నాయి.
కొత్త గేమ్‌లు, 2025 బెస్ట్ గేమ్‌ల కలెక్షన్లపై తాజా రేట్లు
మీకోసం కొన్ని బెస్ట్ కొత్త గేమ్‌ల ఆఫర్ల వివరాలను చూస్తే.. నియో 3 గేమ్ 30 శాతం ఆఫర్‌తో రూ.3,430కి దొరుకుతోంది. మారథాన్ గేమ్ 30 శాతం తగ్గింపుతో రూ.1,714కి, యానిమల్ గేమ్ 25 శాతం ఆఫర్‌తో రూ.1,200కి, కేర్న్ గేమ్ రూ.975కి లభిస్తున్నాయి. ఇక 2025 నాటి బెస్ట్ గేమ్‌లలో ఒకటైన డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్ 20 శాతం తగ్గింపుతో రూ.3,999కి, కింగ్‌డమ్ కమ్: డెలివరెన్స్ 2 గేమ్ 60 శాతం భారీ ఆఫర్‌తో రూ.1,344కి, స్ప్లిట్ ఫిక్షన్ రూ.1,624కి సేల్‌లో ఉన్నాయి.
ఎప్పటికీ బోర్ కొట్టని పాపులర్ గేమ్‌లు
ఎప్పటికీ క్రేజ్ తగ్గని గేమ్‌ల విషయానికి వస్తే, గ్రాండ్ తెఫ్ట్ ఆటో 5 (GTA 5) ఎన్‌హ్యాన్స్‌డ్ ఎడిషన్ 50 శాతం డిస్కౌంట్‌తో రూ.1,249కి అందుబాటులో ఉంది. అలాగే రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 (RDR 2) పై 74 శాతం భారీ ఆఫర్ ఇవ్వడంతో ఇది రూ.1,249కే లభిస్తోంది. సైబర్‌పంక్ 2077 గేమ్ 70 శాతం ఆఫర్‌తో రూ.899కి, బాల్డర్స్ గేట్ 3 రూ. 2,249 కి, ఫాల్అవుట్ 76 గేమ్ 75 శాతం భారీ డిస్కౌంట్‌తో కేవలం రూ.624కే సొంతం చేసుకోవచ్చు.
Nothing Phone 4b : నథింగ్ నుంచి సరికొత్త బి సిరీస్ స్మార్ట్‌ఫోన్.. జూలై 7న నథింగ్ ఫోన్ 4బి లాంచ్
బడ్జెట్ గేమర్ల కోసం బంపర్ ఆఫర్
మీ బడ్జెట్ రూ.500 లోపు ఉంటే, సన్స్ ఆఫ్ ది ఫారెస్ట్ గేమ్ రూ.390కి, డెడ్ స్పేస్ రూ.299కి, కప్‌హెడ్ రూ.395కి, అస్సాసిన్స్ క్రీడ్ ఒడిస్సీ రూ.449కి, రెసిడెంట్ ఈవిల్ 7 బయోహాజార్డ్ రూ.439కి దొరుకుతున్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ రూ.250లోపే అయితే ఇంకా పెద్ద జాక్‌పాట్ అని చెప్పాలి. హిట్ మాన్ వరల్డ్ ఆఫ్ అసాసినేషన్ గేమ్ ఏకంగా రూ.70కే లభిస్తోంది. ఈఏ స్పోర్ట్స్ ఎఫ్‌సీ 26 గేమ్ రూ.150కి, డెట్రాయిట్ బికమ్ హ్యూమన్ రూ.199కి, బాట్‌మ్యాన్: ఆర్కమ్ నైట్ రూ.202కి, మెట్రో ఎక్సోడస్ గేమ్ రూ. 225 లకే క్లియరెన్స్ సేల్‌లో ఉన్నాయి.
యాక్షన్, ఆర్‌పీజీ, సిమ్యులేటర్ ప్రియుల కోసం ప్రత్యేక ధరలు!
రోల్-ప్లేయింగ్ (RPG) గేమ్‌లలో డయాబ్లో IV 40 శాతం ఆఫర్‌తో రూ. 2,496 కి, ఫైనల్ ఫాంటసీ VII రీబర్త్ 60 శాతం ఆఫర్‌తో రూ. 1,399 కి లభిస్తున్నాయి. యాక్షన్-అడ్వెంచర్ కేటగిరీలో గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ రూ. 2,679 కి, స్టెల్లార్ బ్లేడ్ రూ. 3,215 కి, మోన్‌స్టర్ హంటర్ వైల్డ్స్ 58 శాతం ఆఫర్‌తో రూ. 1,889 కి దొరుకుతున్నాయి. సిమ్యులేటర్ లేదా స్ట్రాటజీ గేమ్‌లలో క్రుసేడర్ కింగ్స్ 3 రూ. 941 కి, టోటల్ వార్: వార్‌హామర్ 3 రూ. 644 కి లభిస్తుండగా, షూటర్ గేమ్‌లలో హెల్‌డైవర్స్ 2 రూ. 1,874 కి, బ్యాటిల్‌ఫీల్డ్ 6 రూ. 1,999 కి, వార్‌హామర్ 40,000: స్పేస్ మెరైన్ 2 గేమ్ ఏకంగా 70 శాతం డిస్కౌంట్‌తో రూ. 839 కే అందుబాటులో ఉన్నాయి. మీ ఫేవరెట్ గేమ్‌లను లైబ్రరీకి యాడ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
God of War Laufey Pre-Orders Begin September 29; Digital Deluxe Edition, New Combat Details Revealed